
గంగుల భానుమతి
సాక్షి, అనంతపురం: మద్దెలచెరువు సూరీ హత్యకేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్‌కు ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు విధించాలని సూరీ భార్య గంగుల భానుమతి హైకోర్టును అభ్యర్థించారు. మద్దెలచెరువు సూరీ హత్యకేసు విషయమై ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమకు హైకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని అన్నారు.
భానుకిరణ్ సూరీ పేరు చెప్పి జిల్లాలో సూమారు 700 కోట్ల రూపాయలు సెటిల్‌మెంట్లు చేశారని ఆరోపించారు. తన భర్త సూరీ హత్య వెనుక మంత్రి పరిటాల సునీత హస్తం ఉందని ఆమె ఆరోపించారు. పరిటాల కుటుంబం అండ లేకపోతే భానుకిరణ్ ఇంతటి దారుణానికి పాల్పడేవాడు కాదని అన్నారు. పరిటాల కుటుంబ అండతోనే ఈ దారుణానికి పాల్పడ్డాని భానుమతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment