సాక్షి, అనంతపురం: హంద్రీనీవా నుంచి పేరూరు డ్యామ్‌కు నీరు తరలించాలన్న కల సాకారమైందని.. దివంగత మహానేత వైఎస్సార్ ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ పేరూరు డ్యామ్‌కు హంద్రీనీవా నీరు చేరటం హర్షణీయమన్నారు. కమీషన్ల కక్కుర్తితో పరిటాల సునీత హంద్రీనీవా పనులను నిర్లక్ష్యం చేశారని, అంచనాలు పెంచి పరిటాల కుటుంబం దోపిడీకి పాల్పడిందని విమర్శించారు. 119 కోట్ల పనులను 1100 కోట్ల రూపాయలకు పెంచి నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తక్కువ వ్యయంతోనే మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి పేరూరు డ్యామ్‌కు కృష్ణా జలాలను పేరూరు డ్యామ్‌కు తీసుకెళ్లామని.. రాప్తాడు అభివృద్ధిని చూసి పరిటాల సునీత ఓర్వలేకపోతున్నారన్నారు.
(వ్యర్థాల నిర్వహణకు 'ఆన్‌లైన్' వేదిక ప్రారంభం)
మాజీ ఎంపీ దివంగత అనంత వెంకటరెడ్డి విగ్రహానికి కృష్ణా జలాలతో అభిషేకం..
మాజీ ఎంపీ దివంగత అనంత వెంకటరెడ్డి విగ్రహానికి కృష్ణా జలాలతో వైఎస్సార్‌సీపీ నేతలు,కార్యకర్తలు అభిషేకం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టుకు 2007లో అనంత వెంకటరెడ్డి పేరు పెట్టారు. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ 2015లో ప్రాజెక్టుకు ఆయన పేరును తొలగించింది. హంద్రీనీవా ప్రాజెక్టుకు అనంత వెంకటరెడ్డి పేరును పునరుద్ధరిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment