జనం మెచ్చని శ్రీరామ్‌ | Rapthadu TDP MLA Candidate Paritala Sreeram Campaign | Sakshi
Sakshi News home page

జనం మెచ్చని శ్రీరామ్‌

Published Wed, Apr 10 2019 7:36 PM | Last Updated on Wed, Apr 10 2019 7:36 PM

Rapthadu TDP MLA Candidate Paritala Sreeram Campaign - Sakshi

పేరూరులో టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌ సభకు జనం లేని దృశ్యం , గత ఆదివారం రాత్రి పేరూరులో ప్రకాష్‌రెడ్డి సభకు హాజరైన భారీ జనం

సాక్షి, రామగిరి: రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌కు మంగళవారం పేరూరులో చుక్కెదురైంది. ప్రచారంలో చివరి రోజున భారీ బహిరంగసభకు స్థానిక టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేశారు. అయితే ఊహించినంత జనం రాకపోవడంతో శ్రీరామ్‌ నిరాశకు గురయ్యారు. ఈ నెల ఏడో తేదీన రాత్రి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేరూరు బస్టాండ్‌ ప్రాంతంలో బహిరంగసభ నిర్వహిస్తే జనం తరలివచ్చి విజయవంతం చేశారు. అయితే పరిటాల కోటగా పిలిచే రామగిరి మండలం పేరూరులో మంగళవారం పరిటాల శ్రీరామ్‌ సభకు వందలాదిమందికూడా రాకపోవడం గమనార్హం. పాతికేళ్లుగా పరిటాల కుటుంబం ఎమ్మెల్యేగా, మంత్రులుగా అధికారంలో ఉండి కూడా కనీససౌకర్యాలు కల్పించడంలో విఫలమవడంతో జనం వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గుచూపారని పలువురు చర్చించుకొంటున్నారు. ఐదేళ్లుగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని రామగిరి మండలంలోకి అడుగు పెట్టనీకుండా పోలీసులు, టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. కానీ రెండు రోజుల క్రితం పేరూరుకు ప్రకాష్‌రెడ్డి రాగానే మండల వాసులు, ప్రజలు ఘనస్వాగతం పలకడం విశేషం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement