
సాక్షి, అనంతపురం(రామగిరి): పంచాయతీ ఎన్నికల వేళ మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బ తగిలింది. రామగిరి టీడీపీ మండల కన్వీనర్‌గా ఉన్న సుబ్బరాయుడు ఆదివారం తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనను ఏ మాత్రం పట్టించుకోలేదని, దీంతో కన్వీనర్‌గా తాను ఏమీ చేయలేకపోయానన్నారు.