సాక్షి, పుట్టపర్తి: ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి.. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ కార్యకర్తలు నానా హంగామా చేశారు. మారణాయుధాలతో దాడికి దిగారు. పోలింగ్ కేంద్రాల్లో దూరడంతో పాటు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయతి్నంచారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగే పోలింగ్ కేంద్రాల వద్ద అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఎక్కడికక్కడ జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
👉 పుట్టపర్తి నియోజకవర్గం ఓడీ చెరువు మండలం కుసుమవారిపల్లిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు డీలర్ ఇంద్రప్పపై టీడీపీ అల్లరిమూకలు మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచారు.
👉 పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం గోనిమేకపల్లిలో టీడీపీ కార్యకర్తలు హల్‌చల్ చేశారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై దాడి చేసేందుకు యతి్నంచారు. తోపులాటలో పలువురు గాయపడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి అదుపు చేశారు.
👉 పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం కొడపగానిపల్లిలో దొంగ ఓట్లు వేసేందుకు టీడీపీ కార్యకర్తలు ప్లాన్ చేశారు. అయితే అధికారులు అడ్డుకోవడంతో దాడులకు దిగే ప్రయత్నం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి చెదరగొట్టారు.
👉 హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి నిబంధనలు తుంగలో తొక్కారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లు అభ్యర్థించారు. ఓటర్లతో కరచాలనం చేస్తూ సెలీ్ఫలకు ఫోజులు ఇచ్చారు. ఫలితంగా సామాన్యులు ఇబ్బందులు పడ్డారు.
పోలింగ్‌బూత్ వద్ద
పరిటాల శ్రీరామ్ హల్‌చల్..
రామగిరి మండలం పెద్దకొండాపురంలోని పోలింగ్‌బూత్ వద్ద మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ తన అనుచరులతో కలసి హల్‌చల్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మందీమార్బలంతో పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయతి్నంచారు. తాను రాప్తాడు టీడీపీ ఎన్నికల చీఫ్‌నంటూ పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయతి్నంచారు. ఈ క్రమంలో అక్కడున్న వారిపై దురుసుగా ప్రవర్తించారు.
దీంతో స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు, గ్రామస్తులు తిరగబడి అడ్డుకున్నారు. చీఫ్ ఏజెంట్ అయితే అందుకు సంబంధించిన కాపీ చూపాలంటూ పట్టుబట్టారు. ఇందుకు ఆయన సముఖత చూపకపోవడంతో పరిటాల శ్రీరామ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని శ్రీరామ్‌ను వారించి అక్కడి నుంచి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment