కేంద్రం నూతనంగా విడుదల చేసిన రూ.2వేల కరెన్సీ నోట్లను కలర్ జిరాక్స్ తీసుకుని ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు.
అనంతపురం సెంట్రల్ : కేంద్రం నూతనంగా విడుదల చేసిన రూ.2వేల కరెన్సీ నోట్లను కలర్ జిరాక్స్ తీసుకుని ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. అతన్ని అనంతపురం నాల్గవ పట్టణ ఎస్‌ఐ శ్రీరామ్ అదుపులోకి తీసుకున్నారు. రాప్తాడు మండల కేంద్రానికి చెందిన రామలింగారెడ్డి శుక్రవారం రూ. 2వేల నోటును కలర్ జిరాక్స్ తీసి కొన్ని తన వద్ద ఉంచుకున్నాడు.
నకిలీ నోట్లు వస్తే ఇలా ఉంటాయంటూ అందరికీ చూపిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. ఎస్‌ఐ శ్రీరామ్ జాతీయ రహదారిలోని ఎస్‌వీ బార్‌లో ఉన్న సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని జిరాక్స్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటివి తయారు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.