Live Updates..
రాప్తాడు భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- ఈరోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తోంది. జనసముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జలసముద్రం వస్తే ఈరోజు రాప్తాడుకు జనసముద్రం వచ్చింది.
- ఈ జన సముద్రానికి, రాయలసీమ గడ్డకు, ఇక్కడున్న ప్రతి రాయలసీమ బిడ్డకూ మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు.
- ఈ 2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతోంది.
- ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకొనే ఎన్నికలుమాత్రమే కావు.
- ఇవి ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికీ మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి ఈ పథకాలన్నీ కొనసాగాలని అడుగులు వేసే మనకు.. ఈ పథకాలన్నీ రద్దు చేయడమే టార్గెట్‌గాపెట్టుకొని డ్రామాలాడుతున్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా?
- పేదలు ఒకవైపున ఉంటే, పెత్తందార్లు మరోవైపున ఉండి ఈ యుద్ధం జరగబోతోంది.
- మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు, మాటతప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందార్లకు మధ్యజరగబోతోంది ఈ యుద్ధం.
- ఈ యుద్ధం విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరగబోతోంది.
- ఇలాంటి యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కోసం, పేదవాడి తరఫున నిలబడటానికి మీరంతా కూడా సిద్ధమేనా?
- ఈ యుద్ధం వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడూ మన రాష్ట్రానికి వచ్చిపోతున్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్‌కు, ఈ గడ్డమీదే పుట్టి, ఈ గడ్డమీదే మమకారంతో ఇక్కడే ఇల్లు కట్టుకుని ఇక్కడే ప్రజల మధ్యే ఉన్న మనకూ మధ్య జరగబోతోంది.
- ఈ వేదికమీద నుంచి చంద్రబాబునాయుడు గారికి ఒక సవాల్ విసురుతున్నా. 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు.
- మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతున్నా.
- రెండు చేతులూ పైకెత్తి ఇలా ఇలా ఇలా..
- అయ్యా చంద్రబాబూ.. మీ పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా?
- చంద్రబాబు పేరు చెబితే బడికి వెళ్లే పిల్లలకైనా, కాలేజీలకు వెళ్లే పిల్లలకైనా కనీసం వారికైనా గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా?
- పోనీ చంద్రబాబు పేరు చెబితే కనీసం అవ్వాతాతలకైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు, మా పెన్షన్ మా ఇంటికే పంపాడు అన్న పరిస్థితి అయినా ఉందా?
- చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఫలానా మంచి చేశాడని, మంచి పథకం తీసుకొచ్చాడని కనీసం చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు.
- చంద్రబాబు పేరు చెబితే కనీసం ప్రజల ఆరోగ్యం కోసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా?
- ప్రజల ఆరోగ్యం కోసం కనీసం తెచ్చిన ఒక్క స్కీమయినా ఉందా?
- బాబు పేరు చెబితే రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో అయినా, ఆ గ్రామం మధ్యనిలబడి మీరు ఏర్పాటు చేసిన పరిపాలన వ్యవస్థ.. కనీసం ఒక్కటైనా కనిపిస్తుందా?
- ఆ గ్రామంలో కనీసం బాగుపడిన స్కూళ్లయినా, హాస్పటల్స్ అయినా ఉన్నాయా?
- 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు, మూడు సార్లు సీఎం అయ్యారు. అయినా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో అయినా సరే ఎవరైనా ఆ గ్రామంలో ఆగినా, ఆ గ్రామంలో అయ్యా చంద్రబాబూ.. మీ మార్క్ ఎక్కడైనా ఉందా? అని అడుగుతున్నా.
- బాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం కనీసం ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా?
- ప్రతి సామాజికవర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగు రంగులుగా రాయడం, ఆ తర్వాత సామాజికవర్గాలన్నింటినీ మోసం చేయడం.. ఇదే ఆయనవాయితీగా చంద్రబాబు పెట్టుకున్నారు.
- 1995లో చూసినా, 1999లో చూసినా, లేదా 2014లో చూసినా సీఎం అయిన ఈ పెద్దమనిషి చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీ తరఫున మేనిఫెస్టో ఇచ్చి.. ఏనాడైనా కనీసం 10 శాతం అయినా అమలు చేశారా?
- గతం ప్రజలకు గుర్తు ఉండదు అన్న నమ్మకంతో ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధాలు, మోసాలు, మరకో మేనిఫెస్టో పట్టుకొని బంగారు కడియం ఇస్తానని ఊబిలోకి దింపి మనుషుల్ని తినేసే కథ ఆ పులి మాదిరిగా ఈరోజు ఎర చూపిస్తున్నాడు.
- రంగు రంగుల మేనిఫెస్టో అంటున్నాడు. ఆరు స్కీములంటాడు. ఇంకా ఆరు రావాల్సినవి ఉంటాయంటాడు.
- నిజంగా చంద్రబాబు మనస్తత్వం ఎలాంటిదంటే.. చేసేది ఎలాగూ మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు భావదారిద్ర్యం ఎందుకన్నది బాబు నైజం.
- ఎలాగూ చేసేది లేదు. చెప్పేది అబద్ధాలు. చేసేది మోసమే కాబట్టి, ఇక నోటికి కట్టి ఎందుకు, అబద్ధాలు చెప్పేటప్పుడు భావదారిద్ర్యం ఎందుకున్నది బాబు నైజం.
- నమ్మిన వాడు మునుగుతాడు. నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడన్నది బాబు సిద్ధాంతం.
- మూడుసార్లు సీఎం అయ్యాడు. మూడు సార్లు మేనిఫెస్టోను పెట్టాడు. ప్రతి సందర్భంలోనూ తాను చేసింది మోసం, దగా కళ్ల ఎదుటే కనిపిస్తోంది.
- చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని ఏనాడూ అమలు చేయలేదన్న నిజాన్ని ఇంటింటికీ వెళ్లి ఇక్కడున్న ప్రతి కార్యకర్త వెళ్లి చెప్పాలి.
- చంద్రబాబును, ఆయన అబద్ధాల్ని నమ్మకండి అని చెప్పాలి.
- బాబు మోసాల్ని భరించలేకే కదా ఐదేళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాలూ మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీల్ని కూడా మడిచి చీపుర్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతున్నా.
- అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా?
- ఈ చంద్రబాబును సవాల్ చేస్తున్నా. 14 ఏళ్లు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమయినా గుర్తుకొస్తుందా?
- మరి ఈ పెద్దమనిషి చంద్రబాబు చేయలేని పనులన్నీ దేవుడి దయతో మనం కేవలం ఈ 57 నెలల పాలనలోనే ఎంత చిత్తశుద్ధితో, ఎంతటి మమకారంతో చేశామో ఇవాళ నాలుగు మాటలతో వివరిస్తా.
- ఆ పథకాలన్నీ ఇకమీదట కొనసాగాలంటే ప్రతి పేద కుటుంబానికి, ప్రతి రైతన్నకు, అక్కచెల్లెమ్మకు, విద్యార్థికీ, అవ్వాతాతకు, ప్రతి సామాజికవర్గానికి ఎంతటి అవసరమో మన పాలన ప్రజలందరికీ వివరించే బాధ్యత మనం తీసుకోవాలి.
- ఈ 57 నెలల్లో కనీవినీ ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.
- ఇంకా కొనసాగాల్సిన అవసరం ఎంత ముఖ్యమో, అవసరమో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి అన్నకూ, తమ్ముడికి, రైతన్నకు చెప్పాలి.
- పథకాలు అందుకున్న ప్రతి కుటుంబం మనకు స్టార్ క్యాంపెయినర్‌గా వారందరూ కూడా ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందని, ఆ అవసరాన్ని వైయస్సార్ సీపీలో ఉన్న ప్రతి కార్యకర్తా, ప్రతి నాయకుడు, ప్రతి వాలంటీర్ ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరికీ వివరించాలి.
- వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాల్సిన అవసరాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది.
- మనం చేసినవి చెప్పాలి. వాటి కొనసాగింపు ఎంత అవసరమో ప్రతి ఇంట్లో కూడా వెళ్లి చెప్పాలి.
- నేను చెబుతున్న ప్రతి మాటా జాగ్రత్తగా ఆలోచన చేసి వినాలి.
- మనకు, మన వైయస్సార్‌సీపీకి, ప్రజలు 2019లో ఒక్కసారి అధికారం ఇస్తేనే రైతులకు అదనంగా ఇంతకు ముందు చూడని విధంగా ఒక రైతన్నకు రైతు భరోసా తీసుకొచ్చి ఇచ్చాం.
- గ్రామాల్లో రైతన్నకు చేయి పట్టుకొని నడిపించే ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చి రైతన్నకు తోడుగా నిలిచాం.
- పగటిపూటే రైతన్నకు 9 గంటల ఉచిత విద్యుత్ తీసుకొచ్చాం.
- ఏ సీజన్‌లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్‌పుట్‌సబ్సిడీ ఇవ్వటం మొదలు పెట్టింది మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతే.
- ఉచిత పంటల బీమా ఇస్తున్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే.
- గతంలో ఏ రైతన్న చూడని విప్లవాత్మక మార్పులు ఇవీ.
- ఈ పథకాలన్నీ ప్రతి రైతన్నకూ కొనసాగాలన్నా, రైతుల్ని పీడించే బాబు మార్క్ దళారీ వ్యవస్థ మళ్లీ రాకూడదన్నా ప్రతి రైతన్న స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు వచ్చి ఇంకో వంద మందికి చెప్పాల్సిన అవసరం ఉంది.
- విందు భోజనం పెడతానని, బిర్యానీ పెడతానని మోసపూరిత ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెను లాక్కోవడానికి అడుగులు వేస్తున్నాడు.
- గతంలో ఇదే పెద్దమనిషి చంద్రబాబు బేషరతుగా చేస్తానన్న 87612 కోట్ల రుణ మాఫీని ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకూ గుర్తు చేయాల్సిన అవసరం మన ప్రతి కార్యకర్తకూ ఉంది.
- 2019లో సీఎం అయిన మీ జగన్ పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా అమ్మ ఒడి, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్లపట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం.. అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్, మహిళా పోలీస్.. ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరుగుతున్నాయి.
- ఇవన్నీ ప్రతి ఒక్కచెల్లెమ్మలకు కొనసాగాలంటే మహిళా సాధికారత కోసం ఇంతగా అండగా ఉన్న జగనన్న ప్రభుత్వానికి అండగా ఉండాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని, మరో వంద మందితో ఓటు వేయించాల్సిన బాధ్యత ఉందని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి ఒక్కరిపై ఉంది.
- అవ్వాతాతల చిరునవ్వుల మధ్య వాళ్లందరికీ ఓ మాట చెప్పండి.
- ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాసు ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలి. అక్కచెల్లెమ్మలకు మీరంతా ప్రతి ఒక్కరూ అర్థమయ్యేలా చెప్పండి.
- మన పార్టీ పేరు చెబితే మీ జగన్ పేరు చెబితే గవర్నమెంట్ బడులకు వెళ్లే పిల్లలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఇంగ్లీషు మీడియం, విద్యాకానుక, గోరుముద్ద, బాగుపడుతున్న స్కూళ్లు, మొదటిసారి వారి పుస్తకాలకు బైజూస్ కంటెంట్ అనుసంధానం, టెక్స్ట్ బుక్కుల్లో బైలింగ్వల్ టెక్స్‌ట్ బుక్స్, ట్యాబులు, క్లాసు రూముల్లో 6వ తరగతి పైబడిన క్లాసు రూముల్లో డిజిటల్ బోధనతో ఐఎఫ్‌పీ ప్యానల్స్‌తో కనిపిస్తున్నాయి.
- మొదటిసారి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, టోఫెల్ సైతం బోధన చేయడం జరుగుతోంది.
- సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం సాగుతోంది.
- పెద్ద చదువులు చదువుతున్న వారికి ఏ క్వార్టర్‌లో ఉన్న ఫీజులు ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్ష్‌మెంట్ వేస్తూ విద్యా దీవెన, వసతి దీవెన, జాబ్ ఓరియెంటెడ్‌గా కరిక్యులమ్‌లో మార్పులు, ఆన్లైన్ వర్టికల్స్ చదువులతో అనుసంధానం.. ఇవన్నీ కూడా ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులకు వాళ్ల ఇంటికి వెళ్లిప్పుడు అడగండి. ఇంతకు ముందుకు ఇప్పటికి తేడా ఎంతలా ఉందో గమనించాలని అడగండి.
- తల్లిదండ్రులు, పిల్లల్ని ఇవన్నీ కొనసాగాలంటే ఆ పిల్లలు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడాలంటే, పెత్తందార్లతో పోటీ పడే పరిస్థితి జరగాలంటే అది చేయగలిగింది కేవలం మీ అన్న ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుందని చెప్పండి.
- ఒకటో తరగతిలో ఉన్న పేదింటి పాప, పేదింటి బాబు.. మరో 10-15 సంవత్సరాల్లో అంతర్జాతీయ చదువులతో, పెత్తందార్ల పిల్లలకన్నా మించిపోయి ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతూ పేద పిల్లలకు వేరే దేశాల్లో గొప్ప ఉద్యోగాలు రావాలంటే ఇటువంటి విప్లవాత్మక మార్పులు కొనసాగాలంటే కేవలం మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
- ఫ్యాన్ గుర్తుకు ఓటేయడమంటే వారి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టే ప్రభుత్వానికి ఓటేయడం, సైకిల్‌కు ఓటేయడం అంటే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం రద్దుకు ఓటేస్తున్నాం అని గుర్తుపెట్టుకోవాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
- ఇవన్నీ కొనసాగాలంటే స్టార్ క్యాంపెయినర్లుగా మారి మరో వంద మందికి చెప్పి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పండి.
- జగన్ పేరు చెబితే, వైయస్సార్ సీపీ పేరు చెబితే అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు మా జగన్, మా పెన్షన్ అందరికీ ఇచ్చాడు, వెయ్యి నుంచి రూ.3 వేలు చేశాడు, వాలంటీర్ ద్వారా ఆదివారమైనా సెలవైనా ఒకటో తేదీ సూర్యోదయానికి కంటే ముందే చిక్కటి చిరునవ్వుతో మా చేతిలో పెడుతున్నాడు, ఇది కేవలం మీ జగన్ ఉంటేనే కొనసాగుతుందని చెప్పండి.
- పెన్షన్ కొనసాగాలన్నా, భవిష్యత్‌లో పెరగాలన్నా, కొందరికే మళ్లీ పెన్షన్లు ఇచ్చే రోజులు రాకూడదన్నా, లంచాల జన్మభూమి కమిటీలు కాటేయకూడదన్నా, ఇంటికొచ్చిపోయే వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలన్నా వైయస్సార్‌సీపీ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే ఇవన్నీ జరుగుతాయని ఇంటింటికీ వెళ్లి చెప్పాల్సిన అవసరం ఉంది.
- ప్రతి అవ్వా, ప్రతి తాతా, వికలాంగ సోదరుడు, అక్కచెల్లెమ్మ బయటకొచ్చి వంద మందికి చెప్పి జరుగుతున్న మంచి కొనసాగాలంటే కేవలం మీ అన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుందని ప్రతి ఇంటికీ చెప్పాల్సిన అవసరం ఉంది.
- మీ జగన్, వైయస్సార్‌సీపీ పేరు చెబితే ఈరోజు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ విస్తరించిన ఆరోగ్యశ్రీ కనిపిస్తుంది. 104, 108 వాహనాలు కొత్తగా కనిపిస్తాయి. ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్,ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్షతో జల్లెడ పడుతూ ఎవరికి బాగోలేకపోయినా మందులు ఇంటికి ఇచ్చిపోయే గొప్ప వ్యవస్థ కనిపిస్తుంది.
- కోవిడ్ కష్టకాలంలో కూడా అందించిన సేవలు గుర్తుకొస్తాయి.
- పేదలు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్నా, గడపగడపకూ వైద్యం అందించే పరిస్థితి కొనసాగాలన్నా, ఇంతకు మించిన మంచి ఆ కుటుంబాలకు జరగాలన్నా మనందరి ప్రభుత్వానికి ఆ పేదలను అండగా దండగా నిలబడాలని, వారే స్టార్ క్యాంపెయినర్లుగా మారాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
- 2019లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలోని ఏ గ్రామమైనా ఆ గ్రామానికి వెళ్లి అక్కడ నిల్చుంటే ఓ విలేజ్ సెక్రటేరియట్ కనిపిస్తుంది. 10 మంది శాశ్వత ఉద్యోగాలు చేస్తున్న మన పిల్లలు కనిపిస్తారు.
- నాలుగడుగులు ముందుకేస్తే ఆర్బీకే కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్, కడుతున్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. నాడునేడుతో రూపు మారిన బడులు, హాస్పిటల్స్ కనిపిస్తాయి. ప్రతి 50-60 ఇళ్లకు చేయి పట్టుకొని నడిపించే ఓ మంచి వాలంటీర్ వ్యవస్థ ఒక్క రూపాయి కూడా లంచం అడగకుండా వివక్ష చూపకుండా మంచి చేస్తున్న వ్యవస్థ కనిపిస్తుంది.
- ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయి అంటే.. అది ఈ 57 నెలల్లో మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరిగాయి అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాల్సిన అవసరం ఉంది.
- ఈరోజు వివక్ష లేకుండా, లంచం లేకుండా మీ బిడ్డ, మీ అన్న అక్షరాలా 125 సార్లు బటన్ నొక్కాడు. ఏకంగా 2.55 లక్షల కోట్లు పంపిన మాట వాస్తవం కాదా అని ప్రతి అక్కను, చెల్లెమ్మను అడగండి.
- కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో ఆగినా, ఏ సామాజికవర్గాన్ని చూసినా 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు మార్క్, అభివృద్ధి ఎక్కడా కనిపించదు. ప్రతి ఇంట్లోనూ, గ్రామంలోనూ కనిపించేది మీ జగన్ మార్క్, వైయస్సార్ సీపీ మార్క్ అభివృద్ధి.
- ప్రజలు మనకు ఫస్ట్ టైమ్ ఆశీర్వదిస్తేనే దేవుడి దయతో ఇంత మంచిచేయగలిగాం. ఇక ప్రజలు సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
- ప్రతి అడుగులోనూ ముఖ్యమంత్రిగా నేనుంటూ అణగారిన వర్గాల మీద నేను చూపిస్తున్న ప్రేమ.. ప్రతి మాటకూ ముందు నా.. నా.. నా.. అంటూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలంటూ గుండెల నిండా ఆప్యాయతతో చరిత్రలో చూడని విధంగా నామినేషన్ పనులు, కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసి మరీ ఇస్తున్నది ఎవరంటే మీ జగన్ అని చెప్పి ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
- ఏకంగా 2.55 లక్షల కోట్లు.. నేరుగా మీ జగన్ బటన్ నొక్కుతున్నాడు. నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతున్నాయి.
- ఇందులో 75 శాతం నానానా అని పిలుచుకొని నా వర్గాలకే ఇచ్చాను అని చెప్పుకొనేదానికి సంతోషపడుతున్నా.
- నిరుద్యోగులకు ఈ 57 నెలల్లో.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే ఈ 57 నెలల పాలనలోనే ఏకంగా 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పండి.
- ఆ ఉద్యోగాల్లో 80 శాతం నేను నానానా అని పిలుచుకొనే నా ఎస్సీలు, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలకు వచ్చాయంటే అది జరిగింది, ఇంతటి సామాజిక న్యాయం కనిపిస్తున్నంది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పండి.
- దాదాపు 35 లక్షల ఎకరాల మీద సర్వ హక్కకులు అనుభవదారులకు, గిరిజనులకు, రైతన్నలకు, నిరుపేదలకు ఇచ్చినది ఎవరంటే మీ జగన్.
- అందులో అత్యధికం పేద సామాజికవర్గాలకు చెందినవే అని తెలిసి వారికి మేలు చేసింది ఎవరంటే మీ జగన్. ఇచ్చింది ఎవరంటే మన వైయస్సార్‌సీపీ పార్టీ.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎన్నికైన పదవుల నుంచి మంత్రిమండలి వరకు, డిప్యూటీ సీఎంలు, రాజ్యసభ, శాసనసభాపతి వరకు, మండలి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఇచ్చింది ఎవరంటే మీ జగన్. వచ్చింది ఎప్పుడంటే మన వైయస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
- మనందరి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అండగా ఈ వర్గాలన్నీ కదిలి రావాలని, స్టార్ క్యాంపెయినర్లుగా నిలవాలని, బాబుకు ఓటేయడం అంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటేయడం అని, డీబీటీకి వ్యతిరేకంగా ఓటు వేయడం అని ప్రతి ఒక్కరికీ ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాల్సిన అవసరం ఉంది.
- గతంలో చంద్రబాబు పాలన చూశారు. ఇంకా చాలా మంది పాలన చూశారు. చాలా రాష్ట్రాల్లో చూస్తున్నారు. ఎవరైనా మేనిఫెస్టోను మన మాదిరిగా, ఒక బైబిల్‌గా, ఒక ఖురాన్‌గా, భగవద్గీతగా భావించి 99 శాతం అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తున్నది మీ జగన్. ఒక్క వైయస్సార్ సీపీ మాత్రమే ఆ చిత్తశుద్ధి చూపిస్తోంది.
- ఫస్ట్ చాన్స్ ఇస్తేనే మీ జగన్ ఇంత గొప్పగా అన్ని వర్గాలనూ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు. మరి మూడుసార్లు సీఎంగా, 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయాడని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి అడగండి.
- అయ్యా బాబూ.. ప్రజలు నీకు ఎందుకు ఓటు వేయాలి?జగన్ మార్క్ ప్రతి గ్రామంలో కనిపిస్తున్నప్పుడు, ప్రతి పేద ఇంట్లో, ప్రతి సామాజికవర్గంలో, ప్రతి ప్రాంతంలో కనిపిస్తున్నప్పుడు ఎందుకు బాబుకు ఓటు వేయాలని అడుగుతున్నా.
- జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి చంద్రబాబు నిజంగా నమ్మితే, జగన్‌కు ప్రజాబలం లేదని చంద్రబాబు నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులెందుకు?
- నిజంగా నువ్వు జగన్ మంచి చేయలేదని అనుకుంటే మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే, ప్రజా బలం లేదనుకుంటే ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబూ అని అడుగుతున్నా.
- తన నడక కోసం అటో కర్రా, ఇటో కర్ర ఎందుకయ్యా చంద్రబాబూ?
- తన సైకిల్ తోయడానికి నీకొక ప్యాకేజీ స్టార్ ఎందుకయ్యా?
- మీకు కూడా తెలుసు.. జగన్ ప్రతి ఇంటికీ మంచి చేశాడు కాబట్టి, వైయస్సార్‌సీపీ చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ బతికి ఉందని తెలుసు.
- ప్రతి గ్రామానికి, ప్రతి సామాజికవర్గానికి, ప్రతి పేదవాడూ జగన్‌ను, వైయస్సార్‌సీపీని గుండెల్లో పెట్టుకున్నాడు కాబట్టే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
- 125సార్లు ఈ 57 నెలల్లో బటన్లు ప్రజల కోసం నేను నొక్కాను. ఏకంగా 2.55 లక్షల కోట్లు నేరుగా బటన్లు నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు వెళ్లింది. ఇంత మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఈ పాలనకు కొనసాగింపుగా ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్ కోసం రెండు బటన్లు నొక్కాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు. ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద శాశ్వతంగా ఉండదు.
- పొరపాటు చేశారంటే చంద్రముఖి మళ్లీ సైకిలెక్కుతుంది. టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికొస్తుంది. పేదల రక్తం తాగేందుకు లకలకా అంటూ మీ ఇంటి తలుపులు తడుతుందని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ చెప్పండి.
- మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని, మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా, మీరే సైనికులుగా నిలబడండి అని ప్రతి ఇంటికీ వెళ్లి నిబద్ధతతో మనం సిద్ధం అంటుంటే, మరోవంక బాబు పేదల ఇంటికిగానీ, పేదల సామాజికవర్గాలకు గానీ, గ్రామాలకుగానీ, రాష్ట్రానికి గానీ ఏం చేశాడో చెప్పుకొనేందుకు ఒక్కటీ కనిపించని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నాడు.
- అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు తానూ పోస్టర్లు వేయిస్తాడు. సంసిద్ధం, మేమూ సిద్ధం అని వేయిస్తాడు. ప్రజలకు మంచి చేయకుండా దేనికయ్యా సంసిద్ధం? ఎందుకు సంసిద్ధం? ఎవరితో యుద్ధం?
- పెత్తందార్ల తరఫున చంద్రబాబు సంసిద్ధం అంటున్నాడంటే ఎవరితోనయ్యా నువ్వు యుద్ధం చేస్తున్నావు?
- దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి, తలవంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ఉన్న ఇంత మంది.. ఇన్ని లక్షల గుండెలు, కోట్ల గుండెలు ప్రతి పేదవాడి ఇంట్లో తోడుగా ఉండే గుండెలు.
- ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మరి మిమ్మల్ని అడుగుతున్నా. మీరంతా సిద్ధమేనా?
- మన పార్టీని, మీ అన్నను అభిమానించే ప్రతి కార్యకర్తకు, నాయకుడికీ, వాలంటీర్‌కు, ఒక్క విషయం చెబుతున్నా. ఇది మీ అందరి పార్టీ.
- కార్యకర్తల్ని, నాయకుల్ని, అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలో కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం మనది.
- మార్కెట్ యార్డులు, దేవాదాయ బోర్డులు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో, 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులివ్వడం కేవలం మీ అన్నకు మాత్రమే సాధ్యం.
- గత తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు పిండుతూ పక్షపాతంతో కొద్దిమందికి మాత్రమే అనే వివక్షతో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తే, ఆ స్థానంలో మన ప్రభుత్వం మనలో నుంచి చదువుకున్న మన పిల్లలతో తీసుకొచ్చిన మన వాలంటీర్ వ్యవస్థ ఇంటికీ వెళ్లి పని చేస్తున్న మన ప్రభుత్వానికి దన్నుగా ప్రజల మన్ననలు పొందుతోంది. మనతోపాటు పని చేస్తోంది.
- మన వారికి చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం.
- నామినేషన్ మీద ఇచ్చే పనులు, కాంట్రాక్టుల్లో ఇదే పంథా న్యాయం చేశాం.
- జగన్‌ను నమ్మిన వారికి, పార్టీ కోసం కష్టపడిన వారికి అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
- మంచి పాలన అందించాం. భవిష్యత్‌లో మనలో నుంచి ఏ ఒక్కరైనా ఏ పదవికోసం నిలబడినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ మనల్ని ఆశీర్వదిస్తారు.
- మంచి పాలనలో భవిష్యత్‌లో ఇంతకంటే ఎక్కువ పదవులిచ్చే పార్టీ మన వైయస్సార్‌సీపీ.
- ప్రతి కార్యకర్తకూ మీ అన్న మీ జగన్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని తెలియజేస్తున్నా.
- ప్రతి కార్యకర్తకూ, ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మరో రెండు మెట్లు అవకాశం కల్పించే బాధ్యత నాదీ.
- ఈ 57 నెలల మన పరిపాలన చూశారు. గతంలో చంద్రబాబు పరిపాలన కూడా చూశారు. ఎలాంటి నాయకుడు మీకు కావాలి?
- చంద్రబాబు మాదిరి ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల మేనిఫెస్టోలు చూపి రైతన్నలను, అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను, చదువుకుంటున్న పిల్లల్ని ఎలా మోసం చేయాలనే దిక్కుమాలిన ఆలోచన చేసి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి అందర్నీ మోసం చేస్తున్న అలాంటి చంద్రబాబు మాదిరిగా ఉండాలా?
- నాయకుడంటే ఒక మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో అని రిలీజ్ చేసిన తర్వాత కష్టమైనా నష్టమైనా మాట మీద నిలబడగలిగిన వాడే నాయకుడు.
- ఈరోజు అలా చేయగలిగాం కాబట్టే, ఏకంగా 99 శాతం మేనిఫెస్టో హామీలు నెరవేర్చా కాబట్టే ప్రతి ఇంటికీ వెళ్లి అక్కా మీరే టిక్ పెట్టండి, ఎన్నెన్ని జరిగాయో, 99 శాతం మా అన్న నెరవేర్చాడని ప్రతి కార్యకర్త ప్రతి పేద వాడి ఇంటికి వెళ్లగలుగుతున్నాడు. ఇదీ నాయకుడు అంటే.
- నాయకుడంటే ప్రతి కార్యకర్తా కాలర్ ఎగరేసి అదిగో మా నాయకుడు మాటిచ్చాడు అంటే చేస్తాడంతే అనే పరిస్థితి ఉండాలి.
- ప్రతి కార్యకర్తకూ ఇలాంటి వ్యక్తి ఉండాలి. రాష్ట్రానికి, ప్రజలకు మాకు అండగా తోడుగా ఉండాలి అనేలా ఉండాలి.
- ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ, ప్రతి పేద కుటుంబానికీ, ప్రతి పేదకు, వారి భవిష్యత్‌కు అండగా నిలబడగలిగాం. మాట ఇచ్చాం. నెరవేర్చాం. మళ్లీ ప్రజల దగ్గరికి వెళ్లగలిగే పరిస్థితి మనకు, మన వైయస్సార్‌సీపీకి ఉంది.
- అందుకే వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్... 175కు 175 అని అడుగుతున్నా. మన టార్గెట్ 25కు 25 ఎంపీలు అని అడుగుతున్నా.
- పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ తగ్గేందుకు వీలే లేదు.
- ఇదీ 350 వాగ్దానాలిచ్చి అందులో 10 శాతం కూడా అమలు చేయని చంద్రబాబు పార్టీ కాదు, చంద్రబాబు ప్రభుత్వం కాదు.. ఇదీ... ఏకంగా 99 శాతం వాగ్దానాలు అమలు చేసి మరీ ప్రతి ఇంటికీ వెళ్లి మేనిఫెస్టో చూపించి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు కోరుతున్న మన వైయస్సార్‌సీపీ పార్టీ.
- అటు టీడీపీ, ఇటు వైయస్సార్‌సీపీ, అటు పెత్తందార్లు, ఇటు పేదవాడు.
- పేదవాడి భవిష్యత్ కోసం యుద్ధానికి మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నా.
- మరో రెండు నెలల్లోనే ఎన్నికలు. ఈరోజు నుంచి చూస్తే మరో 55 రోజులు కూడా ఉండవేమో.
- ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయడానికి, చంద్రబాబు ప్రచారాలు, ఈనాడు రాతలు, ఏబీఎన్, టీవీ5, ఎల్లో మీడియా తప్పుడు కథలు, వారి అబద్ధాలు, మోసాలు.. వీటన్నింటిని నుంచి ఇంటింటి అభివృద్ధి, పేదవాడి భవిష్యత్‌ను కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా?
- వారి మీడియా, వారి సోషల్ మీడియాలో వారు చేసే దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలి. దానికి మీరంతా సిద్ధమేనా?
- వారి చీకటి రాతల్ని, చీకటి పనుల్ని బట్టబయలు చేసేందుకు సిద్ధమేనా?
- మీ అందరికీ సెల్‌ఫోన్లు ఉన్నాయా? ఆ సెల్‌ఫోన్లు ఒక్కసారి బయటకు తీయండి. అందులో లైట్ బటన్ నొక్కండి. సెల్ టార్చర్ ఆన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా.. సిద్ధమే అని చెప్పండి.
- ప్రతి కార్యకర్త, బూత్ కమిటీ సభ్యులుగా, గృహసారథులుగా, వాలంటీర్లుగా మీ పాత్ర అత్యంత కీలకం,
- సమరభేరి మోగిద్దాం, సమరనాదం వినిపిద్దాం. మరో గొప్ప చారిత్రాత్మక విజయానికి మరో అడుగు వేయడానికి అందరం కూడా సిద్ధమా? అని అడుగుతున్నా.
- ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు ఇప్పటికే 75. ఆయన వయసు 80కి పోతుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కూడా ఎక్కడా కనిపించవు.
- ఈ ఎన్నికలు చాలా కీలకం. అందుకే పెత్తందార్లంతా ఏకం అవుతున్నారు. తోడేళ్లుగా ఏకం అవుతున్నారు.
- మనం యుద్ధం చేస్తున్నది చంద్రబాబుతో మాత్రమే కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీళ్లందరికీ తోడు దత్తపుత్రుడితో యుద్ధం చేస్తున్నాం.
- ఇంత మంది ఏకం అవుతున్నారు. వీరంతా సరిపోరు అని జాతీయ పార్టీలు కూడా పరోక్షంగా ఒకరితో, ప్రత్యక్షంగా ఒకరితో పొత్తు తెచ్చుకొనేందుకు వెంపర్లాడుతున్నాడు.
- కేవలం ఒకే ఒక్కడి మీద యుద్ధం చేయడానికి ఇంత మంది తోడేళ్లు ఏకం అవుతున్నారు.
- అందుకే ఎన్నికలు చాలా కీలకం. ఈ తోడేళ్లను ఎదుర్కోవాలంటే మీ జగన్ ఒకడికే సాధ్యం కాదు. మీ జగన్‌కు ప్రతి గుండె తోడుగా నిలబడాలి. ప్రతి ఇంట్లో ఉన్న అక్కచెల్లెమ్మ, అవ్వాతాత, తల్లీతండ్రీ, రైతన్న కూడా మీ జగన్‌కు తోడుగా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- ఈ ఎన్నికలు ఆశామాషీ ఎన్నికలు కాదు. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు రేప్పొద్దున పేదవాడి భవిష్యత్‌ను, జీవితాన్ని నిర్ణయించే ఓటు అవుతుంది.
- పొరపాటు జరిగిందంటే పేదవాడి బతుకులు అతలాకుతలం అవుతాయి.
- పేదవాడి భవిష్యత్ మారాలంటే, పేదవాడి పిల్లాడు రేప్పొద్దున 10-15 సంవత్సరాలకు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడుతూ, పెత్తందార్లతో పోటీ పడుతూ పెద్ద కంపెనీలతో ఉద్యోగాలు సంపాదించుకోవాలంటే జరగబోయేఎన్నికలు అత్యంత కీలకం.
- పేదవాడి ప్రతి గుండె ఏకం కావాలి. పెత్తందార్ల పార్టీలను పూర్తిగా నాశనం చేసే పరిస్థితి రావాలి.
- దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని, మరో అవకాశం మనందరి ప్రభుత్వానికి నిండు మనసుతో దేవుడు ఆశీర్వదించి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.
రాప్తాడు వైఎస్సార్‌సీపీ సభ
- సభా ప్రాంగణం ఖాళీ లేక జాతీయ రహదారులపై నిల్చున్న లక్షలాది జనం
- ఇంకా తరలివస్తున్న అభిమానులు
రాప్తాడు చేరుకున్న సీఎం జగన్
- రాప్తాడులో వైఎస్సార్‌సీపీ సిద్ధం సభ
- వైఎస్సార్‌సీపీ కేడర్, అభిమానులతో కిక్కిరిసిన ‘సిద్ధం’ సభా ప్రాంగణం
- ఇంకా లక్షలాదిగా తరలివస్తున్న జనం
సిద్ధం సభ.. టీడీపీకి దడ పుడుతోంది: మంత్రి ఉషాశ్రీ చరణ్
- సంక్షేమ పాలన కొనసాగాలంటే మళ్లీ జగనే రావాలి
- వచ్చే ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం
- మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మనది
- వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలవడమే లక్ష్యం
ట్రెండింగ్‌లో ‘సిద్ధం’
- సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ‘సిద్ధం’ కార్యక్రమం
- ట్విట్టర్‌లో దేశంలోనే మొదటిస్థానంలో ట్రెండ్ అవుతున్న ‘సిద్ధం’ హ్యాష్‌ట్యాగ్
- సిద్ధం అప్‌డేట్స్‌ను భారీగా షేర్ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభిమానులు
- ‘సిద్ధం’ సభా ప్రాంగణం ఫొటోలతో నిండిపోయిన ఫేస్‌బుక్, ట్విట్టర్
►తాడేపల్లి నుంచి రాప్తాడుకు బయలుదేరిన సీఎం జగన్
►కాసేపట్లో సిద్ధం సభకు చేరుకోనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
►కాసేపట్లో సిద్ధం సభ ప్రారంభం.
►వైఎస్సార్‌సీపీ సిద్ధం సభకు భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు, ప్రజలు.
►కర్నూలు జిల్లా ఆలూరు నుంచి 80 బస్సుల్లో సిద్ధం సభకు బయలుదేరిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు.
చంద్రబాబుకు ఎమ్మెల్యే సుధాకర్ బాబు కౌంటర్
- చంద్రబాబు మందు, బిర్యానీలు ఇచ్చినా సభలకు జనం రావటం లేదు
- అందుకే ప్రస్టేషన్‌తో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు
- సీఎం జగన్ నిర్వహించే సిద్ధం సభలకు జనం పెద్ద ఎత్తున వస్తున్నారు
- సిద్ధం సభలకు ఒక లక్ష్యం ఉంది
- తాను మేనిఫెస్టోను అమలు చేశానని నమ్మితేనే తనకు ఓటెయ్యమని సీఎం జగన్ చెప్తున్నారు
- అలా ఓట్లు అడగటం హీరోయిజం
- ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న యుద్దంలో భాగంగా తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు
- కిందిస్థాయి నుండి రాజకీయంగా ఎదిగి ఎమ్మెల్యేలు, ఎంపీలయ్యాం.
- అలాంటి మమ్మల్ని జీరోలమంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు
- మాకు రాజకీయ జీవితాలను జగన్ ఇచ్చారు
- ఆయన ఏం చెప్తే అది చేయటానికి సిద్ధంగా ఉన్నాం
- ఓసీలు పోటీ చేసే సీట్లలో బలహీన వర్గాలకు జగన్ ఇచ్చారు
- అలా సీట్లు ఇచ్చే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా?
- బీసీలు, ఎస్సీలను రాజ్యసభకు జగన్ పంపించారు
- చంద్రబాబు తన జీవితంలో ఇలా ఏనాడూ చేయలేదు
- జగన్ మళ్ళీ సీఎం అయితేనే పల్లెలు, పేదల బతుకులు మారతాయి
- నారా లోకేష్‌కి మైండ్ పోయింది
- అందుకే రుషికొండ మీదున్న ప్రభుత్వ భవనం ఎదుట సెల్ఫీ తీసుకున్నాడు
- రాజధానిలో పేదల ఉసురు కొట్టటం వలన చంద్రబాబు, లోకేష్ రోడ్డున పడ్డారు
►రాప్తాడు సిద్ధం సభకు సీమలోని పలు ప్రాంతాల నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజలు భార సంఖ్యలో తరలివస్తున్నారు.
►ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి గత నెల 27న భీమిలి వేదికగా శంఖం పూరించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే నేడు రాయలసీమలోని రాప్తాడులో సిద్ధం సభకు సీఎం జగన్ సిద్దమయ్యారు. నేడు రాప్తాడు వద్ద సిద్ధం సభను నిర్వహిస్తున్నారు.
►రాయలసీమ ప్రాంతంలోని 52 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో 250 ఎకరాలకుపైగా ఉన్న సువిశాల మైదానంలో సభకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. కాగా, భీమిలి, ఏలూరులలో నిర్వహించిన సభలకు జనం సంద్రంలా పోటెత్తడం.. జయహో జగన్, మళ్లీ సీఎం జగనే అన్న నినాదాలతో సభా ప్రాంగణాలు ప్రతిధ్వనించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. ఇక, సభ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment