సాక్షి, బాపట్ల: బిందువు బిందువు కలిసి సింధువైనట్లుగా.. నా మీద, నా పార్టీ మీద నమ్మకంతో ప్రభంజనంలా సిద్ధమంటూ ఉప్పెనలా తరలి వచ్చిన జన సమూహం ఓ మహా సముద్రంలా కనిపిస్తోందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆదివారం సాయంత్రం బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్ల సిద్ధం సభలో లక్షల మంది జనసందోహం నడుమ ప్రసంగించారాయన.
మేదరమెట్లలో కనిపిస్తోంది ఓ జన సముద్రం.. ఓ జన ప్రవాహం కనిపిస్తోంది. మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు నాపై నమ్మకంతో వచ్చిన వాళ్లందరికీ ధన్యవాదాలు. మరో ఐదేళ్లు ఈ ప్రయాణం కొనసాగిద్దాం. పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరు సిద్ధమా? అని సీఎం జగన్ అనగానే.. లక్షల మంది సిద్ధం అంటూ బదులిచ్చారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉత్తర కోస్తా.. దక్షిణ కోస్తా సిద్ధం. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధం. సిద్ధమంటే ప్రజలు చేసే యుద్ధమని.. ఓ ప్రజా సముద్రమని సీఎం జగన్ అన్నారు. రాబోయే కురుక్షేత్రంలో ప్రజలది శ్రీకృష్ణుడ్ని పాత్ర అని.. తనది అర్జునుడి పాత్ర అని.. కౌరవ సైన్యంపై యుద్ధం చేయబోతున్నామని అన్నారు. జమ్మి చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించాల్సిన సమయం వచ్చిందని సీఎం జగన్ పిలుపు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment