Siddham Sabha: అద్దంకి సిద్ధం సభ హైలైట్స్‌ | CM YS Jagan: Medarametla Siddham Sabha Updates | Sakshi
Sakshi News home page

Siddham Sabha: అద్దంకి సిద్ధం సభ హైలైట్స్‌

Published Sun, Mar 10 2024 7:01 AM | Last Updated on Sun, Mar 10 2024 7:52 PM

Cm Ys Jagan: Medarametla Siddham Sabha Updates - Sakshi

Medarametla Siddham Sabha Updates:

4:45PM, Mar 10th, 2024

సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్‌ ఏమన్నారంటే..

  • బిందువూ బిందువూ సింధువైనట్లుగా.. నా మీద, మన పార్టీ మీద నమ్మకంతో చేయి చేయి కలిపి ప్రభంజనంలా ఇక్కడికి సిద్ధం అంటూ ఉప్పెనలా తరలి వచ్చిన ఈ జన సమూహం.. ఓ మహాసముద్రంలా ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తోంది. 
  • ఈ మేదరమెట్లలో కనిపిస్తోంది ఓ జన సముద్రం.  ఓ జన ప్రవాహం. 
  • ఇంటింటి అభివృద్ధిని, సామాజిక వర్గాల సంక్షేమాన్ని, పేదలందరి ఆత్మగౌవరాన్ని మొత్తంగా రాష్ట్ర ప్రగతిని ఇలాగే కాపాడుకుని మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు మద్దతు పలికేందుకు వచ్చిన ఈ ప్రజా సైన్యానికి, ఇక్కడున్న ప్రతి గుండె చప్పుడుకీ మీ జగన్‌, మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ సెల్యూట్‌ చేస్తున్నాడు. 
  • మరికొన్ని రోజుల్లో జరగబోతున్న ఎన్నికల మహాసంగ్రామానికి, ఆ సంగ్రామంలో పేదవాడి భవిష్యత్‌ను కాపాడేందుకు, ఆ పేదవాడికి అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..!
  • పార్టీల పొత్తులతో బాబు.. ప్రజలే బలంగా మనమూ.. తలపడబోతున్న ఈ మహాసంగ్రామానికి మీరంతా కూడా సిద్ధమేనా..!
  • జగన్‌ను ఓడించాలని వారు.. పేదల్ని గెలిపించాలని మనం.. చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవడానికి మీరంతా కూడా సిద్ధమేనా..!
  • సిద్ధం అంటే ఓ ప్రజా సముద్రం. ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం. ఇప్పటికే ఉత్తర కోస్తా సిద్ధం. ఇప్పటికే రాయలసీమ సిద్ధం. ఈరోజు దక్షిణ కోస్తా కూడా సిద్ధం. 
  • జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ, అధర్మాల మధ్య జరిగే ఈ యుద్ధంలో.. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరగబోయే ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది. ప్రజలందరిదీ. అర్జునుడి పాత్ర మీ బిడ్డది. మీ అన్నది, మీ తమ్ముడిది. 
  • జమ్మి చెట్టు మీద ఇంత కాలం దాచిన ఓటు అనే అస్త్రాన్ని ఇంటింటి అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, పేద సామాజికవర్గాల అభివృద్ధికి, అడ్డు పడుతున్న పెత్తందార్ల మీద ప్రయోగించాల్సిన ఇక సమయం వచ్చేసింది. 

  • నాకు, చంద్రబాబుకు ఉన్నట్టుగా పది మంది నటించే పొలిటికల్‌ స్టార్లు నాకు లేరు. 
  • నాకు చంద్రబాబు మాదిరిగా ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లేదు. 
  • అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా నాకు లేదు.
  • రకరకాల పార్టీలతో పొత్తులు లేవు మీ బిడ్డకు. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్న నాకు.. ఉన్నదల్లా.. నక్షత్రాలు ఎన్నున్నాయో అంత మంది పేదింటి స్టార్‌ క్యాంపెయినర్లు నాకు ప్రతి ఇంట్లోనూ ఉన్నారు. ప్రతి గడపలోనూ ఉన్నారు. 
  • నా ఎదుట ఇసుక వేస్తే కూడా రాలనంతగా ఈరోజు ఇక్కడ కార్యకర్తలు, అభిమానులు, ప్రజానీకం.. మీలో ప్రతి ఒక్కరూ మీ జగన్‌కు, మీ అన్నకు, మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లుగానే ముందుకు నడుం బిగించాలి. 
  • బహుశా మరో నాలుగు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేస్తోంది. 
  • చంద్రబాబు పార్టీలు, చంద్రబాబు జేబులో ఉన్న మరో పార్టీ.. వీరంతా కూడా మన మీద, మన పేదల భవిష్యత్‌ మీద వీరంతా దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. 
  • ఈ పార్టీలందరిలో కూడా వీరందరికీ సైన్యాధిపతులే తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం ఎక్కడా లేదు. 
  • ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటాకు వచ్చినన్ని కూడా ఓట్లు రాని పార్టీలు. 
  • తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగట్టిన పార్టీలు, రాష్ట్ర ద్రోహుల పార్టీలు, మరికొందరు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు, వ్యక్తులు.

  • ఇటువంటి వారందరూ కూడా మనకు పోటీగా అటువైపున ఉన్నారు. 
  • మనం 5 కోట్ల ప్రజల అండదండలతో ఇంటింటికీ మంచి చేసి మనం ఈరోజు సిద్ధం అంటుంటే వారి వెనుక ప్రజలు లేరు, చేసిన మంచి చెప్పుకునే పరిస్తితి లేదు కాబట్టి, అరడజను పార్టీలతో, అరడజను ఎల్లో మీడియా సంస్థలతో పొత్తులతో, ఎత్తులతో, జిత్తులతో ఎక్కే గుమ్మం, దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతున్నారు.
  • జాతీయ రాజకీయాలను తానే ఏలానని, స్టీరింగ్‌ కమిటీ చక్రం తానే తిప్పానని, ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించానని ఒకప్పుడు చంద్రబాబు ఊదరగొట్టేవాడు.
  • ఈరోజు ఏపీలో మనం చేసిన ఇంటింటి అభివృద్ధి, మంచి వల్ల మనకున్న ప్రజా బలం ముందు నిలబడలేక, మనతో నేరుగా తలపడలేక, ఏపీలో తన సైకిల్‌ చక్రం తిరగడం లేదని ఢిల్లీకి దత్తపుత్రుడితో కలిసి వెళ్లి పడిగాపులుగాసి, ఢిల్లీలో మోకరిల్లుతున్న పరిస్థితులు ఈరోజు చంద్రబాబు పరిస్థితి.
  • కేవలం జగన్‌ ఒక్కడే ఇటువైపున. జగన్‌ వల్ల మంచి జరక్కపోయి ఉంటే ప్రతి ఇంటికీ, మేనిఫెస్టోలో చెప్పినది చేయకపోయి ఉంటే, జగన్‌ అనే ఒక్కడు చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తించి ఉండకపోయి ఉంటే.. చంద్రబాబు ఇన్ని పొత్తుల కోసం ఎందుకు పాకులాడుతున్నాడు?
  • ఇంత మందితో పొత్తుల కోసం అగచాట్లు పడుతున్నాడు? ఎందుకు ఢిల్లీదాకా వెళ్లి అక్కడ మోకరిల్లుతున్నాడు. దీనికి కారణం చిత్తశుద్ధితో, నిజాయితీతో మనం చేసిన మంచి, అన్ని వర్గాల మీద మనం చూపిన కమిట్‌మెంట్‌, ఇంటింటికీ మనం చేసిన అభివృద్ధి. 
  • మన పార్టీ, మన ప్రభుత్వం నిండుగా విరగకాసిన మామిడిచెట్టులా మనం ఉంటే, చంద్రబాబు పార్టీ అందర్నీ మోసం చేసి వెన్నుపోట్లు పొడిచి, గత పాపాలకు ఫలితం అనుభవిస్తూ తెగులు పట్టిన చెట్టులా చంద్రబాబు పరిస్థితి ఉంది. 
  • మన ఎమ్మెల్యేలు, నాయకులు అంతా ప్రతి నియోజకవర్గంలో గడపగడపకూ ప్రజల వద్దకు వెళ్లి చేసిన మంచిని చెబుతూ తిరుగుతుంటే చంద్రబాబు మాత్రం రామోజీ గడప, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గడప, టీవీ5 గడప, ఢిల్లీలో ఇతర పార్టీల గడపలు.. ఇలా ఓ అరడజను గడపలు.. ఐదేళ్లుగా తన మనుషులను పంపి తాను తిరుగుతున్నాడు. 
  • ఇది కనిపిస్తున్న చంద్రబాబు మార్క్‌ రాజకీయం. 
  • మరి మీ జగన్‌ మార్క్‌ రాజకీయం.. మీ అన్న మార్క్‌ రాజకీయంలో విలువలున్నాయి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉంది. నిబద్ధత ఉంది. సిద్ధాంత బలం ఉంది. ఇంటింటికీ మంచి చేశాము అన్న చరిత్ర ఉంది. 
  • అన్నింటికీ మించి ప్రజల మీద, అక్కచెల్లెమ్మల మీద నమ్మకం ఉంది. 
  • మీ బిడ్డ పాలనలో ప్రతి ఇంట్లోనూ చిక్కటి చిరునవ్వులు కనిపించే పరిస్థితులున్నాయి.
  • మన మార్క్‌ రాజకీయంలో ఇంటింటి అభివృద్ధి కూడా కనిపిస్తుంది. మన ఫ్యాన్‌ గిర్రున తిరిగేందుకు కావాల్సిన కరెంటు ఇతర పార్టీల నుంచి రాదు. ఇతరులతో పెట్టుకున్న పొత్తుల నుంచి రాదు. నేరుగా ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది. వారి గుండెల్లో ప్రేమ నుంచి వస్తుంది. 

  • మన ఫ్యాన్‌కు కరెంటు మనందరి ప్రభుత్వం ఇంటింటికీ చేసిన మంచి నుంచి వస్తుంది. మనం అందించిన నవరత్నాల నుంచి మన ఫ్యాన్‌కు కరెంటు వస్తుంది. 
  • లంచాలు లేని, వివక్ష లేని పాలన ఎవరైనా ఇవ్వగలుగుతారా అని ఆశ్చర్యం వెలిబుచ్చిన పరిస్థితుల నుంచి ఈరోజు లంచాలు లేని వివక్ష లేని పాలన అందించిన దాంట్లో నుంచి మన ఫ్యాన్‌కు కరెంటు వస్తుంది. 
  • మాటతప్పకుండా మేనిఫెస్టోను ఓ బైబిల్‌గా, ఖురాన్‌గా, భగవద్గీతగా భావించి ఇంత వరకు ఎవరూ ఎప్పుడూ చేయని విధంగా పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలు అమలు చేసిన ఆ నిజాయితీ నుంచి మన ఫ్యాన్‌కు కరెంటు వస్తుంది. 
  • చంద్రబాబు సైకిల్‌ పరిస్థితి ఏమిటని గమనిస్తే.. చంద్రబాబుకు సైకిల్‌కు ట్యూబుల్లేవు. టైర్లు లేవు. చక్రాలే లేవు. తుప్పు పట్టిన పరిస్థితిలో ఈరోజు ఉంది. 
  • తుప్పుపట్టిన సైకిల్‌ను తొక్కటానికి, తోయటానికి చంద్రబాబుకు వేరే పార్టీలు కావాలి. ఇదీ చంద్రబాబు గారి జాబ్‌ రిక్వైర్‌మెంట్‌.
  • బాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క మంచీ కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు. ఒక్క స్కీము కూడా వినపడదు, కనిపించదు.
  • పొత్తుల్లో భాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు.
  • ఈ ప్యాకేజీ స్టార్‌ అయితే, సైకిల్‌ సీటు తనకు కావాలని అడగడు. తన వారికి సీట్లు ఇవ్వకపోయినా ఈ పెద్దమనిషి అడగనే అడగడు. 
  • ఎందుకు ఇచ్చి తక్కువ సీట్లు ఇస్తున్నావని క్వశ్చన్‌ కూడా అడగడు. తాను తాగుతున్న టీ గ్లాస్‌ కూడా బాబుకే ఇచ్చేస్తాడు.
  • చంద్రబాబు సిట్‌ అంటే కూర్చుంటాడు. స్టాండ్‌ అంటే నిలబడతాడు.
  • ఎప్పుడు సైకిల్‌ను దిగమంటే అక్కడ దిగుతాడు. ఎప్పుడు సైకిల్‌ను తోయమంటే అప్పుడు తోస్తాడు.
  • పొత్తుల్లో ఉండమంటే పొత్తుల్లో ఉంటాడు. విభేదించినట్లు డ్రామాలాడమంటే రక్తికట్టించేట్టు డ్రామా ఆడతాడు.
  • వెనకటికి చంద్రబాబు లాంటి నాయకుడిని ఎవరో అడిగారట. అయ్యా.. పరిపాలన చేసేవారు కలకాలం గుర్తుండాలంటే ఎలాంటి పనులు చేయాలి అని అడిగారట. 
  • అప్పుడు ఆ బాబు.. ప్రజలకు అన్నం పెడితే అరిగిపోతుంది. చీర కొనిపెడితే చిరిగిపోతుంది. ఇల్లు కట్టిస్తే కూలిపోతుంది. కర్రు కాల్చి వాత పెడితే మాత్రమే ప్రజలకు కలకాలం గుర్తుంటుందని చెప్పాడట.
  • ఈ 14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు కూడా అలాంటోడే. అదే చేశాడు.

  • ఎంత మందితో పొత్తులు పెట్టుకున్నా కూడా ఈ చంద్రబాబు పరిస్థితి సున్నా. ఈ సున్నా ఇంటూ ఎన్ని పార్టీలున్నా దాని విలువ ఒక బోడి సున్నానే. 
  • ఆశ్చర్యం ఏమిటో తెలుసా.. ఇప్పుడు చంద్రబాబు ముగ్గురితో కలిసి పొత్తు అంటున్నాడు.
  • ఈ ముగ్గురూ కలిసి 2014లో ఇలాగే పొత్తుగా ఏర్పడి ఈ ముగ్గురూ కలిసి ఒకే స్టేజీ మీద కూర్చుని వీళ్లంతా మీటింగులు పెట్టారు. 
  • ఒకే ప్రకటనలో ముగ్గురి ఫొటోలు వేసుకుని చంద్రబాబు సంతకం పెట్టి.. ఇంటింటికీ ఈ పాంప్లేట్‌ను పంపించాడు. 
  • రైతులకు రుణమాఫీ మీద మొదటి సంతకం చేస్తాను, డ్వాక్రా సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తాం, మహిళల రక్షణకు ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు డిపాజిట్‌ చేస్తాం, ఉద్యోగం వచ్చే దాకా నెలనెల రూ.2 వేలు నిరుద్యోగ భృతి, రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్‌, చేనేత, పవర్‌ లూమ్స్‌ రుణాలు మాఫీ, అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా గృహాలు మంజూరు చేస్తాం, రాష్ట్రాన్ని సింగపూర్‌ మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తాం.... ఇవీ ఇదే చంద్రబాబు, ఇదే కూటమిలో ఉన్న ఇదే దత్తపుత్రుడి ఫొటో, ఇదే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కూటమిగా ఏర్పడి పొత్తులోకి తెచ్చుకున్న మోడీ గారి ఫొటో.
  • వీళ్లు ముగ్గురూ కలిసి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికీ పాంప్లేట్‌ పంపించాడు.

  • ఇందులో ఇచ్చిన హామీలు ఏవైనా కూడా అమలయ్యాయా?
  • ప్రత్యేక హోదా ఇచ్చారా? 
  • మరి ఇవి గతంలో చేయకుండా, పొత్తులో వీరంతా భాగమై ఈ మాదిరిగా మీటింగులు పెట్టి, మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టి, పాంప్లేట్లుగా చేసి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికీ పంపి, మరోసారి ఇదే డ్రామాను, ఇవే పొత్తులు.. ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు మళ్లీ చంద్రబాబు పొత్తుల డ్రామాతో మీ అందరి ముందుకు వస్తున్నారు.
  • చంద్రబాబు చూపిస్తున్న ఈ పొత్తులతో ఎవరికైనా ప్రయోజనం కలిగిందా?
  • ప్రజలకు ఏ ఒక్కరూ కూడా మంచి చేయకపోగా, ప్రజలకు మంచి చేసిన జగన్‌ను టార్గెట్‌ చేయడానికి మాత్రమే వీళ్ల ఏకైక ఎజెండా కనిపిస్తోంది. 
  • చంద్రబాబుకు అధికారం ఎందుకు కావాలంఆటే ప్రజలకు మంచి చేయడం కోసం కాదు.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది చేయడం కోసం కాదు..
  • కారణం.. ఆ అధికారంతో ప్రజల్ని దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు మాత్రమే చంద్రబాబుకు అధికారం కావాలి. 
  • గతంలో 2014లో చంద్రబాబు మేనిఫెస్టోలో.. ఇంటింటికీ పంపిన పాంప్లేట్‌.. టీవీ ఆన్‌ చేస్తే చాలు.. ఊదరగొట్టే అడ్వటైజ్‌మెంట్లు ఇవీ..
  • అడ్డగోలుగా మోసం చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు.. తాజా మేనిఫెస్టోగా.. నరకలోకానికి, నారా లోకానికి రమ్మంటే ఎవరూ రారు కాబట్టి ఎంట్రన్స్‌లో స్వర్గం చూపించి.. లోపలికి వెళ్లాక మోసం చేసి నరకం చూపించే మార్కెటింగ్‌ టెక్నిక్‌ చంద్రబాబుకు అలవాటు.

  • కిచడీ వాగ్దానాలన్నీ కలిపాడు. కర్ణాటకలో నుంచి కొన్ని, తెలంగాణ నుంచి కొన్ని.. వాళ్ల హామీలన్నీ కలిపి కిచడీ మేనిఫెస్టో తెచ్చాడు.
  • అందులో వారు చూపించే గ్రాఫిక్స్‌, ఎల్లో మీడియా డిబేట్లు.. వారు చేసే ప్రచారాలు.. ప్రజలు ఆలోచన చేయాలి.
  • చంద్రబాబు చేసే వాగ్దానాలకు శకుని చేతిలో పాచికలకు తేడా ఏమైనా ఉందా?
  • చంద్రబాబు కేరక్టర్‌కు భిన్నంగా మనందరి ప్రభుత్వం కరోనా కష్ట సమయంలో కూడా ఏమాత్రం సాకులు చూపకుండా పేదలందరికీ మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికీ అందించాం. 
  • నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కతున్నాడు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు అక్షరాలా రూ.2.65 లక్షల కోట్లు నేరుగా వెళ్లిపోవడం జరుగుతున్న పరిస్థితిని గమనించాలి. 

  • నాన్‌ డీబీటీ పద్ధతిలో అయితే ఇళ్ల స్థలాల మార్కెట్‌ విలువ తీసుకోకుండా, మన దగ్గర భూముల విలువ తీసుకోకుండా, మనం సేకరించిన భూముల విలువలు మాత్రమే తీసుకుని నాన్‌ డీబీటీ కింద మనం చేసిన ఖర్చు.. ఈ 58 నెలల కాలంలో.. చేసిన ఖర్చు రూ.1.10 లక్షల కోట్లు. 
  • మొత్తంగా డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపితే 58 నెలల కాలంలో మనం 3.75 లక్షల కోట్లు ఖర్చు చేశాం. అంటే ఏటా ఈ పథకాల మీద మీ బిడ్డ ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరిగిన, ప్రజలకిచ్చిన సొమ్ము సంవత్సరానికి రూ.75 వేల కోట్లు. అది కూడా మనం చాలా కష్టపడితే, ఎక్కడా కూడా లంచాలు లేకుండా చేస్తే.
  • మనందరి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని,ఇంటింటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఈర్ష్యతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పి గతంలో ఇదే ఈనాడు, ఇదే చంద్రబాబు ఎన్నెన్నో సందర్భాల్లో వాదించడం కూడా మన కళ్ల ఎదుట కనిపించిన సత్యం. 
  • ఇప్పుడు అదే నోటితో మరోసారి మోసం చేసేందుకు ఎలాగూ చెప్పేవన్నీ అబద్ధాలే కదా.. హద్దులెందుకు అని చంద్రబాబు ఈ మధ్య కాలంలో ఆరు వాగ్దానాలు అంటూ వదిలారు. 
  • ఏటా ఖర్చెంత అవుతుందని మా ఫైనాన్స్‌ వారిని లెక్కలు తీయమన్నాను.
  • 2024 ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తున్న కొన్ని పథకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగాల్సిందే. 
  • ఉదాహరణకు అలాంటి ఎనిమిది పథకాలు.. 66 లక్షల మంది పెన్షన్లకు మనం ఖర్చు చేస్తున్నది దాదాపు రూ.24 వేల కోట్లు.
  • రైతన్నలకిచ్చే ఉచిత విద్యుత్‌కు ఖర్చు రూ.11 వేల కోట్లు.
  • సబ్సిడీ బియ్యానికి రూ.4600 కోట్లు, 
  • ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 104, 108.. మరో రూ.4.400 కోట్లు, 
  • పూర్తి పీజు రీయింబర్స్‌మెంట్‌ కింద మీ జగనన్న ఇస్తున్నది విద్యాదీవెన, వసతి దీవెన కింద మరో రూ.5000 కోట్లు
  • సంపూర్ణ పోషణ కింద రూ.2200 కోట్లు, గోరుముద్ద కింద రూ.1900 కోట్లు.
  • కేవలం ఈ ఎనిమిది పథకాలకే.. ఖర్చు రూ.52,700 కోట్లు. ఇవి కచ్చితంగా ఎవరైనా చేయాల్సిందే. 

  • చంద్రబాబు చెప్పిన సూపర్‌ సిక్స్‌ ఆరు వాగ్దానాలకు ఎంత ఖర్చవుతుందో లెక్కేస్తే, ఇది పచ్చి మోసం అని తెలిసినా లెక్క వేయిస్తే.. అదనంగా కావాల్సింది ఏటా రూ.73,440 కోట్లు.
  • ఇది కాక చంద్రబాబు ఈ మధ్యనే ఏడో హామీ అని చెప్పి బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్‌ అదనంగా పెంచి ఇస్తానన్న హామీని లెక్కేస్తే ఇది అదనంగా రూ.13872 కోట్లు.
  • అంటే చంద్రబాబు చెప్పిన ఆరు సిక్సులు, ఈ ఏడో పథకానికి ఈరెండూ కలిపితే 87312 కోట్లు, ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా 8 స్కీములకు కచ్చితంగా ఎలాగూ చేయాల్సిన స్కీములకు ఖర్చయ్యేది మరో 52,700 కోట్లు.
  • రెండూ కలిపితే అక్షరాలా రూ.1.40 లక్షల కోట్లు.. చంద్రబాబు చెబుతున్నారు.
  • ప్రతి సంవత్సరం రూ.1.40 లక్షల కోట్లు.. మనం ఎంతో కష్టపడితే, ఎక్కడా లంచాలు లేకుండా ప్రజలకు ఇస్తే, పాలనలో ఎన్నో మార్పులు తెచ్చి పాలన చేస్తే మీ బిడ్డ ప్రభుత్వం పూర్తిగా కట్టడి చేసి ఎంతో కష్టపడితే ఇవ్వగలిగింది సంవత్సరానికి రూ.75 వేల కోట్లయితే, చంద్రబాబు చెబుతున్న హామీలు.. ఇప్పటికే రూ.1.40 లక్షల కోట్లు దాటుతోందంటే.. ఇక ఆలోచన చేయండి.. ఈ పెద్దమనిషి చంద్రబాబు చెప్పే హామీలు మళ్లీ ప్రజల్ని ఎంతగా మోసం చేసేందుకు చెబుతున్నాడో అని అందరూ ఆలోచన చేయాలి. 
  • ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటే చంద్రబాబు మాట్లాడరు. ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో సుదీర్ఘంగా దీని గురించి వివరించడం జరిగింది. 
  • ఎలాగూ అబద్ధాలు చెప్పేటప్పుడు హద్దులెందుకు, భావదారిద్ర్యం ఎందుకని అబద్ధాలు చెప్పే సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు. 
  • బాబు మేనిఫెస్టో ఏ ఒక్కరన్నా నమ్మడం అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్లుగానే ప్రజలందరూ మోసపోతారు అని తెలియజేస్తున్నా. 
  • ఈ 58 నెలల్లో ప్రజల కోసం 130 సార్లు మీ బిడ్డ బటన్‌ నొక్కాడు. దాదాపు రూ.1.70 లక్షల కోట్లు డీబీటీగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించాం. దేశ చరిత్రలో ఇది ఒక రికార్డు.
  • మన రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా జరిగిందంటే అది కేవలం మీ జగన్‌కు మాత్రమే సాధ్యమైంది. అది కేవలం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే సాధ్యమైంది. 
  • ఇవన్నీ కొనసాగాలంటే ఈ ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం మనకు స్టార్‌ క్యాంపెయినర్‌గా కుటుంబాలు బయటకు రావాలి. వారు ఓటు వేయడమే కాకుండా వంద మందికి చెప్పి ఓటు వేయించాలి.
  • ప్రతి ఇంట్లోనూ చెప్పాలి. పొరపాటు జరిగితే పేదవాడి భవిష్యత్‌ అంధకారం అవుతుందని ప్రతి ఇంట్లోనూ చెప్పాలి. ప్రతి గ్రామంలోనూ వివరించాలి. 
  • పార్టీ  కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకం. 

  • ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో వివరించాల్సిన అవసరం ఉంది. 
  • ఈ ఎన్నికల్లో వేసే ఓటు వచ్చే 5 సంవత్సరాలు వారి భవిష్యత్‌ను ఎలా మారుస్తుందో వివరించాలి. 
  • 2019 ఎన్నికల ముందు మీ జగన్‌ ఓ మాట చెప్పాడు. గుర్తుందా?
  • ఆ మాట.. మీ బిడ్డ వస్తాడు. మంచి రోజులు మీకు తెస్తాడని మీ బిడ్డ మాట ఇచ్చాడు. ఈరోజు మళ్లీ మీ అందరికీ.. ఐదేళ్ల తర్వాత మీ బిడ్డ మరో మాట చెబుతున్నాడు.
  • నేను చెప్పే ఈ మాటను ప్రతి ఊర్లోనూ చెప్పండి. ప్రతి ఇంట్లోనూ, ప్రతి గడపకూ వెళ్లి చెప్పండి. 
  • పేద వాడి భవిష్యత్‌ బాగుపడాలంటే, జరుగుతున్న ఈ మంచి కొనసాగాలంటే, మళ్లీ జగనన్ననే తెచ్చుకుందామని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి, ప్రతి ఊళ్లోనూ, ప్రతి గడపకూ వెళ్లి చెప్పండి. 
  • మన అన్నను సీఎంగా తెచ్చుకుందాం. మన అన్న ప్రభుత్వాన్ని మనమే రక్షించుకుందాం. బాబు అనే మాయలేడి వలలో పడవద్దు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 
  • మరింత మంచి అన్నతో చేయించుకుందాం. మనందరి చల్లని దీవెనలతోనే ఇది సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరికీ వెళ్లి చెప్పండి. 
  • మీ కోసం నిలబడిన మన అన్నమీద అరడజను పార్టీలు బాణాలు ఎక్కుపెట్టాయి. 
  • ఆ అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, పేదలకు మీ అందరి తరఫున జగనన్న నిలబడ్డాడు. కాబట్టే అరడజను పార్టీలు, అరడజను బాణాలు ఎక్కుపెట్టాయి. 
  • అయినా అన్న పొత్తుల్ని నమ్ముకోలేదు, అన్న మనల్నే నమ్ముకున్నాడు, ఆ దేవుడిని నమ్ముకున్నాడు. అన్న ఒంటరిగానే సింహంలా మనందరికీ తోడుగా నిలబడ్డాడు. అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 

  • మన అన్న ప్రజల్ని, దేవుడి తప్ప పొత్తుల్ని, జిత్తుల్ని నమ్ముకోలేదు. మన అన్న ఎప్పుడూ మోసాలు చేయలేదు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు. అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 
  • మన అన్న నమ్ముకున్నది తాను చేసిన మంచిని, మంచి జరిగిన ప్రజల్ని మాత్రమే నమ్మకున్నాడు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 
  • మళ్లీ మన అన్నను గెలిపించేందుకు మనమంతా కూడా చేయి చేయి కలపాలి, మనమంతా ఒక్కటి కావాలి, మనమంతా సిద్ధం అని చెప్పాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 
  • సీఎంగా అన్న వస్తేనే, నెలనెలా ఒకటో తేదీన మళ్లీ చిక్కటి చిరునవ్వులతో మన ఇంటికే రూ.3 వేల పెన్షన్‌ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుందని చెప్పండి.
  • సీఎంగా మళ్లీ అన్న వస్తేనే ఇచ్చిన ప్రతి ఇంటి పట్టాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని చెప్పండి. 
  • సీఎంగా మళ్లీ అన్న వస్తేనే అమ్మ ఒడి కొనసాగుతుందని చెప్పండి. 
  • సీఎంగా మళ్లీ అన్న వస్తేనే చేయూత పథకం అందుతుందని, రైతు భరోసా రైతన్నకు తోడుగా నిలుస్తుందని చెప్పండి.
  • సీఎంగా మళ్లీ అన్న పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కింద విద్యాదీవెన, వసతి దీవెన కేవలం అన్న వస్తేనే జరుగుతుందని చెప్పండి. 
  • నేరుగా అక్కచెల్లెమ్మలకు ఎలాంటి వివక్ష లేకుండా డబ్బులు పడే పరిస్థితి రావాలంటే మళ్లీ అన్న ముఖ్యమంత్రి అయితేనే అని చెప్పండి. 
  • సీఎంగా మళ్లీ అన్న వస్తేనే గవర్నమెంట్‌ బడి బాగుపడుతుందని చెప్పండి, సీఎంగా అన్న వస్తేనే గవర్నమెంట్‌ ఆస్పత్రి బాగుపడుతుందని చెప్పండి. 
  • నవరత్నాల్లోని అన్నిపథకాలు కూడా కొనసాగుతాయని చెప్పండి. 
  • ఈ పథకాలు అందుకున్న మనందరం కూడా స్టార్‌ క్యాంపెయినర్లుగా బయటకు రావాలని చెప్పండి. 
  •  ప్రతి ఒక్కరూ ఫ్యాన్‌ గుర్తు మీద అసెంబ్లీకి ఒక ఓటు, పార్లమెంటుకు ఒక ఓటు వేస్తేనే మళ్లీ అన్న సీఎం అవుతాడు. అన్ని పథకాలూ ఇంటికే వస్తాయని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 
  • చెప్పేటప్పుడు.. అదే చంద్రబాబుకు ఓటు వేయడం అంటే.. మీకు అందే పథకాలన్నింటినీ కూడా రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అవుతుంది అని కూడా చెప్పండి. 
  • మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయి. మళ్లీ లంచాలు, వివక్షల రాజ్యం మళ్లీ గ్రామాల్లో చెలరేగుతుంది. 
  • మళ్లీ అవ్వలు, తాతలు, రైతన్నలు క్యూలో నిలబడే పరిస్థితి, గవర్నమెంట్‌ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి, ఎండనక, వాననక ఎవరైనా చనిపోతేగానీ ప్రభుత్వ పథకాలు అందని పరిస్థితి మళ్లీ వస్తుందని చెప్పండి. 

  • పొరపాటున చంద్రబాబుకు ఓటేయడం అంటే మీ ఇంటికి వచ్చి పెన్షన్‌ ఇస్తున్న వాలంటీర్‌ వ్యవస్థ రద్దుకు మీరే ఓటు వేసినట్లు అవుతుందని చెప్పండి. 
  • బాబుకు ఓటు వేయడం అంటే గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లీషుమీడియం రద్దుకు మీరే ఓటు వేసినట్లు అని చెప్పండి.
  • బాబుకు ఓటు వేయడం అంటే గవర్నమెంట్‌ బడిని మళ్లీ కార్పొరేట్లకు అమ్మేయడం అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
  • బాబుకు ఓటు వేయడం అంటే మళ్లీ వైద్యం కోసం అప్పులు కావడమే, రైతన్నలు రైతు భరోసాను వదులుకోవడమే, మళ్లీ మోసపోవడమే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 
  • బాబుకు ఓటు వేయడం అంటే చంద్రముఖిని మనమే వెళ్లి నిద్ర లేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టే అని ప్రతి ఇంట్లోకి వెళ్లి చెప్పండి. 
  • మనం చేసిన మంచిని చూపించి మనం ఓటు అడుగుతున్నాం. గతంలో ఎప్పుడూ చంద్రబాబు మంచి చేయలేదు కాబట్టి మాయ చేసి చంద్రబాబు ఓటు అడుగుతున్నాడని చెప్పండి. 
  • వచ్చే ఎన్నికల్లో జగన్‌కు, ఫ్యాన్‌కు మీరు వేసే ఓటు మీ బిడ్డల బంగారు భవిష్యత్‌కు వేసే ఓటు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 
  • వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌కు మీరు వేసే ఓటు మన పేదరికం సంకెళ్లను తెంపుకోవడానికి, మన భవిష్యత్‌ కోసం మనం వేసుకుంటున్న ఓటు అని చెప్పండి. 
  • ఫ్యాన్‌ ఇంట్లోనే ఉండాలి, సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్‌లోనే ఉండాలి అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 
  • ఇవన్నీ వివరించి మరి ప్రతి ఇంటికీ ప్రతి ఊరికీ, ఇంత మంచి మనం చేశాం కాబట్టి, ఇంత మంచి చేసిన తర్వాత 2019కి మించిన మోజారిటీ, 175కు 1725.. 25 ఎంపీలకు 25 ఎంపీలు.. గెలవడానికి మనమంతా కూడా సిద్ధమేనా..!
  • నా ప్రసంగం ముగించే ముందు ఒక్క మాట చెబుతున్నా. మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం. కానీ చేయగలిగిందే చెబుతాం. చేసేది మాత్రమే చెబుతాం. 
  • అందులో చెప్పిన ప్రతి ఒక్కటీ కూడా చేస్తాం. జగన్‌ మాట ఇచ్చాడంటే.. తగ్గేదే లేదు అని ఈ సందర్భంగా చెబుతున్నా. 
  • ఆంధ్రప్రదేశ్‌లో మనం ప్రారంభించిన పరిపాలన ఓ స్వర్ణయుగానికి దారి తీస్తోంది. 
  • 90 శాతం ప్రజలు తెల్లకార్డుల మీద జీవించే పరిస్థితి నుంచి ప్రతి కుటుంబం కూడా పేదరికం సంకెళ్లను తెంచుకుని వాళ్లు అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలన్నది నా కల.  అలా చేయాలన్నది నా లక్ష్యం
  • ప్రతి ఒక్క ఇంటి నుంచి క్వాలిటీ చదువులు, గొప్ప చదువులు, అంతర్జాతీయ స్థాయి చదువులు చదివేలా ప్రతి పేద పిల్లాడికీ అవకాశం కల్పించడం, ఆ పేద పిల్లల బతుకులు మార్చాలన్నది నా కల. అది నా లక్ష్యం. 
  • ప్రతి అక్కచెల్లెమ్మ తన కాళ్ల మీద తాను నిలబడేట్టుగా చిరునవ్వు ఉండాలన్నది నా కల. నా లక్ష్యం. 
  • ఏ ఒక్క రైతన్న కూడా వ్యవసాయం వల్ల నష్టపోయానని చెప్పే పరిస్థితి రాకూడదు. వ్యవసాయాన్ని పూర్తిగా మార్చాలన్నది నా కల. అలా చేయాలన్నది నా లక్ష్యం. 
  • ఇక ఏ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఏ పేద కూడా పేదరికం వల్ల ఎదగలేకపోయాడన్న పరిస్థితి ఉండకూడదు. 
  • పేదవారికి సమానమైన అవకాశాలు రావాలి. సాధికారత కల్పించగలగాలి. అలా మార్చాలన్నది మీ బిడ్డ కల. మీ బిడ్డ సంకల్పం. మీ బిడ్డ లక్ష్యం. 
  • వైద్యం కోసం ఏ ఒక్కరూ మరణించే పరిస్థితి రాకూడదు. అప్పులపాలయ్యే పరిస్థితి, ఆస్తులమ్ముకునే పరిస్థితి రాకూడదు. అలా చేయాలన్నది నా కల. ఆ దిశగా అడుగులు వేసేది నా లక్ష్యం. 
  • వీటన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేయడానికి మాత్రమే మీ బిడ్డకు అధికారం కావాలి. 
  • లంచాలు, వివక్ష లేని వ్యవస్థ ఏర్పడాలన్నదే నా కల. నా లక్ష్యం. ఎవరూ కూడా లంచం అడిగే పరిస్థితి ఉండకూడదు. 
  • ఏ పేదవాడూ వివక్షకు లోనయ్యే పరిస్థితులు రాకూడదు. ఇది నా కల. ఇదే నా లక్ష్యం. 
  • ఇందుకోసమే మనకు అధికారం కావాలి. 
  • చదువుల పరంగా, వ్యవసాయం పరంగా, వైద్యం పరంగా మార్పులు తీసుకొచ్చాం. 
  • అక్కచెల్లెమ్మల సాధికారత విషయంలో  ఎప్పుడూ చూడని రీతిలో అడుగులు వేశాం. 
  • సామాజిక న్యాయానికి అర్థం చెప్పాం. పారిశ్రామికంగా, మౌలిక సదుపాయాల పరంగా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల పరంగా ఎప్పుడూ చూడని విధంగా ఏపీని నంబర్‌ వన్‌ దిశగా అడుగులు వేగంగా పడుతూ కృషి చేస్తున్నాం. 

  • అద్భుత ఫలితాలు ఇచ్చేలా అడుగులు వేయాలన్నది, వేస్తావున్నది, ఈ ప్రయాణం మధ్యలో ఉన్నది, ఈ ప్రయాణం ముందుకు పోవాలి, పేదవాడి భవిష్యత్‌ మారాలన్నదే నా కల. 
  • దాని కోసమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ దిశగా ప్రయాణం కోసమే మనం అధికారం కావాలని కోరుకుంటున్నాం. 
  • పేదవాడి భవిష్యత్‌ మారాలని, మార్చాలని.. దీని కోసమే మీ బిడ్డకు అధికారం కావాలని అడుగుతున్నా. 
  • అధికారం అంటే మీ బిడ్డకు వ్యామోహం లేదు. అధికారం పోతుందన్న భయం మీ బిడ్డలో ఎప్పుడూ ఉండదు, రాదు అని చెబుతున్నా. 
  • హిస్టరీ ఉన్నంత కాలం మీ బిడ్డ పేరు ప్రతి హిస్టరీ బుక్‌లో ఉండిపోవాలన్నదే మీ బిడ్డ కోరిక. 
  • మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా.. ప్రతి పేద వాడి ముఖంలో చిరునవ్వులు చూడటం కోసం. 
  • ప్రతి పేద వాడి ఇంట్లో మీ బిడ్డ ఫొటో చిరకాలం ఉండాలని, చనిపోయిన తర్వాత కూడా మీ బిడ్డ ఎప్పుడూ పేదవాడి గుండెల్లో బతికుండటం కోసం మీ బిడ్డకు అధికారం కావాలి. 
  • దాని కోసమే మీ బిడ్డ అధికారం అడుగుతున్నాడు. దానికోసమే మీ బిడ్డ పరితపిస్తున్నాడు.
  • మంచి చేయడం కోసం మంచి మనసుతో మీ బిడ్డ సంకల్పిస్తున్నాడు. దేవుడి దయ, ప్రజలందరి దీవెనలు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాడు. 
  • అలాగే కార్యకర్తలకు, అభిమానులకు, వాలంటీర్లకు ఒకే ఒక మాట చెబుతున్నా.
  • ఇన్ని పదవులు, ఇన్ని హోదాలు భారతదేశ రాజకీయ చరిత్రలో మరే ఇతర పార్టీ కూడా ఎప్పుడూ ఇవ్వలేదు. 
  • మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ప్రతి వాలంటీర్‌.. అందరూ నా కుటుంబ సభ్యులే. వారికి కచ్చితంగా మంచి జరుగుతుంది. మంచి జరిగించేందుకు మీ బిడ్డ ఉన్నాడు.
  • వారు మరో రెండు మెట్లు ఎదిగేందుకు, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఎన్నడూ లేనన్ని కార్పొరేషన్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు మొదలు, ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిపించుకుని అవకాశాలిచ్చిన పార్టీ ఒక్క వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.
  • మన పరిపాలన చూశారు. అందరూ ఆలోచన చేయాలి. మన 5 సంవత్సరాల పరిపాలన చూశారు. గతంలో 5 సంవత్సరాల చంద్రబాబు పాలన చూశారు.
  • ఈ రాష్ట్రానికి ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతున్నా. 
  • నాయకుడంటే చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చే సరికి రంగురంగుల మేనిఫెస్టో చూపి, రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకుని, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు చదువుకుంటున్న పిల్లలకు, ప్రతి సామాజిక వర్గాన్ని ఎలా మోసం చేయాలో దిక్కుమాలిన ఆలోచనలు చేసి రంగురంగుల మేనిఫెస్టో తెచ్చి అధికారంలోకి వచ్చాక చెత్తబుట్టలో వేసి మోసం చేస్తున్న చంద్రబాబులా నాయకుడు ఉండాలా?
  • ఒక మాట నోట్లో నుంచి వచ్చాక, ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్‌ చేసిన తర్వాత కష్టమైనా, నష్టమైనా మాట మీద నిలబడే నాయకుడు.. నాయకుడంటే మాట ఇస్తే తగ్గేదే లేదని చెప్పే మీ జగన్‌ లాంటి నాయకుడు కావాలా? అని అడుగుతున్నా. 

  • నాలుగు సార్లు ఆలోచన చేసి మాట ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మాట తప్పకూడదు. మడమ తిప్పకూడదు. 
  • ఏకంగా 99 శాతం మేనిఫెస్టో హామీలన్నీ నెరవేర్చాం కాబట్టే, ప్రతి  ఇంటికీ మేనిఫెస్టో చూపించి ప్రతి కార్యకర్తా చెప్పే పరిస్థితి. ఇదీ నాయకుడంటే.. ఇదీ పార్టీ అంటే. 
  • నాయకుడంటే ప్రతి కార్యకర్తా కూడా కాలర్‌ ఎగరేసి అదిగో మా నాయకుడు.. అలాంటి వాడే మా నాయకుడు.. అని ప్రతి కార్యకర్తా కాలర్‌ ఎగరేసేలా నాయకుడు ఉండాలి. 
  • అలాంటి నాయకుడు, అలాంటి పాలన ఉన్నప్పుడే ప్రతి గ్రామంలో, ప్రతి కార్యకర్తా, ప్రతి అభిమానీ ప్రతి ఇంటికీ వెళ్లి మా అన్న ఇవన్నీ దేవుడి దయతో చేశాడు అని వారి చిరునవ్వుల మధ్య కాలర్‌ ఎగరేసి తిరుగుతాడు. నాయకుడంటే ఆ మాదిరిగా ఉండాలి.  
  • నాయకత్వం అంటే విశ్వసనీయత అనే పునాదుల మీద ఎప్పుడూ పెరుగుతుంది. 
  • పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటా. ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మరో రెండు మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత మీ బిడ్డది. నాది. 
  • ప్రతి గ్రామానికీ మంచి చేశాం. ప్రతి ఇంటికీ మంచి చేశాం. ప్రతి పేదకూ మంచి చేశాం. ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామం తీసుకున్నా.. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు.. ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికీ, రాష్ట్ర వ్యాప్తంగా 87 శాతం ఇళ్లకు ప్రతి ఇంటికీ మంచి జరిగింది. 
  • వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో మీరందరూ మీ సచివాలయ పరిధిలో జరిగిన మంచి గురించి చూస్తున్నారు. 
  • ప్రతి గ్రామంలోనూ, ప్రతి సచివాలయం పరిధిలో ఏకంగా రూ.20 కోట్లకుపైగా మంచి జరిగి నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లినట్లు కనిపిస్తుంది. 
  • ఈ మార్పు గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగనిది. దేశంలో ఎక్కడా జరగని ఈ మార్పు. 
  • ప్రతి ఇంటికీ, ప్రతి ఊరికీ మంచి చేశాం. మన హయాంలోనే బడులు, ఆస్పత్రులు బాగుపడ్డాయి. వ్యవసాయం మారింది. ప్రతి అక్కచెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. అందుకే చెబుతన్నా. వై నాట్‌ 175. వై నాట్‌ 25కు 25 ఎంపీ స్థానాలు అని గట్టిగా అడుగుతున్నా. చెబుతున్నా. 
  • పరిపాలనలో ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎంపీగానీ, ఒక్క ఎమ్మెల్యేగానీ తగ్గే పరిస్థితే ఉండకూడదని తెలియజేస్తున్నా. 
  • ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఐదేళ్ల కాలంలో ఇంటికీ కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి పథకాలు కొనసాగించాలనే మనకు, వాటిని రద్దు చేయడమే టార్గెట్‌గా పెట్టుకుని డ్రామాలాడుతున్న చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు.
  • ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున ఉంటే పెత్తందార్లు మరోవైపున ఉన్నారు.
  • పెత్తందార్లను ఓడించి పేదల ప్రయోజనాలను కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..!
  • ఈ యుద్ధం మాట ఇచ్చిన నిలబెట్టుకున్న మనకు, మాట తప్పడమే అలవాటుగా ఉన్న వారికి మధ్య ఈ యుద్ధం. 
  • ఇది విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధం. 
  • ఈ యుద్ధంలో వంచకుల్ని, వెన్నుపోటుదారుల్ని ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..!
  • జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయడానికి చంద్రబాబునాయుడు ప్రచారాలు, ఈనాడు రోత రాతలు, ఏబీఎన్‌, టీవీ5 ఎల్లో మీడియా తప్పుడు కథనాలు, వారి అబద్ధాలు, మోసాలు.. వీటన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్‌ను కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..!
  • ప్రతి ఒక్కరూ కూడా మీ జేబులోంచి సెల్‌ఫోన్‌ తీయండి.. సెల్‌ ఫోన్లో లైట్‌ బటన్‌ ఆన్‌ చేయండి.. సిద్ధం అని చెప్పండి.. 
  • ఇలా వెలుగుల బాటలో ప్రయాణానికి మరోసారి సిద్ధం అని చెప్పండి. 
  • దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో కేవలం రెండు నెలల్లోగా మరో ఐదేళ్లు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు జగన్‌ అనే నేను.. మీ సేవకుడిగా సిద్ధం అని ఈ సందర్భంగా చెబుతున్నా. 

4:27PM, Mar 10, 2024

సభా వేదికపైకి చేరుకున్న సీఎం జగన్

  • ర్యాంప్‌పై నలువైపులా తిరుగుతూ ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్‌
  • కాసేపట్లో ప్రసంగించనున్న సీఎం జగన్‌
  • జన సంద్రంగా మారిన మేదరమెట్ల
  • లక్షలాదిగా తరలివచ్చిన జనం
  • మేదరమెట్లలో ఇసుకేస్తే రాలనంత జనం
  • ఎక్కువ మంది వీక్షించేలా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు

4:20PM, Mar 10, 2024

మేదరమెట్ల సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్‌

  • సీఎం జగన్‌ ప్రసంగం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జనం

4:07PM, Mar 10, 2024

మేదరమెట్ల చేరుకున్న సీఎం జగన్‌

  • జనసంద్రమైన మేదరమెట్ల

  • వైఎస్సార్‌సీపీ సిద్ధం సభకు పోటెత్తిన జన ప్రవాహం

  • 15లక్షల మందికిపైగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు వచ్చినట్లు అంచనా

  • జై జగన్‌ నినాదాలతో  హెరెత్తుతున్న మేదరమెట్ల సభా ప్రాంగణం

  • వన్స్‌మోర్‌ జగన్‌ నినాదాలతో దద్దరిల్లుతున్న మేదరమెట్ల

YSRCP కొత్త క్యాంపెయిన్ నా కల

  • ఏపీలో వైఎస్సార్‌సీపీ కొత్త క్యాంపెయిన్ కు శ్రీకారం 
  • సిద్ధం సభ వేదిక పై నా కల ప్రచార కార్యక్రమం ప్రారంభం 
  • ఏపీ వ్యాప్తంగా నా కల పేరుతో హోర్డింగ్ లు 
  • యువత, రైతులు, మహిళలు, కార్మికులు, వృద్ధులు, విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం

డ్రోన్‌ కలకలం

  • సిద్ధం సభలో మంత్రి అంబటి రాంబాబు ప్రసంగిస్తూండగా... సభా ప్రాంగణంలో ఒకవైపు డ్రోన్‌ ఒకటి ఎగురుతూ కనిపించింది.
  • అప్రమత్తమైన నిర్వాహకులు వెంటనే డ్రోన్‌ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు.
  • అనుమతి లేకుండా డ్రోన​ ఎగురుతోందని, ఎవరో దాన్ని నియంత్రిస్తున్నారని సభా వేదికపై నుంచి ప్రకటించారు.  
  • సభ​కు హాజరైన వారు ఒక దిక్కుకు చూడటం కనిపించింది.
  • అయితే ఈ అవాంతరం ఒకట్రెండు నిమిషాలకు మించి జరగలేదు.
  • డ్రోన్‌ విషయాన్ని ప్రకటించిన తరువాత అంబటి తన ప్రసంగాన్ని కొనసాగించారు.

3:40PM, Mar 10, 2024

ఆకాశం బద్ధలైందా.. నేల ఈనిందా అన్నట్టుగా ఉంది  ఇక్కడ జనసంద్రాన్ని చూస్తే.. : మంత్రి అంబటి రాంబాబు

  • ఏంటి ఈ జన ప్రవాహం అనిపిస్తోంది
  • ఇక్కడకు సీఎం జగన్‌ హాజరయ్యేలోపు ఓ నాలుగు మాట్లాడదామని వచ్చా
  • ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్లినా 50 శాతం ప్రజలు సీఎం జగన్‌ కావాలనే అంటున్నారు
  • సీఎం జగన్‌ మొనగాడు.. చంద్రబాబు మోసగాడు
  • మొనగాడు కావాలా...?, మోసగాడు కావాలా...?
  • సింగిల్ గా వస్తే చితకబాదుతాం ఇద్దరు వస్తే విసిరి కొడతాం
  • ముగ్గురు కలిసి వస్తే విసిరి సముద్రంలో ముంచేస్తాం
  • 14 ఏళ్లలో చంద్రబాబు చేసిన మేలు ఒక్కటీ లేదు
  • చంద్రబాబు రా.. కదిలి రా అంటే ఎవరూ రావడం లేదు
  • ఎంతమంది కలిసి వచ్చినా చంద్రబాబు ఓటమి ఖాయం
  • ఎలాంటి వివక్ష లేకుండా సీఎం జగన్‌ పారదర్శక పాలన చేశారు

3:25PM, Mar 10, 2024

చంద్రబాబు పచ్చి మోసగాడు: మంత్రి కాకాణి

  • చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు నమ్మరు
  • గతంలో రైతులు, అక్కా చెల్లెమ్మలను మోసం చేశాడు
  • చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశాడు
  • సీఎం జగన్‌ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు
  • 175కు 175 సీట్లు గెలిచి తీరుతాం

3:20PM, Mar 10, 2024

సీఎం జగన్‌కు ప్రజల అండదండలు ఉన్నాయి: అనిల్‌ కుమార్‌ యాదవ్‌

  • వచ్చే ఎన్నికల్లో మన సత్తా చూపించాలి
  • జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక పొత్తులు పెట్టుకున్నారు
  • ఎంతమంది కలిసి వచ్చినా జగన్‌ మరోసారి సీఎం

3:10PM, Mar 10, 2024

మేదరమెట్ల బయల్దేరిన సీఎం జగన్‌

  • కాసేపట్లో సిద్ధం సభకు హాజరుకానున్న సీఎం జగన్‌

  • జనసంద్రమైన మేదరమెట్ల

  • వైఎస్సార్‌సీపీ సిద్ధం సభకు పోటెత్తిన జన ప్రవాహం

  • జన సునామీని తలపిస్తున్న మేదరమెట్ల

సీఎం జగన్‌ పర్యటనలో స్వల్ప మార్పు

  • సీఎం జగన్‌ బాపట్ల జిల్లా మేదరమెట్ల పర్యటనలో స్వల్ప మార్పు 
  • వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావ సభ ‘సిద్దం’లో పాల్గొననున్న ముఖ్యమంత్రి
  • మధ్యాహ్నం 3.25 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు
  • అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు
  • అనంతరం బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.

అన్నిదారులు మేదరమెట్ల వైపే

  • కోస్తాంధ్రలో కనివినీ ఎరుగుని రీతిలో భారీగా సిద్ధం సభ
  • రైళ్లు, బస్సులు, కార్లు, సొంత వాహనాల్లో భారీగా తరలివస్తున్న వైఎస్సార్‌సీపీ క్యాడర్‌
  • రాజకీయ కుంభమేళాను తలపించనున్న సిద్ధం సభ
  • మేదరమెట్లలో సీఎం జగన్‌ ఏం మాట్లాడతారనే ఆసక్తి
  • విపక్షాలపై సీఎం జగన్‌ విసుర్లు ఎలా ఉండనున్నాయి?
  • సీఎం జగన్‌ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ

మేదరమెట్లకు పోటెత్తిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

  • మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ నిలుస్తారంటున్న జనం
  • సీఎం జగన్‌ పథకాలే ప్రతిపక్షాలు కాపీ కొడుతున్నాయి: కార్యకర్తలు
  • ఎంతమందితో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న గెలిచేది మాత్రం జగనే
     

వైఎస్‌ జగన్‌ని మళ్లీ సీఎం చేయడానికి ప్రజలు ‘సిద్ధం’:  ఎంపీ విజయసాయిరెడ్డి

  • సిద్ధం సభకి 15 లక్షల మంది వస్తున్నారు
  • చంద్రబాబు సిద్ధాంతాలు, విలువలు లేకుండా పొత్తు పెట్టుకున్నారు
  • బీజేపీకి గత ఎన్నికల్లో 1 శాతం ఓట్లు వచ్చాయి
  • టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఎలాంటి ప్రయోజనం లేదు
  • సీఎం జగన్‌ని ఓడించడం ఆ మూడు పార్టీల వలన కాదు
  • గతంలో ఎన్డీఏలో ఉండి చంద్రబాబు ఏం సాధించారు
  • సీఎం జగన్‌కి గత ఎన్నికల కంటే అధికంగా ఓట్ల శాతం వస్తుంది
  • అధికారమే చంద్రబాబుఏకి పరమావధి

జై జగన్ నినాదాలతో దద్దరిల్లుతున్న సిద్ధం సభ

  • మేదరమెట్ల సిద్ధం సభకు యువత పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు
  • జై జగన్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు

  • అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ జగన్ చేస్తున్న పాలన.. జనరంజకంగా సాగుతోందంటున్నారు
  • ఎన్ని పార్టీలు పొత్తులతో కలిసి వచ్చినా తామంతా జగన్ వెంటే నడుస్తామని తేల్చి చెప్తున్నారు

మేదరమెట్ల: సిద్ధం సభకు భారీగా తరలివస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

  • వేలాదిగా బస్సులు, కార్లు, ఇతర ప్రయివేటు వాహనాలన్నీ మేదరమెట్ల వైపే
  • దాదాపు 15 లక్షల మంది కార్యకర్తలు హాజరు
  • ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు
  • కొన్నిచోట్ల వాహనాలు దారి మళ్లింపు

సిద్ధం సభకు సర్వం సిద్ధం

  • ప్రత్యేక కాన్సెప్ట్‌తో ర్యాంప్ రూపొందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
  • వై నాట్‌ 175 కాన్సెప్ట్‌తో Y ఆకారంలో ర్యాంప్
  • ర్యాంప్‌ చివర 75 అడుగుల ఎత్తులో రెండు వైపులా వైఎస్సార్‌ కాంగ్రెస్ జెండా రెపరెపలు
  • సీఎం జగన్ ఎన్నికల నినాదంతో ర్యాంప్ ఏర్పాటు
  • ప్రత్యేక ఆకర్షణ గా నిలిచిన వై నాట్‌ 175 కాన్సెప్ట్
  • ఇదే ర్యాంప్‌పై నడిచి ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేయనున్న సీఎం జగన్
     

రాష్ట్రంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ శ్రేణు­లకు దిశానిర్దేశం చేయడానికి బాపట్ల జిల్లా మేదర­మెట్ల సమీపంలోని పి.గుడిపాడు వద్ద ఆదివారం జరగనున్న ‘సిద్ధం’ ఆఖరి సభకు సర్వం సిద్ధమైంది. చరిత్రలో నిలిచిపోయేలా పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగసభకు అన్ని ఏర్పాట్లు పూర్త­య్యాయి. అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల వద్ద కోల్‌కత–చెన్నై జాతీయ రహదారి పక్కనే వందలాది ఎకరాల సువిశాల మైదానంలో ఈ సభను నిర్వహించడానికి భారీ ఏర్పాట్లుచేశారు.

దక్షిణ కోస్తాలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 44 నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో కదలిరానున్నారు. వీరిని ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సీఎం జగన్‌ ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడులలో నిర్వహించిన సిద్ధం సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్‌ సక్సెస్‌ అయిన విషయం తెలిసిందే.

రాప్తాడు సభ ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అతిపెద్ద ప్రజాసభగా నిలిచిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. మూడు సిద్ధం సభలు గ్రాండ్‌ సక్సెస్‌ కావడం.. టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్‌ మ్యారిటైజ్‌ వంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సునామీ సృష్టించడం ఖాయమని తేలడంతో చివరి ‘సిద్ధం’ సభకు కూడా ఉరిమే ఉత్సాహంతో కార్య­కర్తలు, నేతలు, అభిమానులు భారీ ఎత్తున తరలి­వెళ్లడానికి సంసిద్ధమయ్యారు. 

ప్రజాక్షేత్రంలో వైఎస్సార్‌సీపీ దూకుడు
ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి జనవరి 27న భీమిలి వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, సీఎం జగన్‌ సమరశంఖం పూరించారు. ఓ వైపు జనబలమే గీటురాయిగా, సామాజిక న్యాయమే పరమావధిగా శాసనసభ, లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు ‘సిద్ధం’ సభలు నిర్వహిస్తూ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈ సభలు పూర్తవడం.. అవి గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నాయి. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా సీఎం జగన్‌ తెచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రతి ఇంటా గుర్తుచేస్తూ.. ప్రభుత్వంవల్ల మంచి జరిగి ఉంటే.. మరింతగా మంచి చేయడానికి వైఎస్సార్‌సీపీని ఆశీర్వదించి, ఓటు వేయాలని శ్రేణులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. వీరికి ప్రజలు నీరాజనాలు పలుకుతుండటంతో మరింత నూతనోత్సాహంతో వారు ప్రచారంలో పాల్గొంటున్నారు. 

పొత్తుల లెక్కతేలినా నైరాశ్యం..
ఇక టీడీపీ–జనసేన పొత్తుల లెక్క తేలాక రెండు పార్టీలు మొదటిసారిగా ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘జెండా’ సభకు జనం మొహం చాటే­శారు. ‘రా కదలిరా’ పేరుతో చంద్రబాబు నిర్వ­హిస్తున్న సభలకు ప్రజలు తరలిరావడంలేదు. టీడీపీ–­జనసేన పొత్తును ఆదిలోనే జనం ఛీకొట్ట­డం.. వైఎస్సార్‌సీపీ సిద్ధం సభలు గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో ఆ రెండు పార్టీల శ్రేణులు నైతిక స్థై­ర్యాన్ని కోల్పోయాయి. అలాగే, టీడీపీ–జనసేన పొత్తు కుది­రాక టైమ్స్‌నౌ–ఈటీజీ సంస్థ నిర్వహించిన సర్వే­లోనూ 49 శాతం ఓట్లతో వైఎస్సార్‌సీపీ 21–22 లోక్‌­సభ స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని.. టీడీపీ–­జనసేన కూటమి 45 శాతం ఓట్లతో 3–4 లోక్‌సభ స్థానాలకే  పరిమితమవుతుందని తేల్చిచెప్పింది. ఇది ఆ రెండు పార్టీ శ్రేణులను తీవ్ర షాక్‌కు గురిచేసింది. దీంతో ఎన్నికలకు ముందే శ్రేణులు కకావికలమ­వుతుండటంతో ఉనికి చాటుకునేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్లావేళ్లాపడి.. ఆ పార్టీతోనూ పొత్తు ఖరారు చేయించుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

సీఎం కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ నేతృత్వంలో సీఎం కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. అనంతరం ఎస్పీ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సిద్ధం సభకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా మొత్తం సుమారు 4,200 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశామన్నారు. నలుగురు ఎస్పీలు, 14 మంది అడిషనల్‌ ఎస్పీలు, 21 మంది డీఎస్పీలు, 92 మంది సీఐలు, 292 మంది ఎస్‌ఐలతోపాటు ఏఆర్‌ నుంచి 400 మంది, స్పెషల్‌ ఫోర్స్‌ సుమారు 160 మంది బందోబస్తులో ఉన్నారన్నారు. పదివేలకు పైగా బస్సులు, ఇతర వాహనాలు వచ్చే అవకాశ­మున్నందున దానికి అనుగుణంగా 338 ఎకరాల్లో 28 పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటుచేశామని ఎస్పీ చెప్పారు. 

పటిష్ట ఏర్పాట్లు
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే­వారికి ఎలాంటి అసౌకర్యం కల­గకుండా పటిష్ట ఏర్పాట్లు­చేస్తోంది. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమ­న్వ­యకర్త తలశిల రఘు­రామ్, ప్రభుత్వ విప్‌ లేళ్ల అప్పిరెడ్డి అక్కడే మకాంవేసి ఎప్పటి­కప్పుడు ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు. ఆదివా­రం సా.3 గంటల నుంచి 5 గంటల వరకూ ఈ సభ జరుగుతుంది. రాజ్యసభ సభ్యులు, ఉత్త­రాంధ్ర రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బా­రెడ్డి, మంత్రి విడదల రజిని, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమ­ణారావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, అద్దంకి సమన్వయకర్త పాణెం చిన హని­మిరెడ్డి తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.

ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా..
► ఆదివారం ఉ.10 గంటల నుంచి వాహ­నాల దారి మళ్లింపు చేపడుతున్నట్లు ఎస్పీ జిందాల్‌ చెప్పారు. నెల్లూరు వైపు నుంచి ఒంగోలు మీదుగా హైదరాబాద్‌ వైపు వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు సౌత్‌ బైపాస్‌ నుంచి సంఘమిత్ర హాస్పిటల్, కర్నూల్‌ రోడ్డు, చీమకుర్తి, పొదిలి దొనకొండ అడ్డ రోడ్డు మీదుగా హైదరాబాద్‌కు దారి మళ్లిస్తామన్నారు. 
► హైదరాబాద్‌ వైపు నుంచి ఒంగోలు వైపు­నకు వచ్చే భారీ వాహనాలను సంతమా­గులూరు అడ్డరోడ్డు, వినుకొండ, మార్కా­పురం, పొదిలి, చీమకుర్తి మీదుగా.. 
► నెల్లూరు వైపు నుంచి ఒంగోలు మీదుగా హైద­రా­బాదు వైపు వెళ్లే సాధారణ వాహ­నాలను మేదరమెట్ల వద్ద నుంచి నామ్‌ హైవేపై అద్దంకి, సంతమా­గులూరు మీదుగా మళ్లిస్తున్నారు.

► ఒంగోలు వైపు నుంచి విశాఖ­ వైపు ఎన్‌­హెచ్‌ 16పై వెళ్లే వాహనాలను త్రోవగుంట నుంచి ఎన్‌హెచ్‌ 216 పైకి మళ్లించి చీ­రాల, బాపట్ల, మచిలీపట్నం మీదుగా పంపుతున్నారు.
► ఒంగోలు వైపు నుంచి విజయ­వాడ, గుంటూరు వైపు వెళ్లే వాహ­నాలను త్రోవగుంట, చీరాల, బాపట్ల, పొన్నూరు మీదుగా వాహ­నాలను మళ్లిస్తారు.
► ఒంగోలు వైపు నుంచి చిలక­లూరిపేట వైపు వెళ్లే వాహనా­లను త్రోవగుంట, చీరాల, పర్చూరు మీదుగా.. విశాఖ­పట్నం నుంచి ఒంగోలు, చెన్నై వైపు వెళ్లే వాటిని నర్సాపురం, మచిలీపట్నం, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా.. గుంటూరు నుంచి ఒంగోలు, చెన్నై వైపు వెళ్లే వాహనా­లను బుడంపాడు అడ్డరోడ్డు నుంచి పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా మళ్లిస్తున్నారు. 

► 16వ నంబర్‌ ఎన్‌హెచ్‌పై మేదర­మెట్ల గ్రోత్‌ సెంటర్‌ నుంచి బొల్లాపల్లి టోల్‌­ప్లాజా వరకు ఎలాంటి వాహనాలను అను­మ­తించడంలేదని.. సిద్ధం సభ ప్రాంగణా­నికి వచ్చే వాహనాలనే అను­మ­తిస్తామ­ని చెప్పారు. ఈ ఆంక్షలు ఆ­ది­వా­రం రాత్రి 8 వరకూ అమల్లో ఉంటాయన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement