భారతీయుడిగా గర్వపడేలా ఉంటుంది | akshay kumar airlift will make you proud to be indian | Sakshi
Sakshi News home page

భారతీయుడిగా గర్వపడేలా ఉంటుంది

Published Wed, Dec 30 2015 2:22 PM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM

భారతీయుడిగా గర్వపడేలా ఉంటుంది

భారతీయుడిగా గర్వపడేలా ఉంటుంది

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న మరో పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఎయిర్ లిఫ్ట్. 1990లో ఇరాక్ కువైట్ యుద్ధం సందర్భంగా భారీ ఎత్తున భారతీయులను తరలించిన సమయంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాజా కృష్ణ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ  చిత్రంలో అక్షయ్ కుమార్, నిమ్రత్ కౌర్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.

ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కువైట్కు చెందిన బిజినెస్మేన్ రంజిత్ కట్యాల్ పాత్రలో నటిస్తున్నాడు. జనవరి 22న రిలీజ్కు రెడీ అవుతున్న  ఎయిర్ లిఫ్ట్ విశేషాలను అక్షయ్ కుమార్ తన ట్విట్టర్లో మూవీ పోస్టర్ను రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా  ఎయిర్ లిఫ్ట్ సినిమా భారతీయుడిగా గర్వించే విధంగా రూపొందిందని ట్వీట్ చేశాడు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement