Ukraine: తెలంగాణ వాళ్లని క్షేమంగా వెనక్కి తీసుకురండి.. ఖర్చులు మేం భరిస్తాం | KTR Appealed MEA Jaishankar That Telangana Govt is ready to bear the full travel expenses for T students | Sakshi
Sakshi News home page

ఖర్చులు మేమిస్తాం.. మా స్టూడెంట్స్‌ని త్వరగా తీసుకురండి -కేటీఆర్‌ విజ్ఞప్తి

Published Fri, Feb 25 2022 1:45 PM | Last Updated on Fri, Feb 25 2022 1:53 PM

KTR Appealed MEA Jaishankar That Telangana Govt is ready to bear the full travel expenses for T students - Sakshi

ఉక్రెయిన్‌లో చదువుతున్న తమ రాష్ట్ర విద్యార్థులను క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వారి తరలింపుకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ రాష్ట్ర ప్రజల విషయంలో ఇప్పటికే కేంద్రానికి పలు రాష్ట్రాలు విజ్ఞప్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణ ఖర్చులు కూడా భరిస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసింది.

తెలంగాణ నుంచి సుమారు ఆరు వందల మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చేస్తున్నట్టు సమాచారం. వీరిలో సగానికి పైగా విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. వీరి కోసం హైదరాబాద్‌తో పాటు న్యూఢిల్లిలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేశారు. తమను రక్షించాలని.. త్వరగా ఇండియాకి వచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ అనేక కాల్స్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లకు వస్తున్నాయి. దీంతో తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 

చదవండి: ఉక్రెయిన్‌ నుంచి మనవాళ్లు రావాలంటే.. ఈ చిక్కుముళ్లు వీడాలి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement