రెండు రోజుల్లో రూ.33.5 కోట్ల వసూళ్లు
అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి రికార్డు వసూళ్లతో థియేటర్లలో హల్చల్ చేస్తోంది. ఈ సంవత్సరం రిలీజైన సినిమాల్లో మంచి ఓపెనింగ్స్ సాధించింది. గురువారం బన్నీ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఈ రెండురోజుల్లోనే రూ. 33.35 కోట్లు రాబట్టిందని సినీ ఎనలిస్టుల తాజా కబురు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ కుటుంబ కథా చిత్రంలో సమంత, నిత్యామీనన్, అదా శర్మ, రాజేంద్రప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ సినిమాలో ప్రధానంగా త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులు యువతరాన్ని ఆకట్టుకుంటున్నాయి. ఇక దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, రొటీన్ కు భిన్నంగా తెరకెక్కిన ఈ చిత్రం రాబోయే వారం రోజుల్లో మరింత వసూళ్లను సాధించి పెద్ద హిట్గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.