ఇండియన్ మార్కెట్‌లో చైనా వస్తువులు డామినేట్ చేస్తుంటే... చైనాలో ఇండియన్ సినిమాలు భారీ వసూళ్లను కొల్లగొడుతున్నాయి. చైనాలో ఇండియన్ సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్, భజరంగీ భాయిజాన్ సినిమాలు రికార్డు కలెక్షన్లు సాధించాయి. తాజాగా... ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘హిందీ మీడియం’ విజయవంతంగా దూసుకెళ్తోంది.
హిందీ మీడియం సినిమా చైనాలో రూ. 200 కోట్ల రూపాయలను కొల్లగొట్టబోతోంది. ఇప్పటికే రూ. 184 కోట్లను రాబట్టిందని అతి త్వరలోనే రెండు వందల కోట్ల మార్క్‌ను చేరుకుంటుందని మార్కెట్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇండియన్ సినిమాలు చైనా మార్కెట్‌ను బాగానే ఆకర్షిస్తున్నాయి. అమెరికా తరువాత చైనాలో ఇండియన్ సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. బీ టౌన్ ప్రస్తుతం చైనా మార్కెట్ వైపు చూస్తోంది. వాస్తవికత, సహజతత్వానికి దగ్గరకు ఉన్న కథలకు చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
#HindiMedium biz more than doubles on second Sat in CHINA... Is nearing ₹ 200 cr mark...
— taran adarsh (@taran_adarsh) 15 April 2018
[Week 2]
Fri $ 0.62 mn
Sat $ 1.41 mn
Total: $ 28.20 million [₹ 184.06 cr]
Comments
Please login to add a commentAdd a comment