బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఎండోక్రైన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన లండన్‌లో చికిత్స పొందుతున్నారు. ట్రీట్‌మెంట్‌కి బాగా స్పందిస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ట్రీట్‌మెంట్ పొందుతూనే శ్రేయోభిలాషులు, అభిమానుల కోసం ఎమోషనల్ లెటర్ రాశారు ఇర్ఫాన్ ఖాన్. ‘‘న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్. ఈ మధ్య తరుచుగా వింటున్న పేరు. చాలా రేర్‌గా వచ్చే వ్యాధి అని, చికిత్స కూడా పూర్తిస్థాయిలో లేదని తెలుసుకున్నా. ట్రీట్‌మెంట్‌కి సంబంధించి ప్రస్తుతం నేను ట్రైల్ అండ్ ఎర్రర్‌ని మాత్రమే. ఎన్నో గోల్స్, ఆశయాలతో వెళ్తున్న స్పీడ్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న నన్ను సడెన్‌గా టీసీ వచ్చి నీ స్టాప్ వచ్చింది దిగు అన్నట్టు తోచింది. నాకేం అర్థం కాలేదు. నా స్టేషన్ ఇది కాదే అనిపించింది.
కానీ జీవితంలో కొన్నిసార్లు ఇంతే కదా. మహాసముద్రంలో తేలుతూ ప్రయాణిస్తున్న వాళ్లం. ఎప్పుడు ఏ అల మనల్ని ఎటు తీసుకువెళ్తుందో తెలీదు. ఈ ట్రీట్‌మెంట్ జరుగుతున్న ప్రాసెస్‌లో నిజమైన స్వేచ్ఛ ఏంటో అర్థం చేసుకోగలుగుతున్నా. వివిధ దేశాల నుంచి, ప్రాంతాల నుంచి నాకోసం చాలా మంది ప్రార్థిస్తున్నారు. అవే ప్రస్తుతానికి నా బలం. మీ అందరి ప్రేయర్స్ ఓ ఫోర్స్‌లా నన్ను ముందుకు తీసుకువెళ్తుంది. నా బలమేంటో తెలుసుకొని ఈ ఆటను ఇంకా బెటర్‌గా ఎలా ఆడాలో ఆలోచించ టమే ప్రస్తుతం నేను చేయగలిగేది’’ అని రాశారు.
నా స్టేషన్ ఇది కాదే!
Published Wed, Jun 20 2018 12:11 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment