ముంబై: బాలీవుడ్‌లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నటనకు ప్రాధాన్యత పెంచేందుకు ప్రయత్నిస్తూ తన తండ్రి జీవితాన్ని ధారపోశాడని బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రపంచ సినిమాల్లో బాలీవుడ్ గౌరవించలేదంటూ ఫిలిం స్కూల్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇర్ఫాన్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘నేను లండన్ ఫిలిం స్కూల్‌కు వెళ్లేముందు నా తండ్రి నాకు నేర్పించిన అతి ముఖ్యమైన పాఠం ఏంటో మీకు తెలుసా! ప్రపంచ సినిమాల్లో బాలీవుడ్ అరుదుగా గౌరవించబడుతున్నందున నటుడిగా నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. బాలీవుడ్‌కు మించిన భారతీయ సినిమా గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు. (చదవండి: ‘అక్కడ బాలీవుడ్ సినిమాలకు గౌరవం లేదు’)
‘‘నా త్రండి చెప్పినట్టుగా దురదృష్టవశాత్తు అదే జరిగింది. లండన్ ఫిలిం స్కూల్‌కు వెళ్లిన నాకు అక్కడ బాలీవుడ్ సినిమాలు గౌరవించబడినట్లు కనిపించలేదు. ఇక 60, 90 నాటి సినిమాల గురించి అయితే అక్కడ ఎవరికీ అవగాహన కానీ సరైన అభిప్రాయం కానీ లేదు. ‘బాలీవుడ్ అండ్ బియాండ్’ అన్నట్టుగా మన సినిమాలను చూస్తున్నారు. ప్రముఖ దర్శకులైన సత్యజిత్ రే, కె ఆసిఫ్‌ల గురించి అయితే సరైనా ఉపన్యాసం దొరకదు. అది ఎందుకో తెలుసా? ప్రేక్షకులుగా మనం అభివృద్ధిని నిరాకరించాం కాబట్టి’ అంటూ బాబిల్ రాసుకొచ్చాడు. (చదవండి: ప్రముఖ నటుడు జగదీప్ కన్నుమూత)
ఇర్ఫాన్ గురించి చెబుతూ.. ‘‘మా నాన్న బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్లాడు. ఆయన ఓ లెజెండరి నటుడిగా గుర్తింపు పొందారు. అయినప్పటికీ ఆయన సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద ఓడిపోయాయి. ఆయన బాలీవుడ్‌లో కేవలం నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ బాలీవుడ్ సినిమాలు అంటే సిక్స్ ప్యాక్స్ అబ్స్, జీరో సైజ్, ఐటెం సాంగ్స్, సెక్సిజం, నెపోటిజంతో నిండిపోయాయి. ప్రేక్షకులు కూడా వాటికే అలవాటు పడిపోయారు. కానీ నా తండ్రి నటన ప్రత్యేకత పెంచడం కోసం తన జీవితాన్నే ఇచ్చాడు’’ అంటూ భావోద్యేగానికి లోనయ్యాడు. చివరిగా ‘అంగ్రేజీ మీడియం’లో నటించిన ఇర్ఫాన్ ఈ ఏడాది ఏప్రిల్ 29న మృతి చెందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment