ఔను! 'దిల్‌వాలే' నిరాశపర్చింది: షారుఖ్ | Shah Rukh Khan is 'personally disappointed' on Dilwale | Sakshi
Sakshi News home page

ఔను! 'దిల్‌వాలే' నిరాశపర్చింది: షారుఖ్

Published Tue, Jan 12 2016 3:24 PM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

ఔను! 'దిల్‌వాలే' నిరాశపర్చింది: షారుఖ్

ఔను! 'దిల్‌వాలే' నిరాశపర్చింది: షారుఖ్

ముంబై: బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ పెయిర్‌గా నిలిచిన జోడీ షారుఖ్‌ ఖాన్, కాజోల్. వీరు గతంలో కలిసి నటించిన చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. వీరు మళ్లీ జత కట్టడంతో 'దిల్‌వాలే' సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఈ జోడీ బాక్సాఫీస్‌ వద్ద మళ్లీ తమ మ్యాజిక్‌ను చూపుతుందని చాలామంది భావించారు. అయితే 'దిల్‌వాలే' మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. భారీ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించినప్పటికీ ఆ ఊపును కొనసాగించలేకపోయింది.

ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిందనే విషయాన్ని షారుఖ్‌ సైతం అంగీకరించాడు. 'దిల్‌వాలే' పెద్ద విజయాన్ని సాధించలేకపోయిందని చెప్పాడు. 'ఈ సినిమా ఆడాల్సినంత గొప్పగా ఆడలేదు. వ్యక్తిగతంగా ఈ విషయంలో నిరాశ చెందాను. అయితే, భారత్‌లో కంటే విదేశాల్లో 'దిల్‌వాలే' మంచి కలెక్షన్లు సాధించింది. జర్మనీ, ఆస్ట్రియా వంటి దేశాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయి. భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయాన్ని ఇది చాటుతోంది' అని షారుఖ్ తెలిపారు.

సంజయ్‌ లీలా భన్సలీ 'బాజీరావు మస్తానీ' సినిమాతో పోటీపడి.. డిసెంబర్ 18న విడుదలైన 'దిల్‌వాలే' మొత్తంగా రూ. 350 కోట్లకుపైగా వసూలు చేసింది. అయినా ఈ సినిమా ప్రక్షకుల నుంచి సానుకూల స్పందన రాబట్టలేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement