అక్కడ 'దిల్‌వాలే' జోరు- 'బాజీరావు' బేజారు! | 'Dilwale' performing better than 'Bajirao Mastani' at Pakistani box office | Sakshi
Sakshi News home page

అక్కడ 'దిల్‌వాలే' జోరు- 'బాజీరావు' బేజారు!

Published Wed, Dec 23 2015 3:21 PM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM

అక్కడ 'దిల్‌వాలే' జోరు- 'బాజీరావు' బేజారు!

అక్కడ 'దిల్‌వాలే' జోరు- 'బాజీరావు' బేజారు!

కరాచీ: బాలీవుద్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ నటించిన యాక్షన్‌ కామెడీ 'దిల్‌వాలే' పాకిస్థాన్‌ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల జాతర చేస్తోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి మూడురోజుల్లో ఏన్నడులేనంతంగా వసూళ్లు రాబట్టింది. 'దిల్‌వాలే'తో ధాటిగా దీటుగా పోటీపడి రీలిజైన 'బాజీరావు మస్తానీ' మాత్రం పాకిస్థాన్‌లో పెద్దగా సందడి చేయలేకపోతున్నది.

రోహిత్‌శెట్టి మార్క్ సినిమా అయిన 'దిల్‌వాలే' పాక్‌లో తొలి మూడురోజుల్లో రూ. 6.5 కోట్లు (65 మిలియన్లు) రాబట్టింది. ఈ సినిమా వరుసగా మూడురోజుల్లో రూ. 2.13 కోట్లు, రూ. 2.4 కోట్లు, రూ. 2.3 కోట్ల వసూళ్లు రాబట్టిందని డిస్ట్రిబ్యూటర్‌ సంస్థ ఎవర్రెడీ పిక్చర్స్ తెలిపింది. ఇక సంజయ్‌లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాజీరావు మస్తానీ' మాత్రం తొలి మూడురోజుల్లో రూ. 2.1 కోట్లు వసూలు చేసింది. 'దిల్‌వాలే' కలెక్షన్‌తో పోల్చుకుంటే ఇది మూడోవంతు కూడా కాదు.

అయితే 'బాజీరావు మస్తానీ' పాక్‌ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నదని ఇప్పుడే చెప్పడం సరికాదని, ఇప్పుడు ఆ సినిమా థియేటర్లకు కూడా 'క్యూ' కట్టే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతున్నదని, 'బాజీరావు' కలెక్షన్లు కూడా పెరిగే అవకాశముందని ఆ సినిమా పంపిణీదారు నదీం మందిద్వివాలా తెలిపారు.

ఇటు షారుఖ్‌-కాజోల్‌ జోడీ 'దిల్‌వాలే', అటు భన్సాలీ మార్క్ చారిత్రక ప్రణయకావ్యం 'బాజీరావు'.. రెండు సినిమాలు భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యాయి. రెండు సినిమాలకు దాదాపు సానుకూల రివ్యూలే వచ్చాయి. భారత్‌లో మాత్రం రెండు సినిమాలు పోటాపోటీగా వసూళ్లు రాబడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement