Pakistani Actress Sadia Khan Denies Rumours Of Dating Shah Rukh Khan's Son Aryan Khan - Sakshi
Sakshi News home page

Aryan Khan-Sadia Khan: ఆర్యన్‌ ఖాన్‌తో డేటింగ్‌! క్లారిటీ ఇచ్చిన పాకిస్తాన్‌ నటి

Published Wed, Jan 11 2023 1:36 PM | Last Updated on Wed, Jan 11 2023 3:24 PM

Pakistani Actress Sadia Khan Denied Dating Rumours With Aryan Khan - Sakshi

గతంలో డ్రగ్‌ కేసుతో సంచలనమైన బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ ఇప్పుడు డేటింగ్‌ రూమర్స్‌ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల పాకిస్తాన్‌ మోడల్‌, నటి సాదియా ఖాన్‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ వార్తలు హాల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు వీరిద్దరు కాస్తా క్లోజ్‌గా దిగిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ వార్తలపై క్లారిటీ రాకముందే బాలీవుడ్‌ నటి, డాన్సర్‌ నోరా ఫతేహితో ఆర్యన్‌ ఖాన్‌ ప్రేమాయణం అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఆర్యన్‌తో డేటింగ్‌ రూమర్స్‌పై పాకిస్తాన్‌ నటి సాదియా ఖాన్‌ స్పందించింది. 

తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఆమె ఆర్యన్‌తో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసలేం తెలియకుండానే ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది. కలిసి ఫొటో దిగితే వారు రిలేషన్‌లో ఉన్నట్లేనా? అసలు ఏంటీ? ఏం జరిగిందో తెలియాకుండానే అలా ఎలా రాసేస్తారు. ఒక్క ఫొటో చూసి డేటింట్‌లో ఉన్నాని ఎలా అభిప్రాయపడతారు. ఇదంత వింతగా.. విచిత్రంగా అనిపిస్తోంది’ అని పేర్కొంది. అనంతరం ‘ఆర్యన్‌ను న్యూ ఇయర్‌ ఈవెంట్‌లో కలిశాను. అప్పుడు మేం మాట్లాడుకున్నాం, ఫొటో దిగాం. ఫొటో దిగినంత మాత్రాన మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నట్లు కాదు.

ఆ రోజు న్యూ ఇయర్‌ పార్టీ నేను మాత్రమే లేను. చాలా మంది ఉన్నారు. వారంత కూడా ఆర్యన్‌తో ఫొటో దిగారు. వారందరు కూడా సోషల్‌ మీడియాలో ఫొటోలు కూడా షేర్‌ చేశారు. కానీ ఈ రూమర్స్‌పై నాపైనే ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదు’ అంటూ సాధియా మండిపడింది. కాగా దుబాయ్‌లో జరిగిన న్యూ ఇయర్‌ ఈవెంట్‌లో సాధియా ఖాన్‌, ఆర్యన్‌ ఖాన్‌లు కలిసి ఫొటో దిగారు. ఈ ఫొటోలను ఆమె తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఆ తర్వాత వెంటనే వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే సాధియా పాకిస్తాన్‌లో పలు టీవీ సీరియల్స్‌తో గుర్తింపు పొందింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement