రెండో రోజు కూడా 'ఖుషి'.. ఎన్ని కోట్లు వచ్చాయంటే? | Vijay Samantha Khushi Collections On on day 2 at box office | Sakshi

Khushi Collections Day-2: బాక్సాఫీస్ వద్ద ఖుషి జోరు.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Sep 3 2023 10:52 AM | Updated on Sep 3 2023 11:47 AM

Vijay Samantha Khushi Collections On on day 2 at box office  - Sakshi

లైగర్ డిజాస్టర్‌ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన చిత్రం 'ఖుషి'. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటించింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. రిలీజ్‌ రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.30.1 కోట్లు వసూళ్లు చేసింది. లైగర్ తర్వాత వచ్చిన మూవీకి హిట్ టాక్‌ రావడంతో విజయ్ సైతం ఎమోషనలయ్యారు. 

(ఇది చదవండి: బాక్సాఫీస్‌ వద్ద ‘ఖుషి’ జోరు.. ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంతంటే? )

విజయ్, సమంతల రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఓవర్సీస్‌లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. అయితే మొదటి రోజు రూ.15.25 నెట్ వసూళ్లు సాధించగా.. రెండో రోజు రూ.9 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో రెండు రోజుల్లోనే ఓవరాల్‌గా రూ.24.25 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది.  కాగా... ఈ చిత్రంలో జయరాం, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించాడు.

(ఇది చదవండి: 'సలార్' రిలీజ్ వాయిదా పడిందా? నిజమేంటి?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement