
మూడు రోజుల్లో రూ.95.21 కోట్లు!
ముంబై: విలక్షణ నటుడు ఆమిర్‌ఖాన్ తాజా చిత్రం 'పీకే' రికార్డు వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో రూ. 95.21 కోట్లు వసూలు చేసింది. తొలిరోజు రూ. 26.63 కోట్లు, తర్వాతి రోజు రూ.30.34 కోట్లు, ఆదివారం రూ.38.24 కోట్లు రాబట్టిందని నిర్మాత ఒక ప్రకటనలో తెలిపారు.
అభిమానులు, విమర్శలు ప్రశంసలందుకున్న 'పీకే' సినిమా భారీ వసూళ్లు సాధిస్తుండడం విశేషం. ఆమిర్ఖాన్ సరసన అనుష్కశర్మ నటించిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. విధు వినోద్‌చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు.