బాక్సాఫీస్‌పై ‘వార్‌’ దండయాత్ర.. | Blockbuster Opening For War Movie | Sakshi

బాక్సాఫీస్‌పై ‘వార్‌’ దండయాత్ర.. భారీగా కలెక్షన్లు

Oct 3 2019 2:31 PM | Updated on Oct 3 2019 6:12 PM

Blockbuster Opening For War Movie - Sakshi

బాలీవుడ్ స్టార్స్‌ హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌లు హీరోలుగా తెరకెక్కిన భారీ యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ వార్‌.. ఊహించినట్టుగానే భారీ కలెక్షన్లతో అదరగొడుతోంది. ఈ ఏడాది అతిపెద్ద మల్టీస్టారర్‌గా, బిగ్గెస్ట్‌ యాక్షన్‌ మూవీగా ప్రమోటైన ‘వార్‌’కు పాజిటివ్‌ రివ్యూలతోపాటు ఆడియెన్స్‌ టాక్‌ కూడా బలంగా ఉండటంతో తొలిరోజు రికార్డుస్థాయిలో వసూళ్లు రాబట్టింది. గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన వార్‌ సినిమా తొలి రోజు రూ. 53.35 కోట్లు రాబట్టింది. హిందీలో ఈ సినిమా 51.60 కోట్లు రాబట్టగా.. తమిళం, తెలుగు భాషల్లో రూ. 1.75 కోట్లు వసూలు చేసింది. 

తొలిరోజే ఏకంగా 53 కోట్లు వసూలు చేసిన ‘వార్‌’ పలు రికార్డులు సృష్టించింది. బాలీవుడ్‌ చరిత్రలో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా వార్‌ నిలిచింది. గతంలో అమీర్‌ ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌ నటించిన మల్టీస్టారర్‌ ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌’ తొలిరోజు 52.50 కోట్లు వసూలు చేయగా.. ఆ రికార్డును వార్‌ చెరిపేసింది. ఈ రెండు సినిమాలు యష్‌రాజ్‌ ఫిల్మిమ్స్‌ తీసినవే కావడం గమనార్హం.



ఇక ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో అత్యధిక రోజు వసూళ్లు సాధించిన సినిమాగా వార్‌ మొదటిస్థానంలో ఉండగా.. భారత్‌ (42.30 కోట్లు), మిషన్‌ మంగళ్‌ ( 29.16 కోట్లు), సాహో (24.40కోట్లు), కళంక్‌ (21.60కోట్లు) వరుసగా తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాదిలో చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా ప్రభావం వార్‌పై ఉంటుందని భావించారు. కానీ, అంతగా ఆ ప్రభావం లేదని వసూళ్లు చాటుతున్నాయని ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వార్‌ సినిమాలో హృతిక్‌ కబీర్‌గా, టైగర్‌ ఖలీద్‌గా కనిపించనున్నారు. గురుశిష్యులైన వీరిద్దరు ప్రత్యర్థులుగా ఎందుకు మారారు అన్నదే వార్‌ కథ. సిద్ధార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతోపాటు పలు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement