ముంబై : విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద రూ 53 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి భారీ కమర్షియల్ హిట్ కొట్టిన వార్ మూవీ టీం సక్సెస్ జోష్‌లో మునిగితేలుతోంది. బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లు తెరను పంచుకున్న ఈ మూవీ విశేష ప్రేక్షకాదరణతో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. వార్ గ్రాండ్ సక్సెస్‌తో చిత్ర బృందం ముంబైలోని వైఆర్‌ఎఫ్ స్టూడియోస్‌లో ఘనంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు. సక్సెస్ పార్టీలో హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, మూవీ హీరోయిన్ వాణికపూర్ పాల్గొని సందడి చేశారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన వార్ మూవీకి క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందన ఎదురైనా వసూళ్లలో మాత్రం సరికొత్త రికార్డులతో దూసుకెళుతోంది.
Comments
Please login to add a commentAdd a comment