బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న స్త్రీ-2.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే? | Shraddha Kapoor Stree 2 Movie Box Office Collection On Day 5 | Sakshi
Sakshi News home page

Shraddha Kapoor: స్త్రీ-2 చిత్రానికి ఊహించని కలెక్షన్స్‌.. కేవలం ఐదు రోజుల్లోనే!

Aug 20 2024 7:59 PM | Updated on Aug 20 2024 8:22 PM

Shraddha Kapoor Stree 2 Movie box office collections On day 5

బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్‌ రావు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం స్త్రీ-2. గతంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా అమర్‌ కౌశిక్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఆగస్టు 15న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రక్షాబంధన్‌ రోజు సోమవారం సైతం రూ.45 కోట్ల కలెక్షన్స్‌తో హవా కొనసాగించింది.

ఇండియా విషయానికొస్తే ఐదో రోజు సైతం రూ. 38.4 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది.  ఈ సినిమా రిలీజైన ఐదు రోజుల్లోనే ఇండియావ్యాప్తంగా రూ. 242.4 కోట్ల వసూళ్లు సాధించింది. ఇదే జోరు కొనసాగితే ఈ వారాంతంలో పెద్ద సినిమాల రికార్డులు బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. అదే రోజు బాక్సాఫీస్ వద్ద విడుదలైన ఖేల్‌ ఖేల్‌ మే, వేదా చిత్రాలతో స్త్రీ-2 పోటీ పడుతోంది. ఆ రెండు సినిమాల కలెక్షన్లను బీట్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. కాగా.. ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్, వరుణ్‌ ధావన్‌, అపర్ శక్తి, పంకజ్‌ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. హారర్ కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం మరిన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో వేచి చూడాల్సిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement