బాక్సాఫీస్ వద్ద అదే జోరు.. కేజీఎఫ్‌-2 రికార్డ్ బద్దలయ్యే ఛాన్స్‌! | Horror comedy Movie Stree 2 box office Ready To surpass KGF 2 Hindi earnings | Sakshi
Sakshi News home page

Stree 2 box office: బాక్సాఫీస్ వద్ద అదే జోరు.. త్వరలో కేజీఎఫ్‌-2 రికార్డ్‌ బ్రేక్!

Published Tue, Aug 27 2024 1:48 PM | Last Updated on Tue, Aug 27 2024 3:08 PM

Horror comedy Movie Stree 2 box office Ready To surpass KGF 2 Hindi earnings

శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్‌ రావు ప్రధాన పాత్రల్లో వచ్చిన హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న విడుదలైన ఈ  మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా రిలీజై 12 రోజులైనప్పటికీ కలెక్షన్స్‌ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.589 కోట్ల గ్రాస్‌ వసూళ్ల సాధించింది. కేవలం ఇండియాలోనే రూ.498 కోట్ల గ్రాస్‌ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. రూ.422 కోట్ల నెట్ వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏకంగా రూ.20.2 కోట్ల కలెక్షన్స్‌ వచ్చాయి.

విడుదలైన రెండోవారం మొదలైన స్త్రీ-2 చిత్రానికి థియేటర్లలో ఆదరణ దక్కించుకుంటోంది. హిందీ బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్-2 సాధించిన వసూళ్ల కంటే కేవలం 12 కోట్లు మాత్రమే వెనుకబడి ఉంది. ఇదే జోరు కొనసాగితే కొద్ది రోజుల్లోనే ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టనుంది. ఈ చిత్రం త్వరలోనే అత్యధిక వసూళ్లు చేసిన ఆరో భారతీయ చిత్రంగా నిలవనుంది. మూడో వారాంతం నాటికి రూ.500 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ రాబడుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు.  

అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో  అపర్‌శక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు. ఈ వారంలోనూ బాలీవుడ్‌లో పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో స్త్రీ-2 ప్రభంజనం కొనసాగించే అవకాశముంది. ఆగస్ట్ 30న శుక్రవారం బీటౌన్‌లో బిగ్‌ స్టార్స్‌ చిత్రాలు ఏవీ రావడం లేదు. ఇది కూడా ఈ చిత్రానికి వసూళ్లుపరంగా కలిసి రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement