బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ మూవీ మరో మైలురాయిని దాటేసింది. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అంతే కాకుండా టాలీవుడ్ మూవీ బాహుబలి ది బిగినింగ్ దేశవ్యాప్తంగా సాధించిన నెట్ వసూళ్లను అధిగమించింది.
'స్త్రీ 2' రిలీజైన రెండువారాల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.424 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. గతంలో రాజమౌళి చిత్రం 'బాహుబలి: ది బిగినింగ్' దేశీయంగా రూ. 421 కోట్లు నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం కంటెంట్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని మళ్లీ థియేటర్‌లకు రప్పించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.
ఇదే జోరు కొనసాగితే మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేలా కనిపిస్తోంది స్త్రీ-2. బాలీవుడ్‌లో 'గదర్ 2' (రూ. 525.7 కోట్లు), 'పఠాన్' (రూ. 543.09 కోట్లు), 'యానిమల్' (రూ. 553.87 కోట్లు) లైఫ్ టైమ్ వసూళ్లను అధిగమించే లక్ష్యంతో దూసుకెళ్తోంది. మూడో వారాంతం నాటికి ఇండియాలో రూ. 500 కోట్ల నికర స్థాయిని అధిగమిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే షారూఖ్ ఖాన్ చిత్రం జవాన్ సాధించిన రూ.640 కోట్ల నికర వసూళ్లను అధిగమించడం స్త్రీ-2 చిత్రానికి సవాల్‌గా మారనుంది. బాక్సాఫీస్ వద్ద ప్రస్తుత జోరు చూస్తుంటే స్త్రీ 2'కి ఏదైనా సాధ్యమే అనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment