
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన చిత్రం స్త్రీ-2. గతంలో వచ్చిన చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.
అమర్ కౌశిక్ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో భారీగా వసూళ్లు రాబడుతోంది. ఇండియావ్యాప్తంగా రూ.342 కోట్లు రాబట్టగా.. వరల్డ్ వైడ్‌గా రూ.401 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్‌లో మొదటి వారంలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment