బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న మూవీ.. పది రోజుల్లోనే రూ.500 కోట్లు! | Shraddha Kapoor's Stree 2 Movie world wide box office collections on day 10 | Sakshi
Sakshi News home page

Shraddha Kapoor: స్త్రీ-2 దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. బద్దలవుతున్న రికార్డులు!

Published Sun, Aug 25 2024 4:09 PM | Last Updated on Sun, Aug 25 2024 4:14 PM

Shraddha Kapoor's Stree 2 Movie world wide box office collections on day 10

బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్‌ రావు జంటగా నటించిన హారర్‌-కామెడీ చిత్రం స్త్రీ-2. ఈ చిత్రానికి అమర్‌ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కించారు. 2018లో వచ్చిన స్త్రీ మూవీకి సీక్వెల్‌గా రూపొందించారు. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా రూ.426 కోట్లు రాబట్టింది. ఓవర్‌సీస్‌ వసూళ్లతో కలిపి ఐదొందల మార్కును దాటేసింది.

ఈ చిత్రం సక్సెస్‌ కావడం డైరెక్టర్ అమర్‌ కౌశిక్ ఆనందం వ్యక్తం చేశారు. స్త్రీ 2 కోసం దాదాపు రెండున్నరేళ్లు కష్టపడ్డామని తెలిపారు. కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదని తెలిపారు. షూటింగ్‌ మొదటి రోజు నుంచే స్త్రీ 2 కథతో పూర్తిగా నిమగ్నమై తెరకెక్కించామని అన్నారు. కాగా.. అన్యాయానికి గురైన ఓ స్త్రీ.. దెయ్యంగా మారి ఏం చేసిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదేవిధంగా వసూళ్లు కొనసాగితే త్వరలోనే ఈ మూవీ మరిన్ని పెద్ద చిత్రాల రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement