తొలిరోజు కలెక్షన్ల.. ‘గుడ్‌న్యూస్‌’ | Good Newwz Movie Box Office First Day Collection | Sakshi
Sakshi News home page

‘గుడ్‌న్యూస్‌’.. తొలిరోజు కలెక్షన్లు భేష్‌

Published Sat, Dec 28 2019 2:39 PM | Last Updated on Sat, Dec 28 2019 2:55 PM

Good Newwz Movie Box Office First Day Collection - Sakshi

ముంబై: అక్షయ్‌ కుమార్‌ తాజా సినిమా ‘గుడ్‌న్యూస్‌’ అంచనాలకు అనుగుణంగా కలెక్షన్లు రాబడుతోంది. డిసెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజు రూ.17.56 కోట్లు వసూలు చేసింది. వీకెండ్‌ కలెక్షన్లు డబుల్‌ ఉంటాయని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వినోదం ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. సమకాలిన సమస్యకు హాస్యం జోడించి చెప్పడంలో దర్శకుడు రాజ్‌ మెహతా సఫలమయ్యారు. ఈ సినిమా గురించి రివ్యూలు కూడా సానుకూలంగా రావడంతో మున్ముందు వసూళ్లు బాగానే ఉండే అవకాశముంది.

గతవారం విడుదలైన సల్మాన్‌ ఖాన్‌ తాజా చిత్రం ‘దబాంగ్‌ 3’  ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలకావడం ‘గుడ్‌న్యూస్‌’కు కలిసిరావొచ్చు. కేసరి, మిషన్‌ మంగళ్‌, హౌస్‌ఫుల్‌ 4 తర్వాత ఈ ఏడాది విడుదలైన అక్షయ్‌ కుమార్‌ నాలుగో సినిమా ఇది. ‘గుడ్‌న్యూస్‌’లో డబుల్‌ మీనింగ్‌ డైలాగులు లేకుండా క్లీన్‌ ఎంటర్‌టైన్‌గా తెరకెక్కించడంతో ఈ సినిమాకు ఆదరణ పెరుగుతోంది. ఈ సినిమాలో దిల్జిత్‌ దొసాంజ్‌, కరీనా కపూర్‌, కియారా అద్వానీ, ఆదిల్‌ హుస్సేన్‌, గుల్షన్‌ గ్రోవర్‌ ముఖ్యపాత్రలు పోషించారు. (చదవండి: ఎట్టకేలకు వంద కోట్లు దాటింది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement