
4 రోజుల్లో రూ.14 కోట్లు వసూలు
మణిరత్నం తాజా చిత్రం 'ఓ కాదల్ కన్మణి' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.
చెన్నై: మణిరత్నం తాజా చిత్రం 'ఓ కాదల్ కన్మణి' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లో రూ.14 కోట్లు వసూలు చేసింది. తెలుగులోకి 'ఓకే బంగారం' పేరుతో అనువాదమైన ఈ చిత్రం మల్టీప్లెక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోందని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు.
సహజీనం నేపథ్యంలో తనదైన శైలిలో మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా నటించారు. వరుస పరాజయాలతో వెనుకబడిన మణిరత్నంకు ఈ చిత్ర విజయం ఊరటనిచ్చింది. విదేశాల్లో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతోంది.