
సాక్షి, హైదరాబాద్: యంగ్ హీరో నాని తొలిసారిగా నిర్మించిన ‘అ!’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఫిబ్రవరి 16న విడుదలైన ఈ చిత్రం ఓపెనింగ్ వీకెండ్‌లోనే రూ. 9 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. ఓవర్‌సీస్‌లోనూ అంచనాలకు మించి వసూళ్లు వస్తున్నాయి. అమెరికాలో ఐదు రోజుల్లో రూ.4.13 కోట్లు సాధించినట్టు సినీ విమర్శకుడు, బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.
ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. డిఫరెంట్ కాన్పెప్ట్ తో ఇంట్రస్టింగ్ టేకింగ్‌తో తెరకెక్కించిన అ! సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యాడు. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీని అవసరాల, మురళీ శర్మ, ప్రగతి ముఖ్యపాత్రలు పోషించారు. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతం అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment