అక్షయ్ కుమార్.. బాలీవుడ్ మోస్ట్ బిజియెస్ట్ హీరోలో ఒక్కరు. ఏడాదికి కనీసం రెండు, మూడు సినిమాలు విడుదల చేస్తూ దూసుకెళ్తున్నాడు.అలాగని ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి మార్కెట్ దెబ్బ తీసుకోడు. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం, వెరైటీ గెటప్ కచ్చితంగా ఉంటుంది. అక్షయ్ సినిమా ప్లాప్ అయినా.. రూ. వంద కోట్ల వసూళ్లు ఎక్కడిపోవు. ఇక పాజిటివ్ టాక్ వచ్చిందంటే.. రెండు, మూడు వందల కోట్లు కొల్లగొట్టినట్టే. అందుకే నిర్మాతలు అక్షయ్‌తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అక్షయ్ కూడా షెడ్యూల్ ప్రకారం సినిమాలు కంప్లీట్ చేస్తుంటాడు. అయితే గత రెండేళ్లుగా కరోనా కారణంగా అక్షయ్ షెడ్యూల్ తారుమారు అయింది. చాలా సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి.
ఎక్కువ రోజులు వెయిట్ చేయలేక లక్ష్మీ బాంబ్ లాంటి సినిమాలను నేరుగా ఓటిటిలో విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే ఇప్పుడు సూర్యవంశీతో పాటు మరో మూడు సినిమాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే పరిస్థితులు అనుకూలించడం లేదు. ఈ నాలుగు సినిమాలు వేర్వేరు దశల్లో ఆగిపోయాయి. కొన్ని షూటింగ్ దశలోనే ఆగిపోగా.. మరికొన్ని సినిమాలు విడుదల వరకు వచ్చి ఆగిపోయాయి. ఈ క్రమంలో నిర్మాతలకు భారీ నష్టాలు వస్తున్నాయి. ముఖ్యంగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన సూర్యవంశీ 2020 మార్చ్ లోనే రావాల్సింది. కానీ ఇప్పటికీ రాలేదు.
ఇక గత రెండేళ్లు ఎలాగో పోయాయి.. నెక్ట్ ఇయర్ అయినా బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శించాలని భావిస్తున్నాడట అక్షయ్. అగిపోయిన వాటితో కలిపి మొత్తం 5 సినిమాలను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒక్కో సినిమాకు కనీసం 200 కోట్ల వసూళ్లు సాధించినా.. 1000 కోట్ల వసూళ్లు ఈజీగా సాధిస్తారని లెక్కలు వేస్తున్నారు సినీ పండితులు. మరి ఈ టార్గెట్‌ను అక్కీ రీచ్ అవుతాడో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment