’కబాలి’ని టొరంటోలో డౌన్‌లోడ్ చేయబోతే..!
రివ్యూలు సంగతి ఎలా ఉన్నా.. సినిమా అంతగా బాలేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా.. రజనీకాంత్ తాజా సినిమా ‘కబాలి’ అసాధారణ కలెక్షన్లతో దూసుకుపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘కబాలి’ సినిమా తొలిరోజే రూ. 250 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి ఉంటుందని చిత్రనిర్మాతలు ఓ ప్రకటనలో తెలుపడం సంచలనం రేపుతోంది. ‘కబాలి’ తొలిరోజు ఒక్క తమిళనాడులోనే వందకోట్లు వసూలుచేసిందని, తమిళనాడు బయట దేశమొత్తంగా రూ. 150 కోట్లు వసూలుచేసిందని నిర్మాతలు ప్రకటించారు. ఈ వసూళ్ల ప్రకటన ఇలా వుంటే.. మరోవైపు‘కబాలి’ శాటిలైట్ హక్కుల ద్వారా రూ. 200 కోట్లు సాధించవచ్చునని మరో కథనం చెప్పుకొచ్చింది.
ఈ కథనాల్లో నిజానిజాలను పక్కనబెడితే.. ప్రపంచవ్యాప్తంగా 12వేల థియేటర్లలో విడుదలైన ‘కబాలి’ సినిమా గత కలెక్షన్ల రికార్డులన్నింటినీ బద్దలుకొట్టి తొలిరోజు భారీగా వసూళ్లు రాబట్టడం ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘కబాలి’ కలెక్షన్లు లెజెండ్ రజనీ సత్తాను మరోసారి ప్రపంచానికి చాటాయని బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కితాబిచ్చారు. మరోవైపు రజనీ సినిమాపై ఎప్పటిలాగే జోక్స్, ఛలోక్తులు ఆన్‌లైన్‌లో వీరవిహారం చేస్తున్నాయి. ట్విట్టర్‌ను చక్కిలిగింతల్లో ముంచెత్తుతున్న ఆ క్రేజీ జోక్స్ మీకోసం..
’కబాలి సినిమాను డౌన్‌లోడ్ చేసేందుకు ప్రయత్నించాను. వెంటనే టోరంటో అన్‌ఇన్‌స్టాల్ అయిపోయింది. సిస్టం ఫార్మెట్ అయిపోయింది. వై-ఫై క్రాష్ అయింది. సమీపంలో ఉన్న ఎయిర్‌టెల్ టవర్ మాయమైంది’
Tried downloading Kabali. µTorrent uninstalled itself. System got formated. Wi-Fi router crashed. Nearby Airtel tower vanished.
— चार लोग (@WoCharLog) July 21, 2016
’మీ అక్రమంగా రజనీకాంత్ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేస్తే.. ఓ వైరస్ బయటకొచ్చి మీ చెంపఛెళ్లుమనిపిస్తుంది. మిమ్మల్ని వెంటనే పట్టుకెళ్లి రజనీ సినిమా నడుస్తున్న థియేటర్లో పడేస్తుంది’
‘అందరి సినిమాలు మొదట విడుదలై తర్వాత టోరంటోలో లీకవ్వుతాయి. కానీ రజనీ సినిమా టోరంటోలో లీకైన తర్వాతే షూటింగ్ మొదలవుతుంది’.