Kabali review
-
’కబాలి’ని టొరంటోలో డౌన్లోడ్ చేయబోతే..!
రివ్యూలు సంగతి ఎలా ఉన్నా.. సినిమా అంతగా బాలేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా.. రజనీకాంత్ తాజా సినిమా ‘కబాలి’ అసాధారణ కలెక్షన్లతో దూసుకుపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘కబాలి’ సినిమా తొలిరోజే రూ. 250 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి ఉంటుందని చిత్రనిర్మాతలు ఓ ప్రకటనలో తెలుపడం సంచలనం రేపుతోంది. ‘కబాలి’ తొలిరోజు ఒక్క తమిళనాడులోనే వందకోట్లు వసూలుచేసిందని, తమిళనాడు బయట దేశమొత్తంగా రూ. 150 కోట్లు వసూలుచేసిందని నిర్మాతలు ప్రకటించారు. ఈ వసూళ్ల ప్రకటన ఇలా వుంటే.. మరోవైపు‘కబాలి’ శాటిలైట్ హక్కుల ద్వారా రూ. 200 కోట్లు సాధించవచ్చునని మరో కథనం చెప్పుకొచ్చింది. ఈ కథనాల్లో నిజానిజాలను పక్కనబెడితే.. ప్రపంచవ్యాప్తంగా 12వేల థియేటర్లలో విడుదలైన ‘కబాలి’ సినిమా గత కలెక్షన్ల రికార్డులన్నింటినీ బద్దలుకొట్టి తొలిరోజు భారీగా వసూళ్లు రాబట్టడం ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘కబాలి’ కలెక్షన్లు లెజెండ్ రజనీ సత్తాను మరోసారి ప్రపంచానికి చాటాయని బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కితాబిచ్చారు. మరోవైపు రజనీ సినిమాపై ఎప్పటిలాగే జోక్స్, ఛలోక్తులు ఆన్లైన్లో వీరవిహారం చేస్తున్నాయి. ట్విట్టర్‌ను చక్కిలిగింతల్లో ముంచెత్తుతున్న ఆ క్రేజీ జోక్స్ మీకోసం.. ’కబాలి సినిమాను డౌన్లోడ్ చేసేందుకు ప్రయత్నించాను. వెంటనే టోరంటో అన్ఇన్స్టాల్ అయిపోయింది. సిస్టం ఫార్మెట్ అయిపోయింది. వై-ఫై క్రాష్ అయింది. సమీపంలో ఉన్న ఎయిర్టెల్ టవర్ మాయమైంది’ Tried downloading Kabali. µTorrent uninstalled itself. System got formated. Wi-Fi router crashed. Nearby Airtel tower vanished. — चार लोग (@WoCharLog) July 21, 2016 ’మీ అక్రమంగా రజనీకాంత్ చిత్రాన్ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేస్తే.. ఓ వైరస్ బయటకొచ్చి మీ చెంపఛెళ్లుమనిపిస్తుంది. మిమ్మల్ని వెంటనే పట్టుకెళ్లి రజనీ సినిమా నడుస్తున్న థియేటర్లో పడేస్తుంది’ ‘అందరి సినిమాలు మొదట విడుదలై తర్వాత టోరంటోలో లీకవ్వుతాయి. కానీ రజనీ సినిమా టోరంటోలో లీకైన తర్వాతే షూటింగ్ మొదలవుతుంది’. -
అమెరికాలో రజనీకి స్టాండింగ్ ఒవేషన్!
అమెరికాలో బుధవారం సాయంత్రం రజనీకాంత్ నటించిన ‘కబాలి’ సినిమాను స్పెషల్ స్ర్కీనింగ్ ఏర్పాటుచేశారు. ఈ షోకు హాజరైన అభిమానులు ఊహించని అతిథిని చూసి ఆశ్చర్యపోయారు. ‘కబాలి’ సినిమాకు వచ్చిన అభిమానులకు ఏకంగా రియల్ ‘కబాలి’ రజనీకాంత్ దర్శనమివ్వడంతో సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయారు. సాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేసిన ఈ షోకు రజనీ ప్రత్యేక అతిథిగా హాజరై.. అభిమానుల్ని అలరించారు. భారత్‌లోనే కాదు అమెరికాలోనూ ‘కబాలి’ సినిమా తొలి మూడు రోజుల టికెట్లు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి ప్రస్తుతం ‘కబాలి’ సినిమా సానుకూల స్పందన వ్యక్తమవుతున్నది. ‘కబాలి’ని చూసిన చాలామంది అమెరికన్ ఇండియన్లు అభిమానులకు ఈ సినిమా పండుగేనని అంటున్నారు. ‘కబాలి తలైవా అభిమానులకు పైసా వసూల్ సినిమా. అభిమానులు మెస్మరైజ్ అయ్యే సీన్లు ఎన్నో ఉన్నాయి. పలుసార్లు థియేటర్ హర్షధ్వానాలతో దద్దరిల్లింది’ అని ఇండస్ట్రి ఇన్సైడర్ రమేశ్ అమెరికాలో వస్తున్న రెస్పాన్స్ మీద స్పందిస్తూ ట్వీట్ చేశారు. #Kabali U.S distributor @CineGalaxyUSA with @superstarrajini after special show pic.twitter.com/gmdjRagp3b — Studio Flicks (@StudioFlicks) July 21, 2016 -
’కబాలి’ రివ్యూ అప్పుడే వచ్చేసింది!
‘కబాలి’ సినిమాపై ఇప్పటికే అంచానాలు ఆకాశాన్నంటేశాయి. మరికొద్ది గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా గురించి ఎక్కడ చూసినా హాట్ హాట్ చర్చ కొనసాగుతోంది. ‘కబాలి’ ఫీవర్ అభిమానుల్ని ఊపేస్తోంది. అమెరికాలో ‘కబాలి’ సినిమా ప్రివ్యూ గురువారం ఉదయమే విడుదలైంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్లో ‘కబాలి’ సినిమాపై తన రివ్యూను ఇచ్చాడు. బాలాజీ శ్రీనివాసన్ పేరిట ఆయన పెట్టిన రివ్యూ కొన్ని గంటల్లోనే వైరల్ గా మారిపోయింది. ఏకంగా 30వేల మంది ఆయన పేరును ఫేస్బుక్లో సెర్చ్ చేశారు. అయితే, కొన్ని గంటలకే ఆయన తన రివ్యూను తొలగించారు. అయినప్పటికీ ఆయన రివ్యూ పలుచోట్ల షేర్ అయింది. ఇంతకూ ఆయన ఏం రాశారంటే.. బే ఏరియా సినీ పరిశ్రమ స్నేహితులకు కృతజ్ఞతలు.. ‘కబాలి’ సినిమా ప్రివ్యూను నేను చూశాను. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళ్లాను. మిశ్రమ భావాలతో బయటకు వచ్చాను. రజనీ అభిమానులకు ఇది కచ్చితంగా పైసా వసూల్ సినిమానే. వయస్సు మీదపడిన సూపర్ స్టార్ ప్రదర్శించే దూకుడును చూసి ఇతరులూ ఛలోక్తులతో ఆనందించవచ్చు. కథ విషయానికొస్తే.. మలేషియా నేపథ్యంగా కథ నడుస్తుంది. అక్కడ అరాచకాలు ఎదుర్కొంటున్న తమిళులు తమను ఆదుకునే వాడికోసం ఎదురుచూస్తూ ఉంటారు. జాతి వివక్షను ఎదిరించి కొంతకాలం జైలు శిక్ష అనుభవించిన సూపర్ స్టార్ నెల్సన్ మండేలాలాగా అక్కడికి వస్తాడు. కొంతకాలం (బాషాలో ఆటోడ్రైవర్ లా) సామాన్యుడిలాగే జీవిస్తాడు. కానీ పరిస్థితుల ప్రభావంతో శత్రువుల నుంచి తన కూతురిని కాపాడుకునేందుకు రజనీ గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు. అలా మలేషియాలోని తమిళులు, దళితుల నాయకుడిగా మారి వారి జీవితాల్లో ఎంతో గణనీయమైన మార్పు తీసుకొస్తాడు. రజనీ అభిమానిని ఈ సినిమా మెస్మరైజ్ చేస్తుంది. స్లో మోషన్ వాక్స్, స్టైలిష్ పోజులు, క్రిస్పీ డైలాగులు సినిమా అంతటా ఉండటం అభిమానిని సంతోషపెడుతుంది. రజనీ చాలా పొందిక తన మ్యానరిజమ్స్ ప్రదర్శించిన ప్రతిసారి థియేటర్ హర్షధ్వానాల్లో మునిగితేలుతుంది. సినిమాలో కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇందులో రజనీ యువకుడిగా కనిపించి.. ఒకప్పటి రజనీని గుర్తుకుతెస్తాడు. రజనీకి ఉన్న లార్జర్ దన్ లైఫ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని దర్శకుడు పా రంజిత్ సినిమాను డీల్ చేశాడు. ఇంకా చెప్పాలంటే చాలా సినిమాల్లో రజనీ చేసిన అద్భుతాలే మళ్లీ ఇందులో కనిపించినట్టు అనిపిస్తుంది. మామూలు సినీ వీక్షకుడికి మాత్రం ఈ సీన్లు అసహజంగా, బోర్ కొట్టించేవిగా అనిపించవచ్చు. వయస్సు మీద పడిన రజనీ ఫ్లాష్ బ్యాక్ సీన్లలో 30 ఏళ్ల యువకుడిగా కనిపించడం కూడా కొద్దిగా ఎబ్బెట్టుగా తోచవచ్చు. మొత్తానికి సినిమాపరంగా చూస్తే కొంచెం నిడివి పెరిగినట్టు అనిపించినా రజనీ మళ్లీ తనదైన నటన చూపించాడు. మలేషియాలోని తమిళుల అవస్థ పట్ల పా రంజిత్ ఇంతకంటే మంచి సినిమా తీయవచ్చు. రంజిత్ దళిత రాజకీయాలు కూడా సినిమాలో బ్యాక్ సీట్ అయ్యాయి. ఈ సినిమా రజనీకి కమర్షియల్ వెహికిల్ గా మారిందని చెప్పవచ్చు. (ఇది ఫేస్బుక్లో బాలాజీ శ్రీనివాసన్ అనే వ్యక్తి పెట్టిన రివ్యూ మాత్రమే)