బాలీవుడ్ ను మళ్లీ చిత్తుచేసిన హాలీవుడ్! | Hollywood beats Bollywood, Raman Raghav earns 1cr, Independence Day 4.5cr | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ ను మళ్లీ చిత్తుచేసిన హాలీవుడ్!

Published Sat, Jun 25 2016 7:34 PM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

బాలీవుడ్ ను మళ్లీ చిత్తుచేసిన హాలీవుడ్!

బాలీవుడ్ ను మళ్లీ చిత్తుచేసిన హాలీవుడ్!

అనురాగ్ కశ్యప్ తీసిన తాజా సినిమా ‘రమణ్ రాఘవ్ 2.0’. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీసు వద్ద నిలకడగా కలెక్షన్లు సాధిస్తోంది. అయినా కలెక్షన్ల విషయంలో ‘రమణ్ రాఘవ్’ను చిత్తుచేసింది ఓ హాలీవుడ్ సినిమా. తొలిరోజు ‘రమణ్‌ రాఘవ్’ కేవలం రూ. 1.10 కోట్ల వసూళ్లు రాబడితే.. జెఫ్ గోల్డ్‌బ్లమ్ డిజాస్టర్ మూవీ ‘ఇండింపెండెన్స్ డే: రిసర్జెన్స్’ ఏకంగా రూ. 4.5 కోట్లు సాధించి అబ్బురపరిచింది.

‘రమణ్ రాఘవ్’ కేవలం రూ. 3.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. చిన్న సినిమా అయినప్పటికీ, తక్కువ థియేటర్లలో విడుదలైనా దర్శకుడు  అనురాగ్ కశ్యప్‌ కావడంతో ఈ సినిమాకు నిలకడగా కలెక్షన్లు వస్తున్నాయి. అయినా ఈ సినిమా హాలీవుడ్ చిత్రం ‘ఇండింపెండెన్స్ డే: రిసర్జెన్స్’ కలెక్షన్ల దారిదాపులో కూడా లేకపోవడం గమనార్హం. గత కొన్నాళ్లుగా భారత్‌లోనూ హాలీవుడ్ సినిమాలు దీటుగా కలెక్షన్లు రాబడుతున్నాయి. ‘జంగిల్‌బుక్’ లాంటి చిత్రాలు బాలీవుడ్ సినిమాలకు మించి భారత్‌లో వసూళ్ల కుంభవృష్టి సృష్టించాయి. అదేక్రమంలో దేశి సినిమా ‘రమణ్ రాఘవన్’ ఢీకొట్టి ‘ఇండింపెండెన్స్ డే: రిసర్జెన్స్’ కలెక్షన్లు రాబడుతుండటం గమనార్హం. మరోవైపు షాహిద్ కపూర్ తాజా సినిమా ‘ఉడ్తా పంజాబ్’ బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లు రాబడుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement