
‘హిచ్కి’లో రాణీముఖర్జీ
న్యూ ఢిల్లీ : బాలీవుడ్ ‘బ్లాక్’ బ్యూటీ రాణీముఖర్జీ కాస్త విరామం తర్వాత నటించిన చిత్రం ‘హిచ్కి’. క్రిటిక్స్‌ను సైతం మెప్పించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను మాత్రం మెప్పించలేకపోయింది. ఈ ఐదు రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.20.10 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది.
దేశవ్యాప్తంగా హిచ్కి.. 961 థియేటర్లలో విడుదలైంది. శనివారం రూ. 5.35 కోట్ల వసూళ్లు సాధించగా ఆదివారం రూ. 6.70 కోట్ కలెక్షన్లు రాబట్టింది. వారాంతాల్లో తప్ప మిగతా రోజుల్లో సినిమా వసూళ్లు సుమారుగా రూ. 3.30 కోట్లు మాత్రమే. బ్రాడ్ కోహెన్ పుస్తకం ‘ఫ్రంట్ ఆఫ్ ద క్లాస్’ ఆధారంగా నిర్మించిన ఈ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ పి.మల్హోత్ర తెరకెక్కించారు.
ఈ చిత్రంలో రాణీ నైనా మథుర్ అనే పాత్రలో నటించింది. నరాలకు సంబంధించిన వ్యాధి టౌరోట్ సిండ్రోమ్‌తో బాధపడే మహిత పాత్రలో ఆమె కనిపించింది. మాట్లాడేటప్పుడు మధ్యలో అవరోధాలు ఏర్పడటం.. విచిత్రమైన శబ్ధాలు చేయటం ఈ వ్యాధి లక్షణం. సమాజంలో ఉన్న అసమానతలు మన నిత్య జీవితంలో ఎలా భాగమయ్యాయనే అంశాన్ని కూడా ఈ చిత్రంలో చూపించారు. బాలీవుడ్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ఆమీర్‌ఖాన్‌తోపాటు పలువురు సెలబ్రిటీలు హిచ్కిపై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు కూడా. ‘మర్దాని’ (2014) చిత్రం తర్వాత రాణీ ‘హిచ్కి’తో రీఎంట్రీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment