నాని సినిమాకు భారీ కలెక్షన్లు | Ninnu Kori film crosses Rs 20 crore mark in Two Days | Sakshi
Sakshi News home page

నాని సినిమాకు భారీ కలెక్షన్లు

Published Mon, Jul 10 2017 11:07 AM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM

నాని సినిమాకు భారీ కలెక్షన్లు

నాని సినిమాకు భారీ కలెక్షన్లు

హైదరాబాద్‌: యంగ్‌ హీరో నాని నటించిన 'నిన్ను కోరి' సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. రెండు రోజుల్లో రూ. 20 కోట్ల మార్క్‌ను దాటింది. జూలై 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజున రూ.10.6 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు సాధించింది. రెండో శనివారం రూ. 9.60 కోట్లు గ్రాస్‌ వసూళ్లు సొంతం చేసుకుంది. మొత్తం రెండు రోజుల్లో మొత్తం రూ. 20.20 కోట్లు గ్రాస్‌ సాధించిందని ట్రేడ్‌ విశ్లేషకులు వెల్లడించారు.

అమెరికాలో 'నిన్ను కోరి' సినిమా వసూళ్లు సూపర్‌గా ఉన్నాయని బిజినెస్‌ ఎనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్ తెలిపారు. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా రూ.4.24 కోట్లు కలెక్షన్లు సాధించిందని ఆయన వెల్లడించారు. ఆదివారం వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా చేశారు. మొదటి వారంతంలోనే రూ. 30 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రూ. 18 కోట్ల పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లో లాభాలు గడించడం విశేషం. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, నివేదా థామస్, మురళీ శర్మ ప్రధానపాత్రల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement