బాక్స్ ఆఫీస్.. ఆన్‌లైన్‌లో..! | Box Office in online | Sakshi
Sakshi News home page

బాక్స్ ఆఫీస్.. ఆన్‌లైన్‌లో..!

Published Sun, Aug 24 2014 2:06 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

బాక్స్ ఆఫీస్.. ఆన్‌లైన్‌లో..! - Sakshi

బాక్స్ ఆఫీస్.. ఆన్‌లైన్‌లో..!

 ఆదివారం పూట..ఇంటిల్లిపాదీ సరదాగా సినిమా కెళ్తే థియేటర్ వద్ద చాంతాడంత
 ‘క్యూ’.. దాన్ని చూడగానే..ఒకటే అసహనం..ఎలా? ఈ క్యూలో నిలబడి టిక్కెట్లు
 తీయలేం.. అలాగేని వెనక్కి వెళ్లలేం.. ఎలాగైనా టిక్కెట్టు సంపాదించాలనుకుంటే..
 జేబుకు ‘బ్లాక్’ రూపంలో చిల్లు.. ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టేందుకు.. సినీ వర్గాలు

 అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ.. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టాయి. ఈ-టిక్కెట్‌ను సులువుగా సంపాదించి..నచ్చినసినిమాను.. మెచ్చిన సీట్లలో కూర్చుని ఆస్వాదించవచ్చు. అలాగే.. ఏ థియేటర్‌లోనైనా.. నచ్చిన  సినిమా చూసే అవకాశమూ ఉంది. ఇక మరెందుకు ఆలస్యం.. ఇంట్లో ఇంటర్నెట్ ముందు కూర్చుని.. నచ్చిన సినిమాను చూసేయండి మరి!
 
 శ్రీకాకుళం సిటీ: ‘క్యూ’ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు థియేటర్ల యాజమాన్యాలు కొన్నాళ్ల క్రితం అడ్వాన్స్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాయి.  ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కొన్ని ఇంటర్నెట్ వెబ్‌సైట్ల సాయంతో ఆన్‌లైన్ టిక్కెటింగ్‌కు ద్వారాలు తెరిచారు. ఇ-టిక్కెట్‌ను  సంపాదించి.. నచ్చిన సినిమాను న చ్చిన థియేటర్‌లో  ఎంచక్కా చూడొచ్చు.
 
 అంతా ఆన్‌లైన్‌లోనే
 సినిమా టిక్కెట్ల బుకింగ్ ఆన్‌లైన్‌లో జరిగిపోతుండడంతో బిజీబిజీగా జీవితాలు గడుపుతున్న వారితో పాటు..మధ్య తరగతి, సామాన్యులకు కూడా కోరుకున్న సీట్లలో సినిమా చూసే అవకాశం లభిస్తోంది.  ఇంట్లో కూర్చునే ఎంచక్కా నచ్చిన సినిమా టిక్కెట్టు డిసైడ్ చెయ్యొచ్చు. ఆన్‌లైన్లో  సినిమా టిక్కెట్లు పొందేందుకు పలు రకాల వెబ్‌సైట్లు అందుబాటులోకి వచ్చాయి.
 
 ప్రస్తుతానికి జిల్లా కేంద్రంలో
  డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టికెట్ దాదా.కాం
  డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.మస్తీటిక్కెట్స్.ఇన్
  బుక్‌ఫిల్మ్‌టిక్కెట్స్.కాం (ఇంగ్లిష్‌లో ) అనే మూడు సైట్లు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి.

 జిల్లా కేంద్రంలో కూడా ఒక్కొక్కటిగా సినిమా థియేటర్లు ఇదే బాట పడుతున్నాయి. గత ఏడాది క్రితం ప్రారంభమైన ఈవిధానం ఇప్పుడు సుమారు 7 థియేటర్లలో అమలవుతోంది. ఇదే క్రమంలో రాజాం, పలాస వంటి నగరాల్లో కూడా నిర్వాహకులు ఇదే విధానం అమలుపై రంగం సిధ్దం చేస్తున్నారు.
 
 క్లిక్-2 : తర్వాత వెంటనే ఈపేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో మనం ఎంచుకున్న సినిమా ఏ థియేటర్లలో ప్రదర్శించబడుతుందో కన్పిస్తుంది. అంతేగాక ఆటలు (షోస్) ప్రదర్శితమయ్యే సమయాలు కూడా ఉంటాయి. మన వీలును బట్టి ఏ ఆటకు వెళ్లాలో ఎంపిక చేసుకోవచ్చు. ఇది పూర్తయిన తర్వాత ‘ బుక్ నౌ ’ అనే చోట క్లిక్ చేయాలి.
 
 క్లిక్-1 : కంప్యూటర్ ముందు కూర్చొని ఇంటర్నెట్‌లో  టైప్‌చేయగానే  ఈసైట్ల హోం పేజీ ఓపెన్ అవుతుంది. ఈపేజీ మీద ఇ- టిక్కెట్లు అందుబాటులో ఉన్న సినిమాల జాబితా డిస్‌ప్లే అవుతుంది. ఎడమ వైపున ఉన్న బాక్సులో మీకు ఏ నగరంలో..ఏ సినిమా..ఏ రోజుకు..ఏ షోకు టిక్కెట్లు కావాలో టైప్ చేసి ‘సెర్చ్’లో ఎంటర్ చేయాలి.
 
 క్లిక్-3 : ‘బుక్ నౌ’ వద్ద క్లిక్ చేయగానే ఇలా సీట్ల వివరాలున్న పేజీ వస్తుంది. దీనిలో పసుపు రంగులో ఉన్న సీట్లు మాత్రమే ఇ-బుకింగ్‌కి అనుమతించినవి. వీటిలో నచ్చిన సీట్‌ను బుక్ ఏసుకోవచ్చు. ఆ సీటును ఎంపిక చేసుకోగానే అది ఆకుపచ్చ రంగులోకి తర్వాత ఎరుపు రంగులోకి మారిపోతాయి. ఇలా ఎన్ని సీట్లు కావాలంటే అన్నీ ఒకేసారి రిజర్వ్ చేసుకుని ‘ కంటిన్యూ’ వద్ద క్లిక్ చేయాలి.
 
 క్లిక్-4 : తర్వాత ఈపేజీ ఓపెన్ అయి మనకు సీట్ రిజర్వ్ అయినట్లుగా చూపిస్తుంది. దీనికి సంబంధించిన సొమ్ము ఎంత చెల్లించాలో కూడా అక్కడే చూపిస్తుంది...
 
 వివరాలు ముందే ఇవ్వాలి..
 పైన పేర్కొన్న చర్యలన్నీ చేసే ముందు ఈ వెబ్‌సైట్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే వారు.. వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. అంతేగాక మన క్రెడిట్, డెబిట్ కార్డు నంబరును కూడా ఇవ్వాలి. దీంతో టిక్కెట్ సొమ్మును మీ బ్యాంకు అక్కౌంట్ నుంచి నేరుగా థియేటర్ అక్కౌంట్‌లోకి బదిలీ అవుతుంది. టిక్కెట్‌కు అదనంగా కొంత సర్వీసు చార్జి చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి సర్వీసు వివరాలు సెల్‌ఫోన్‌కు మెసేజ్ రూపంలో వస్తుంటాయి.  ‘టిక్కెట్ దాదా డాట్ కాం’ ద్వారా ప్రస్తుతం శ్రీకాకుళంలో ఎస్వీసీ ( రామలక్ష్మణ), కిన్నెర, కీర్తిక, కీర్తన, సూర్యామహల్, సన్ మాక్స్ (చంద్రమహల్) థియేటర్లలో ప్రదర్శితమయ్యే సినిమాలకు ఇ-టిక్కెట్స్‌ను పొందవచ్చు. అలాగే త్వరలోనే సరస్వతి, రామకృష్ణ, మారుతి (ఆంజనేయ) థియేటర్లతో పాటు పలాస, రాజాంలలో పలు థియేటర్లలో కూడా ఈ సౌకర్యం రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement