
‘సింగం రిటర్న్స్’పై శిల్పాశెట్టి ప్రశంసలు
మూవీ
విడుదలైన రెండు రోజుల్లోనే బాక్సాఫీసు వద్ద రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ‘సింగం రిటర్న్స్’పై శిల్పాశెట్టి ప్రశంసలు కురిపిస్తోంది. ‘నిన్న రాత్రే ‘సింగం రిటర్న్స్ చూశాను. పోలీసులపై గౌరవం పెంచేలా తీసిన రోహిత్ శెట్టి బృందానికి అభినందనలు’ అంటూ ‘ట్విట్టర్’లో వ్యాఖ్యానించింది.
‘జునోనియత్’లో యామీ గౌతమ్
ఇటీవలే ‘హేట్‌స్టోరీ-2’ రూపొందించిన వివేక్ అగ్నిహోత్రి తాజాగా ‘జునోనియత్’ పేరిట మ్యూజికల్ లవ్‌స్టోరీని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో యామీ గౌతమ్ హీరోయిన్ చాన్స్ కొట్టేసింది. ఆమె సరసన హీరోగా పులకిత్ సమ్రాట్ నటించనున్నాడు.
బాలీవుడ్‌లో పాడాలనుకుంటున్న టేలర్ స్విఫ్ట్
అమెరికన్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ అవకాశం దొరికితే బాలీవుడ్ చిత్రంలో పాడాలనుకుంటోంది. ఏడుసార్లు గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఈ సింగింగ్ స్టార్ బాలీవుడ్ పాటలు, డ్యాన్సులు తనకు చాలా ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ముఖ్యంగా ఎ.ఆర్.రెహమాన్ సంగీతం నేరుగా మనసును తాకుతుందని వ్యాఖ్యానించింది.