'బాక్సాఫీసు కలెక్షన్లు వణుకు పుట్టిస్తాయి'
ముంబై: సినీ ఇండస్ట్రీ ఏదైనా సరే తమ మూవీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తే షూటింగ్ కోసం పడ్డ పాట్లను క్షణాల్లోనే మరిచిపోతారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీలు వందల కోట్ల కలెక్షన్లు వసూలు చేయడం శుభపరిణామమే అయినా.. కొన్ని సందర్భాల్లో నటీనటులకు వణుకు పుడుదందని హీరో ఇమ్రాన్ హష్మీ అంటున్నాడు. మర్డర్, గ్యాంగ్స్టర్, 'వన్స్ ఆప్ ఆన్ ఏ టైమ్ ఇన్ ముంబై' సినిమాలు భారీగా వ్యాపారాన్ని అందించినందుకు ఆ సమయాల్లో చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పాడు.
షాంగై, ఎక్ థి దాయన్ లాంటి చిన్న మూవీలు చేసినప్పుడు చాలా థ్రిల్ అవ్వాల్సి వస్తుందన్నాడు. కొన్నిసార్లు మాత్రమే సినిమాలకు భారీ కలెక్షన్లు వస్తాయని, మరికొన్ని సందర్బాల్లో మూవీ విడుదలంటే చాలు వణుకు పుడుతుందని చెప్పుకొచ్చాడు. ఇమ్రాన్ హష్మీ నటించిన మూవీలు హమారి అధురి కహానీ, మిస్టర్ ఎక్స్, రాజా నట్వర్ లాల్ బాక్సాఫీసు వద్ద బోల్తా పడి నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ప్రయోగాలకు సిద్దమైనప్పుడు ఎన్నో కథనాలు ప్రచారంలోకి వస్తాయని అప్పుడు చాలా టెన్షన్ ఉంటుందన్నాడు. రెగ్యూలర్ కమర్షియల్ ఫార్మాట్లో మూవీలు చేసి కంఫర్ట్ జోన్ లో ఉండాలని భావిస్తారని చెప్పాడు. ప్రయోగాలు చేయాలంటేనే హీరో, హీరోయిన్లు భయపడాల్సి వస్తుందని అభిప్రాయపడ్డాడు.