నడిరోడ్డుపై హీరోయిన్ కు ప్రపోజ్..! | After Emraan Hashmi, Ankit Tiwari also proposes Sonal Chauhan | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై హీరోయిన్ కు ప్రపోజ్..!

Published Fri, May 27 2016 9:31 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

నడిరోడ్డుపై హీరోయిన్ కు ప్రపోజ్..! - Sakshi

నడిరోడ్డుపై హీరోయిన్ కు ప్రపోజ్..!

సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట బాలీవుడ్ తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్. జన్నత్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ కు మళ్లీ ఆ రోజులు గుర్తుకువచ్చేలా ఉన్నాయి. నడిరోడ్డుపై కారు ఆపి సోనాల్ కు ఓ వ్యక్తి లవ్ ప్రపోజ్ చేశాడు. హీరోయిన్ ను రోడ్డుపై ఆపి మరీ ప్రపోజ్ ఎంటని కంగారు పడకండి. సింగర్ అంకిత్ తివారీ, సోనాల్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ ఎడిషన్ 'బాడ్తమీజ్'. అంకిత్ హీరోయిన్ ను పిచ్చిగా ప్రేమిస్తాడు. దీంతో ఆమెకు ప్రపోజ్ చేయాలని డిసైడ్ అవుతాడు. రోడ్డుపై కారు ఆపి నోనాల్ కు ప్రపోజ్ చేస్తాడు.

ఇదే తీరుగా కొన్నేళ్ల కిందట జన్నత్ లో ఇమ్రాన్ హష్మీ కూడా ఆమెకు ప్రపోజ్ చేసిన సీన్ అభిమానులకు ఇంకా గుర్తుంటుంది. దర్శకుడు సిద్ధాంత్ సచ్ దేవ్ ఈ సీన్ చూసి బాగా వచ్చిందని వారిని మెచ్చుకున్నాడట. యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. వీడియోను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ప్రస్తుతం 'జాక్ అండ్ జిల్' లో నటిస్తోంది. అందులోనూ ప్రపోజ్ చేసే సీన్లు ఉన్నాయని చెప్పుకొచ్చింది. టాలీవుడ్ లోనూ లెజెండ్, డిక్టేటర్ మూవీలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement