17ఏళ్లుగా ముద్దులు పెడుతూ.. అలసిపోయా! | Emraan Hashmi Tired Of By Serial Kissing Scenes | Sakshi

Jan 11 2019 10:59 AM | Updated on Apr 3 2019 6:34 PM

Emraan Hashmi Tired Of By Serial Kissing Scenes - Sakshi

యుద్దంలో పోరాడే యోధులుంటారు కదా.. అలాగే ముద్దుల యుద్దంలో పోటీలేని ఓ వీరుడున్నాడు. ముద్దులుపెట్టడంలో అతన్ని మించినోడు లేడు. బాలీవుడ్‌లో సీరియల్‌ కిస్సర్‌గా ఫేమస్‌ అయ్యాడు ఇమ్రాన్‌ హష్మీ. ఆయన తీసిన ప్రతి సినిమాలో దాదాపు 20 లిప్‌లాక్‌లు ఉంటాయి. దీంతో బాలీవుడ్‌లో మోస్ట్‌ రొమాంటిక్‌ హీరోగా అమ్మాయిల గుండెల్లో స్థానం సంపాదించాడు. 

అయితే ఇమ్రాన్‌ ప్రస్తుతం చీట్‌ఇండియా అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు, ఈ చిత్రప్రమోషన్‌లో పాల్గొన్న ఇమ్రాన్‌.. పదిహేడేళ్లుగా ప్రతిసినిమాలో దాదాపు ఇరవై ముద్దులు పెడుతూ అలసిపోయానని చెప్పుకొచ్చాడు. ఇకపై తాను ఇలాంటి సీన్స్‌లో నటించకూడదని అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. విభిన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. తాను చేస్తున్న ప్రస్తుత చిత్రం ‘చీట్‌ ఇండియా’.. భారతీయ విద్యా విధానంలో ఉన్న మాఫియా నేపథ్యంలో సాగుతుందని తెలిపాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement