ఒకరితో పోల్చితే నాకు చిరాకు: హీరో | Emraan Hashmi fire on comparisons of actors | Sakshi
Sakshi News home page

ఒకరితో పోల్చితే నాకు చిరాకు: హీరో

Published Sat, Sep 3 2016 1:49 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఒకరితో పోల్చితే నాకు చిరాకు: హీరో - Sakshi

ఒకరితో పోల్చితే నాకు చిరాకు: హీరో

ప్రతి ఒక్క హీరోకు వారికంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ చెప్పాడు. ఏ నటుడినైనా చూసి ఇతడు మన పక్కింటి అబ్బాయిలా ఉన్నాడంటూ, ఇతడు పలానా హీరోలా చేస్తున్నాడంటూ లేని పోని పోలికలు పెట్టకూడదని పేర్కొన్నాడు. అసలు విషయం ఏంటంటే.. గతంలో ఇమ్రాన్ హష్మీ నటించిన సినిమాలలో ముద్దు సీన్లు కచ్చితంగా ఉండేవి. ప్రస్తుతం రణ్వీర్ సింగ్ ఇలాంటి సీన్లు బాగా పండిస్తున్నాడని, అందుకే అతడ్ని మరో ఇమ్రాన్ హష్మీ అంటూ కితాబిస్తున్నారు. ఈ విషయంపై హష్మీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ప్రతి ఒక్కరికి వారికంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, ఏ వ్యక్తిని మరో వ్యక్తితో పోల్చి చూడరాదంటూ హితవు పలికాడు. ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం 'రాజ్ రీబూట్'. విక్రమ్ భట్ ఈ మూవీ కథ చెప్పినప్పుడు తాను ఎలా ఎగ్జయిట్ అయ్యాయని, ఓ ప్రేక్షకునిలా మారి సినిమా చూడాలని ఉందన్నాడు. వాస్తవానికి తనకు హర్రర్ మూవీలలో నటించడం చాలా ఇష్టమన్న హష్మీ.. తన తొలి చిత్రం 'ఫుట్ పాత్' నుంచి ఇప్పటివరకూ చాలా నేర్చుకున్నానని తెలిపాడు. సెప్టెంబర్ 16న ఈ మూవీ విడుదల కానున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement