వసూళ్లలో దుమ్మురేపుతున్న ’జాలీ’ | Jolly LLB 2 box office collections | Sakshi
Sakshi News home page

వసూళ్లలో దుమ్మురేపుతున్న ’జాలీ’

Published Sun, Feb 12 2017 9:50 AM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

వసూళ్లలో దుమ్మురేపుతున్న ’జాలీ’

వసూళ్లలో దుమ్మురేపుతున్న ’జాలీ’

అక్షయ్‌కుమార్‌ న్యాయవాదిగా తెరకెక్కిన ’జాలీ ఎల్‌ఎల్‌బీ-2’  సినిమా బాక్సాఫీస్‌ వద్ద శుభారంభాన్ని ఇచ్చింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్‌ మౌత్‌టాక్‌ రావడంతో అక్షయ్‌ ఖాతాలో మరో హిట్టు ఖాయమని వినిపిస్తోంది. కోర్టుగది డ్రామా నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజు రూ. 13.20 కోట్లు వసూలుచేసింది. మంచి ప్రారంభ వసూళ్లు సాధించిన ’జాలీ ఎల్‌ఎల్‌బీ-2’.. రానున్న శని, ఆదివారాల్లో మరింత మెరుగైన కలెక్షన్లు సాధించవచ్చునని సినీ పండితులు భావిస్తున్నారు. చక్కని ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అన్నిచోట్ల మంచి రెస్పాన్స్‌ వస్తున్నదని, గుడ్‌ రిపోర్ట్స్‌ వస్తుండటంతో మున్ముందు భారీ వసూళ్లు సాధించే అవకాశముందని బాలీవుడ్‌ ట్రెడ్‌ కోమల్‌ నహతా ట్వీట్‌చేశారు. అక్షయ్‌కుమార్‌, అన్నుకపూర్‌, సౌరబ్‌ శుక్లా నటన అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు.

2013లో వచ్చిన ’జాలీ ఎల్‌ఎల్‌బీ’ కి ఇది సీక్వెల్‌. మొదటి సినిమాలో అర్షద్‌ వార్సీ, బొమన్‌ ఇరానీ పోషించిన పాత్రలను ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌, అన్ను కపూర్‌ పోషించారు. వారి పాత్రలకు మంచి స్పందన వస్తున్నది. సినీ విమర్శకులు, సినీ అభిమానులు కూడా ఈ సినిమాపై సానుకూల రివ్యూలు ఇస్తున్నారు. వాస్తవికతకు దగ్గరగా కోర్టుగది డ్రామాను, పోలీసు, న్యాయవ్యవస్థలోని అవినీతి అంశాలను స్పృశిస్తూ సాగిన ఈ సినిమా.. అక్షయ్‌కుమార్‌ పంచ్‌ డైలాగులతో చక్కని ఎంటర్‌టైనింగ్‌గా ఉందని చెప్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement