మరో రీమేక్లో పవన్..! | Pawan kalyan in Jolly LLB 2 remake | Sakshi
Sakshi News home page

మరో రీమేక్లో పవన్..!

Published Sun, May 14 2017 12:52 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

మరో రీమేక్లో పవన్..! - Sakshi

మరో రీమేక్లో పవన్..!

టాలీవుడ్లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్లో ఎక్కువగా రీమేక్ సినిమాలతోనే సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్, ఆ సినిమా తరువాత మరోసారి రీమేక్ సినిమాలో నటించేందుకు అంగీకరించాడన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన జాలీ ఎల్ఎల్బి 2 సినిమాను పవన్ తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట.

గతంలో అక్షయ్ కుమార్ నటించిన ఓ మైగాడ్ సినిమాలోని కృష్ణుడి పాత్రలో నటించిన పవన్, మరోసారి అక్షయ్ చేసిన పాత్రలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సన్నిహితుడు రాధకృష్ణ, జాలీ ఎల్ఎల్బి 2 రీమేక్ రైట్స్ను సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాను పవన్ రీమేక్ చేస్తున్నట్టుగా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాకపోయినా.. పవన్ ఈ రీమేక్లో నటించనున్నాడన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement