అక్షయ్ సూపర్ హిట్పై టాలీవుడ్ కన్ను | Jolly LLb 2 Tollywood Remake | Sakshi
Sakshi News home page

అక్షయ్ సూపర్ హిట్పై టాలీవుడ్ కన్ను

Published Sat, May 6 2017 4:27 PM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM

అక్షయ్ సూపర్ హిట్పై టాలీవుడ్ కన్ను

అక్షయ్ సూపర్ హిట్పై టాలీవుడ్ కన్ను

యాక్షన్ హీరోగా సత్తా చాటి ప్రస్తుతం కామెడీ స్టార్గా ఆకట్టుకుంటున్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఇటీవల ప్రయోగాత్మక చిత్రాలతో వరుస సక్సెస్లు సాధిస్తున్న ఈ కిలాడీ 2.0 సినిమాతో విలన్ గానూ అలరించనున్నాడు. అక్షయ్ హీరోగా ఇటీవల బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన జాలీ ఎల్.ఎల్.బి 2 సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

టాలీవుడ్ నిర్మాత ఎస్ రాధకృష్ణ ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఓ స్టార్ హీరోతో జాలీ ఎల్ ఎల్ బి సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు. బాలీవుడ్లో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ రీమేక్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement