
వంద కోట్లు దాటిన 'జాలీ' కలెక్షన్లు
ముంబై: అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ’జాలీ ఎల్‌ఎల్‌బీ-2’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. విడుదల రెండు వారాల్లో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా ఇంకా మంచి కలెక్షన్లు రాబడుతోంది. నాలుగు వారాతంలో ఈ సినిమా రూ. 1.50 కోట్లు వసూలు చేసిందని ప్రముఖ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం రూ. 114.47 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని వెల్లడించారు. మొదటి వారంలో రూ. 72.98 కోట్లు, రెండో వారంలో రూ. 23.77 కోట్లు, మూడో వారంలో 8.03 కోట్లు వసూలు చేసింది.
అక్షయ్ కుమార్ ఇంతకుముందు నటించిన రుస్తుం, ఎయిర్ లిఫ్ట్, రౌడీ రాథోడ్ తదితర సినిమాలు కూడా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరాయి. 2013లో వచ్చిన ’జాలీ ఎల్‌ఎల్‌బీ’ కి సీక్వెల్‌గా తెరకెక్కిన ’జాలీ ఎల్‌ఎల్‌బీ-2’ లో అక్షయ్‌కుమార్ లాయర్ గా నటించాడు. అన్నుకపూర్, హ్యుమా ఖురేషీ, సౌరబ్ శుక్లా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.