బాక్సాఫీసు గలగల! | badalapur big collections at bollywood | Sakshi
Sakshi News home page

బాక్సాఫీసు గలగల!

Published Wed, Feb 25 2015 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

badalapur big collections at bollywood

రివేంజ్, వయోలెన్స్, కావల్సినంత రొమాన్స్... కుర్ర హీరో వరుణ్‌ధావన్ లేటెస్ట్ రిలీజ్ ‘బదలాపూర్’ బాక్సాఫీస్‌లో దుమ్ము లేపుతోంది. రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్‌లో వరుణ్... అతడితో శృంగారాన్ని పండించిన యామీగౌతమ్, హ్యుమా ఖురేషి, రాధికా ఆప్టే, దివ్యాదత్తా... మొత్తానికి ఓ ఫుల్‌టైమ్ ఎంటర్‌టైనర్‌గా అలరిస్తోంది.

నాలుగు రోజుల్లో 27.5 కోట్ల రూపాయలు వసూలు చేసి కలెక్షన్ల వర్షం కురిపిస్తోందన్నది ఓ వెబ్‌సైట్ కథనం. తొలి రోజు ఏడు కోట్ల రూపాయలతో మాంచి ఓపెనింగ్స్ సాధించింది. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలైతే ఈ సినిమాలో వరుణ్ నటనకు ఫ్లాటైపోయారు. అతడిపై తమతమ సామాజిక సైట్లలో లెక్కకు మించి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. పెద్దగా అనుభవం లేకపోయినా అద్భుతమైన అభినయంతో అదరగొట్టాడంటూ విమర్శకులు కూడా ట్వీటేస్తున్నారు!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement