బాక్సాఫీసు గలగల!
రివేంజ్, వయోలెన్స్, కావల్సినంత రొమాన్స్... కుర్ర హీరో వరుణ్‌ధావన్ లేటెస్ట్ రిలీజ్ ‘బదలాపూర్’ బాక్సాఫీస్‌లో దుమ్ము లేపుతోంది. రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్లో వరుణ్... అతడితో శృంగారాన్ని పండించిన యామీగౌతమ్, హ్యుమా ఖురేషి, రాధికా ఆప్టే, దివ్యాదత్తా... మొత్తానికి ఓ ఫుల్‌టైమ్ ఎంటర్టైనర్గా అలరిస్తోంది.
నాలుగు రోజుల్లో 27.5 కోట్ల రూపాయలు వసూలు చేసి కలెక్షన్ల వర్షం కురిపిస్తోందన్నది ఓ వెబ్సైట్ కథనం. తొలి రోజు ఏడు కోట్ల రూపాయలతో మాంచి ఓపెనింగ్స్ సాధించింది. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలైతే ఈ సినిమాలో వరుణ్ నటనకు ఫ్లాటైపోయారు. అతడిపై తమతమ సామాజిక సైట్లలో లెక్కకు మించి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. పెద్దగా అనుభవం లేకపోయినా అద్భుతమైన అభినయంతో అదరగొట్టాడంటూ విమర్శకులు కూడా ట్వీటేస్తున్నారు!