Tollywood Top Actor Refers Samantha For Hollywood Movie "Arrangement Of Love" - Sakshi
Sakshi News home page

Samantha Hollywood Movie: బోల్డ్‌ రోల్‌.. సామ్‌ అయితే సూట్‌ అవుతుందని హీరో రిఫర్‌

Published Tue, Nov 30 2021 10:43 AM | Last Updated on Tue, Nov 30 2021 6:58 PM

Buzz: Tollywood Top Actor Refers Samantha For Hollywood Movie - Sakshi

Tollywood Top Actor Behind Samantha Hollywood Movie Entry: స్టార్‌ హీరోయిన్‌ సమంత తొలిసారిగా హాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత  బై-సెక్సువల్‌ తమిళ అమ్మాయిగా కనిపించనున్నట్లు సమాచారం. ‘డోంటన్ అబ్బే’ఫేమ్‌ ఫిలిప్ జాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.

అయితే బాలీవుడ్‌ బడా హీరోయిన్స్‌ని కూడా పక్కనపెట్టి సమంతకు ఈ ఆఫర్‌ ఎలా వచ్చిందంటూ సోషల్‌మీడియాలో చర్చ మొదలైంది. సమంతతో ఓ బేబీ చిత్రాన్ని నిర్మిఇంచిన సునీతా తాటి హోం బ్యాన‌ర్‌ గురు ఫిలిమ్స్ ఇప్పుడు అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఫీమేల్‌ లీడ్‌  కోసం వెతుకుతున్న సమయంలో ఆ పాత్రకు సమంత అయితే బాగుంటుందని రానా రెఫర్‌ చేశాడటని సమాచారం.

ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న సమంత అయితే ఈ పాత్రకు సరిగ్గా సూట్‌ అవుతుందని రానా సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది. 

చదవండి: మహేశ్‌బాబుతో పోటీ పడనున్న విజయ్‌ దేవరకొండ
పెళ్లిని వాయిదా వేసుకున్న ఆలియా-రణ్‌బీర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement