ఇండియన్‌ స్క్రీన్స్‌కి ‘ఆల్‌ ఉయ్‌ ఇమాజిన్‌ యాజ్‌ ఏ లైట్‌’ | Rana Daggubati On Presenting Payal Kapadia's Film All We Imagine As Light, Deets Inside | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ స్క్రీన్స్‌కి ‘ఆల్‌ ఉయ్‌ ఇమాజిన్‌ యాజ్‌ ఏ లైట్‌’

Published Sun, Oct 20 2024 3:53 PM | Last Updated on Sun, Oct 20 2024 5:10 PM

Rana Daggubati on Presenting Film All We Imagine As Light

‘ఆల్‌ ఉయ్‌ ఇమాజిన్‌ యాజ్‌ ఏ లైట్‌’ చిత్రం ఇండియాలో విడుదలయ్యే సమయం ఆసన్నమైంది. కనికా కస్రుతి, దివ్య ప్రభ లీడ్‌ రోల్స్‌లో, ఛాయా కందం ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఆల్‌ ఉయ్‌ ఇమాజిన్‌ యాజ్‌ ఏ లైట్‌’. భారతీయ దర్శకురాలు పాయల్‌ కపాడియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఫ్రాన్స్, ఇండియా, నెదర్లాండ్స్, ఇటలీ, లక్సెంబర్గ్‌ దేశాల నిర్మాణ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి.

 ఈ చిత్రం ఈ ఏడాది మేలో జరిగిన 77వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై, గ్రాండ్‌ ప్రీ అవార్డును గెలుచుకుంది. 97వ ఆస్కార్‌ అవార్డ్స్‌లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా పరిశీలించిన సినిమాల జాబితాలోనూ ఈ చిత్రానికి చోటు దక్కింది. 

తాజాగా ఈ సినిమా ఇండియన్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. టాలీవుడ్‌ హీరో– నిర్మాత రానా స్పిరిట్‌ మీడియా సంస్థ ‘ఆల్‌ ఉయ్‌ ఇమాజిన్‌ యాజ్‌ ఏ లైట్‌’ చిత్రాన్ని రిలీజ్‌ చేయనుంది. నవంబరు 22న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు రానా సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే... కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ముంబైలో ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే ఊహించని ఓ ఘటన వీరి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది? అన్నదే ఈ చిత్రకథ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement